ఫేస్‌బుక్‌లో మీకు తెలియని ఆప్సన్స్

By Hazarath
|

ఫేస్‌బుక్‌ అంటే ఫొటోలు పోస్ట్‌ చేయడం, లైక్‌లు కొట్టడం మాత్రమే కాదు. ఎన్నో ఆప్షన్లున్నాయి. మీరు చేసే పోస్ట్‌లు ఫ్రెండ్స్‌కు మాత్రమే కాకుండా పబ్లిక్‌ అందరికీ కనిపించేలా ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌కు ఫ్రీకాల్‌ చేసి మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్‌కు తెలియకుండానే వారి పోస్ట్‌లు కనిపించకుండా బ్లాక్‌ చేయొచ్చు. అలాంటి ఎన్నో ఆప్షన్ల విశేషాలు మీకోసం... పోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్స్‌... ఉదయాన్నే ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి అప్‌డేట్‌ చేసిన ప్రొఫైల్‌ పిక్చర్‌కి ఎన్నిలైక్స్‌ వచ్చాయో చెక్‌ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్‌ టచ్‌లో ఉండటానికి, ఫీలింగ్స్‌ షేర్‌ చేసుకోవడానికి ఇది చక్కటి వేదికగా ఉంటోంది. అలాంటి ఫేస్‌బుక్‌లో ఉన్న ఆప్షన్ల గురించి చాలా మందికి తెలియదు.

Read more: ఒబామా నీ గాడ్జెట్స్ కేక మామా

నోటిఫికేషన్స్‌ :

నోటిఫికేషన్స్‌ :

ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్‌, అలర్ట్స్‌ మీకు చికాకు కలిగిస్తున్నాయా? అయితే నావికాన్‌ ఐకాన్‌ని ఎంచుకుని యాప్‌ సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయండి. తరువాత నోటిఫికేషన్స్‌పై ట్యాప్‌ చేస్తే వాల్‌పోస్ట్స్‌, మెసేజెస్‌, కామెంట్స్‌, ఫ్రెండ్‌ రిక్వెస్ట్స్‌, ఫొటో ట్యాగ్స్‌, ఈవెంట్‌ ఇన్వైట్స్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిని ఎనేబుల్‌లో లేక డిసేబుల్‌లో పెట్టుకోవచ్చు. డిసేబుల్‌లో పెట్టుకుంటే ఎటువంటి అలర్ట్స్‌ రావు.

వీడియో ప్లే :

వీడియో ప్లే :

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలను ఆటోమెటిక్‌గా ప్లే అయ్యేలా పెట్టుకోవచ్చు. లేదా వైఫై కనెక్షన్‌ ఉన్నప్పుడు మాత్రమే ప్లే అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు. అలా వద్దనుకుంటే మీరు సెలక్ట్‌ చేస్తేనే వీడియో ప్లే అయ్యేలా ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. నావికాన్‌ ఐకాన్‌లో యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే ‘వీడియోస్‌ ప్లే ఆటోమెటికల్లీ' అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేయడం ద్వారా మీకు నచ్చిన విధంగా ప్లే అయ్యేలా ఆప్షన్‌ సెట్‌
చేసుకోవచ్చు.

మీ పోస్ట్‌ అందరికీ కనిపించాలంటే... :
 

మీ పోస్ట్‌ అందరికీ కనిపించాలంటే... :

ఫేస్‌బుక్‌లో మీరు చేసిన పోస్ట్‌లు ఫ్రెండ్స్‌ మాత్రమే చూస్తారు. ఈ ఆప్షన్‌ డీఫాల్ట్‌గా ఉంటుంది. అలాకాకుండా మీ పోస్ట్‌ అందరూ చూడాలంటే పబ్లిక్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఇందుకోసం నావికాన్‌ఐకాన్‌లో అకౌంట్‌సెట్టింగ్స్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇందులో పబ్లిక్‌ పోస్ట్స్‌ అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేస్తే పబ్లిక్‌, ఫ్రెండ్స్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో పబ్లిక్‌ని ఎంచుకుంటే ఫేస్‌బుక్‌లో మీరు చేసే పోస్ట్‌ మీ ఫ్రెండ్స్‌ కాని వారికి కూడా కనిపిస్తుంది.

బ్లాక్‌ చేయాలంటే :

బ్లాక్‌ చేయాలంటే :

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ అకౌంట్‌ని బ్లాక్‌ చేయాలంటే చాలా సింపుల్‌. అకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే బ్లాకింగ్‌ అని ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఇంకో విండో ఒపెన్‌ అవుతుంది. అందులో ఎవరి అకౌంట్‌నైతే బ్లాక్‌ చేయాలనుకుంటున్నారో వారి పేరు లేక ఈమెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేసి బ్లాక్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. ఫేస్‌బుక్‌లో మీ టైమ్‌లైన్‌లోని పోస్ట్‌లను తను చూడలేడు.

సేవ్‌ వీడియోస్/లింక్స్‌ :

సేవ్‌ వీడియోస్/లింక్స్‌ :

రోజూ ఎన్నో వీడియోలు. చూద్దామంటే సమయం లేదు. అలాంటప్పుడు ఆ వీడియోను లేక లింక్‌ను బుక్‌మార్క్‌ చేయండి. ఈ కంటెంట్‌ సేవ్డ్‌ జాబితాలోకి చేరిపోతుంది. నావికాన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే సేవ్డ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీరు బుక్‌మార్క్‌ చేసిన వీడియోలు ఉంటాయి. వాటిని తీరిగ్గా చూసుకోవచ్చు.

ఫేవరేట్‌ ఫ్రెండ్స్‌ :

ఫేవరేట్‌ ఫ్రెండ్స్‌ :

ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్‌ జాబితా పెద్దదే. అందులో కొద్ది మంది ఫ్రెండ్స్‌ మాత్రమే రోజూ ఎఫ్‌బీలో టచ్‌లో ఉంటారు. అలాంటి వారిని లిస్ట్‌లో టాప్‌లో పెట్టుకుంటే వెతికే పనుండదు. ఇందుకోసం కుడివైపు కార్నర్‌లో ఉన్న పోట్రెయిట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. ఎడిట్‌ని సెలక్ట్‌ చేసుకుని ఎక్కువగా టచ్‌లో ఉండే కాంటాక్ట్స్‌ని ఎంచుకుని పిన్‌ చేస్తే చాలు. ఫేవరేట్‌ ఫ్రెండ్స్‌ అందరూ లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు.

టూ స్టెప్‌ అథంటికేషన్‌ :

టూ స్టెప్‌ అథంటికేషన్‌ :

యూజర్‌ఐడి, పాస్‌వర్డ్‌తో ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి ఎంటర్‌ కావడాన్ని సెక్యూర్‌గా ఫీల్‌ అవడం లేదా? అయితే టూ స్టెప్‌ అథంటికేషన్‌ని ఎంచుకోండి. ఫేస్‌బుక్‌లోకి ఎంటర్‌ అయ్యే ప్రతిసారి మిమ్మల్ని ఒక కోడ్‌ అడుగుతుంది. ఫేస్‌బుక్‌ యాప్‌లోనూ ఈ కోడ్‌ను పొందవచ్చు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ యాప్‌లో నావికాన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. తరువాత అకౌంట్‌సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇప్పుడు లాగిన్‌ అలర్ట్‌ అని ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే నోటిఫికేషన్స్‌, ఈమెయిల్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిని ఎనేబుల్‌లో పెట్టుకుంటే ఇతర డివైజ్‌ లేక బ్రౌజర్‌ నుంచి ఎవరైనా లాగిన్‌ అయితే వెంటనే మీకు అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. థర్డ్‌పార్టీ అథంటికేటర్‌ని ఎంచుకున్నట్లయితే కోడ్‌ని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

కోడ్‌ జనరేటర్‌ :

కోడ్‌ జనరేటర్‌ :

ఒకవేళ టూస్టెప్‌ అథంటికేషన్‌ని ఎనేబుల్‌లో పెట్టుకున్నట్లయితే ఫేస్‌బుక్‌ యాప్‌లోనే కోడ్‌ని పొందవచ్చు. ప్రతి 30 సెకన్లకు ఒక కోడ్‌ జనరేట్‌ అవుతూ ఉంటుంది. కోడ్‌ని పొందాలంటే ఫేస్‌బుక్‌ యాప్‌లో నావికాన్‌లోకి వెళ్లి కోడ్‌ జనరేటర్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.

గ్రూప్‌ మెసేజ్‌ :

గ్రూప్‌ మెసేజ్‌ :

ఫేస్‌బుక్‌లో మీరు ఎంచుకున్న వారికే మెసేజ్‌ను పంపుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం ఫేస్‌బుక్‌ యాప్‌లో మెసేజ్‌ఐకాన్‌పై క్లిక్‌ చే యాలి. తరువాత బాటమ్‌లో ఉన్న గ్రూప్‌ ఆప్షన్‌ని ఎంచుకుని గ్రూప్‌ మెసేజ్‌ పంపాలనుకుంటున్న కాంటాక్ట్స్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. తరువాత మీ మెసేజ్‌ని టైప్‌ చేసి సెండ్‌ కొట్టాలి. మీరు ఎంచుకున్న గ్రూప్‌ సభ్యులందరికీ ఆ మెసేజ్‌ వెళ్లిపోతుంది.

కామెంట్స్‌ని కాపీ చేయండిలా :

కామెంట్స్‌ని కాపీ చేయండిలా :

కొన్ని మంచి కామెంట్స్‌ని ఇతరులతో షేర్‌ చేసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ కామెంట్‌ని తిరిగి టైప్‌ చేయాల్సిన అవసరం లేకుండా కాపీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌లోకి వెళ్లాలి. ఏ కామెంట్‌ని కాపీ చేయాలనుకుంటున్నారో ఆ కామెంట్‌పై ట్యాప్‌ చేసి హోల్డ్‌ చేయాలి. అప్పుడు మీకు ఒక మెనూ కనిపిస్తుంది. అందులో కాపీని ఎంచుకుంటే చాలు.

మీరు మాత్రమే పోస్ట్‌ చేయాలంటే :

మీరు మాత్రమే పోస్ట్‌ చేయాలంటే :

టైమ్‌లైన్‌లో స్నేహితులు కామెంట్స్‌ పోస్ట్‌ చేయడం తెలిసిందే. అయితే మీ టైమ్‌లైన్‌లో ఫ్రెండ్స్‌ ఎలాంటి పోస్ట్‌లు చేయొద్దనుకుంటే ఫేస్‌బుక్‌ నావికాన్‌ ఐకాన్‌ని ఎంచుకుని అకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో టైమ్‌లైన్‌ అండ్‌ ట్యాగింగ్‌ని ట్యాప్‌ చేయాలి. ఇప్పుడు ‘హు కెన్‌ పోస్ట్‌ యువర్‌ టైమ్‌లైన్‌' అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై ట్యాప్‌ చేస్తే ఫ్రెండ్స్‌, ఓన్లీ మి అని రెండు ఆప్షన్లుంటాయి. ఓన్లీ మి ఎంచుకుంటే మీరు మాత్రమే టైమ్‌లైన్‌లో పోస్ట్‌ చేయగలుగుతారు.

ఫ్రెండ్‌ పోస్ట్‌ని చూడొద్దనుకుంటే...

ఫ్రెండ్‌ పోస్ట్‌ని చూడొద్దనుకుంటే...

ఫ్రెండ్‌ అప్‌డేట్‌ని చూడటం ఇష్టం లేదు. అలాగని అన్‌ఫ్రెండ్‌ చేయడం లేక బ్లాక్‌ చేయడం ఇష్టంలేదు. అలాంటప్పుడు ఆ ఫ్రెండ్‌ పేజీలోకి వెళ్లండి. ఫాలోవింగ్‌పై క్లిక్‌ చేసి అన్‌ఫాలోని సెలక్ట్‌ చేసుకోవాలి. అన్‌ఫాలోగా సెలక్ట్‌ చేసిన విషయం మీ ఫ్రెండ్‌కి తెలియదు. అతని పోస్ట్‌లు మీరు చూడలేరు.

ఫ్రీకాల్‌

ఫ్రీకాల్‌

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌తో ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. అయితే వారి స్మార్ట్‌ఫోన్‌లో మెసెంజర్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉండాలి. కాల్‌మాట్లాడుకోవాలనుకుంటున్న ఇద్దరూ ఆన్‌లైన్‌లో ఉండి ఉండాలి. కాల్‌చేయడం కోసం ఫేస్‌బుక్‌ యాప్‌లో మెసెంజర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. తరువాత చాట్‌రూమ్‌లో ఉన్న కాంటాక్ట్‌ని ఎంచుకోవాలి. ఇప్పుడు నావికాన్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి ఫ్రీకాల్‌ ఐకాన్‌ని ఎంచుకోవాలి. ఒకవేళ కాల్‌ కనెక్ట్‌ కాకపోతే మీ మెసేజ్‌ని రికార్డు చేసే సౌలభ్యం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Here Write Need You Know About Facebook options

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X