ఆపిల్ సామ్రాజ్యమా లేక స్వర్గానికి ద్వారమా..

Written By:

ఆపిల్.. ప్రపంచానికి రారాజు. ఈ కంపెనీ నుంచే వచ్చే ఏ ప్రొడక్టైనా సంచలనాలు నమోదు చేయాల్సిందే. అది కంప్యూటర్ కావచ్చు. లేకుంటే ఐ ఫోన్ కావచ్చు. మరి అలాంటి కంపెనీలో జాబ్ అంటే ఇంకెలా ఉంటుంది. జాబ్ సంగతి పక్కనబెడితే కంపెనీ లోపలికి ఒక్కసారి అడుగుపెడితే చాలని అనుకునే వాళ్లు చాలామందే ఉంటారు. అవును ఆ కంపెనీలోకి అడుగు పెట్టాలంటే ఆ అదృష్టం కొంతమందికే దక్కుతుంది. ఆపిల్ సామ్రాజ్యం ఎలా ఉంటుందో ఈ క్రింది ఫోటోలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

Read more: స్మార్ట్‌ఫోన్లతో స్మార్ట్‌గా వైద్యం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం చాలానే ఉంది. దీనికోసం ఆయన చాలానే కష్టపడ్డారు. 2009లో ఆయన నడుం బిగించారు. 2013లో కుపెర్టినో ప్లానింగ్ కమిషన్ ఈ ప్లాన్ ను ఎలా బయటకు తెస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే దానికి స్టీవ్ జాబ్స్ మీరు దాని గురించి ఆలోచించకండి ఎలా భాగస్వాములు కావాలో ఆలోచించడం అని చెప్పారు.

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్ ను ఇనస్పిరేషన్ గా తీసుకుని చేయడం జరిగింది. రింగ్ ఆకారంలో ఈ బిల్డింగ్ ను రెడీ చేస్తున్నారు. 2014లో కుపెర్టినో ప్లానింగ్ కమిషనర్ ఫాస్టర్ ఇది ఆర్కిటెక్ లోనే ఓ గొప్ప రికార్డు అంటూ పొగిడారు. పార్క్ అంతా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పార్క్ ను పోలి ఉంటుంది.

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు ఉండేందుకు వీలుగా ఉంటుంది. ఫ్లోర్ స్పేస్ దాదాపు 2. 8 మిలియన్ల చదరపు అడుగుల ఉంటుంది.మీటింగ్ కోసమే 80 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

ఈ ఆఫీసు కోసం వాడే అద్దాలు

ఈ ఆఫీసు కోసం వాడే అద్దాలు ప్రపంచంలోనే ఏ కంపెనీకి వాడనటువంటివి. కర్వ్ గ్లాసెస్ ను వాడారు.

10 వేల మంది కూర్చునే విధంగా

10 వేల మంది కూర్చునే విధంగా అండర్ గ్రౌండ్ లో ఆడిటోరియం ఉంటుంది.ఇందుకోసం లక్షా 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

క్యాంపస్ పూర్తి అయితే దాదాపు 80 శాతం పచ్చదనంతో

క్యాంపస్ పూర్తి అయితే దాదాపు 80 శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది.

ఆపిల్ చెట్లు సైతం కనువిందు

ఈ క్యాంపస్ లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఆపిల్ చెట్లు సైతం కనువిందు చేస్తాయి, అలాగే నేరేడు చెట్లతో క్యాంపస్ నిండిపోయి ఉంటుంది. అది ఆఫీస్ కాదు ప్లాంటేషన్ అంటేఎవరైనా ఇట్టే నమ్మేస్తారు.

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే నడుస్తుంది. ఇందుకోసం దాదాపు 70 వేల చదరపు అడుగుల్లో సోలార్ ప్యానల్స్ ను నిర్మించారు.

ఇందులో గాలి కూడా కేవలం వెంటిలేలేన్ సాయంతోనే

ఈ బిల్డింగ్ లో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే దీన్ని పూర్తిగా ప్రకృతి సిద్ధంగా నిర్మించారు. ఇందులో గాలి కూడా కేవలం వెంటిలేలేన్ సాయంతోనే నడుస్తుంది.అయితే ఇందులో మరో కోణం కూడా దాగి ఉంది మొత్తం గ్రీన్ తో నింపేయాలని ప్లాన్ లో భాగమని తెలుస్తోంది.

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని తిరిగి రీ సైక్లింగ్ చేసి క్యాంపస్ లోనే చెట్లకే వాడుతారు. ఇందులో రోజుకు లక్షా 57 వేల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీళ్లను వృధాగా పోనీయకుండా తిరిగి మెక్కలకే వాడే విధంగా ప్లాన్ చేశారు.

క్యాంపస్ మొత్తం 176 ఎకరాలు

క్యాంపస్ మొత్తం 176 ఎకరాలు ఉంటుంది. ఉద్యోగులు సైక్లింగ్ చేయవచ్చు. అలాగే బైక్ రైడింగ్ చేయవచ్చు. అలాగే జాగింగ్ చేయవచ్చు. దీనికొసం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా చెప్పలేమని ఓ ఇంటర్యూలో టిమ్ కుక్

ఈ ప్రాజెక్ట్ కోసం ఆపిల్ కంపెనీ ఖర్చు చేసిన మొత్తం 5 బిలియన్ డాలర్లు.అయితే ఇది అంచనా మాత్రమేనని ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా చెప్పలేమని ఓ ఇంటర్యూలో టిమ్ కుక్ అన్నారు.

పార్కింగ్ కు సంబంధించిన ప్లేస్ మొత్తం

పార్కింగ్ కు సంబంధించిన ప్లేస్ మొత్తం అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. దాదాపు 10,980 పార్కింగ్ స్పేస్ లు ఉన్నాయి. 3 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.

70 మిలియన్ డాలర్లతో అత్యాధునిక ఫిటినెస్

70 మిలియన్ డాలర్లతో అత్యాధునిక ఫిటినెస్ సెంటర్లను నిర్మించారు. లక్ష చదరపు అడుగుల్లో వాకింగ్ ఫిటినెస్ సెంటర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి 20 వేల మంది ఉద్యోగులు ఒకేసారి వాకింగ్ చేయవచ్చు.

60 వేల చదరపు అడుగుల్లో డైనింగ్ సెంటర్

60 వేల చదరపు అడుగుల్లో డైనింగ్ సెంటర్ ఉంటుంది. ఒకేసారి 2100 మంది ఉద్యోగులు కూర్చునే సౌకర్యం ఉంది. అంతే కాకుండా టెర్రస్ అవుట్ సైడ్ 1750 మంది ఉద్యోగులు కూర్చుని భోజనాలు చేయవచ్చు.

ఆఫీసుకు చేరుకునేందుకు వేరే మార్గాలను

ఆఫీసుకు చేరుకునేందుకు వేరే మార్గాలను సైతం ఆపిల్ ఏర్పాటు చేసింది. 20 శాతం మంది ఉద్యోగులు నివాసం ఉన్న చోటు నుంచి ప్రత్యేక వాహనాలను కూడా నడపనుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
16 incredible facts about Apple s new spaceship campus
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot