డిగ్రీలేదు.. కాని ప్రపంచాన్ని ఏలారు

Written By:

చేతిలో డిగ్రీ లేదు .కాని ఏదో ఒకటి చెయ్యాలి, డిగ్రీ లేదని చేతులు కట్టుకొని కూర్చోలేను. మాములుగా సర్దిపెట్టుకొని బ్రతికే రోజులు అయిపోయాయి. ఏదో ఒకటి సాధించాలి. డిగ్రీ లేకపోతేనేమి తెలివి ఉంది.. నా తెలివే పెట్టుబడిగా పెడతా..ప్రపంచానికి రారాజునవుతా..అవును నిజమే వారు డిగ్రీ లేకపోయినా తమ తెలివిని పెట్టుబడిగా పెట్టి ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కోట్లకు పడగలెత్తి పిహెచ్ డి పొందిన వారికి సవాల్ విసురుతున్నారు. బతకడానికి చదువు కావాలి కాని చదవడానికే బతుకు కాకూడదంటూ డిగ్రీని మధ్యలోనే వదిలి వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించిన వీరు అందరికీ ఆదర్శం.

Read more: ఇండియాను హడలెత్తిస్తున్న ఇంటర్నెట్ పిచ్చి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. స్టీవ్ జాబ్స్ (STEVE JOBS)

1. స్టీవ్ జాబ్స్ (STEVE JOBS)

‘యాపిల్' సంస్థను స్థాపించడం కోసం జాబ్స్ తాను చదువుతున్న రీడ్ కాలేజ్ ని మధ్యలోనే వదిలేశాడు. యాపిల్ కంపెనీని స్థాపించి తిరుగులేని వ్యాపార నేతగా మనముందు నిలిచారు.

2.మిషెల్ ఫెర్రెరో (MICHELE FERRERO)

2.మిషెల్ ఫెర్రెరో (MICHELE FERRERO)

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న ‘ఫెర్రెరో రోచర్స్' చాక్లెట్స్ సంస్థకు ఇతను అధిపతి. ఇతడు ఏనాడూ కాలేజీకే వెళ్లలేదు.

3.మైకేల్ డెల్ (MICHAEL DELL)

3.మైకేల్ డెల్ (MICHAEL DELL)

డెల్ కంప్యూటర్స్ సంస్థను స్థాపించిన ఈ బిలియనీర్.. టెక్సాస్ యూనివర్సిటీలో బయోలజీ చదువుతూ డ్రాప్ అయ్యాడు.

మార్క్ జూకర్ బర్గ్ (MARK ZUCKERBERG)

మార్క్ జూకర్ బర్గ్ (MARK ZUCKERBERG)

‘ఫేస్ బుక్' వంటి సంచలన సామాజిక మాధ్యమాన్ని క్రియేట్ చేసిన ఈ బిలియనీర్.. దాన్ని స్టార్ట్ చేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయ్యాడు.

లిలియానే బెట్టెన్ కోర్ట్ (LILIANE BETTENCOURT)

లిలియానే బెట్టెన్ కోర్ట్ (LILIANE BETTENCOURT)

లొరియాల్ కాస్మోటిక్ సంస్థను స్థాపించిన ఈమె.. అసలు కాలేజీకే వెళ్లలేదు. కాని తన తెలివితో కంపెనీని పరుగులు పెట్టించారు.

డస్టిన్ మోస్కోవిట్జ్ (Dustin Moskovitz)

డస్టిన్ మోస్కోవిట్జ్ (Dustin Moskovitz)

మోస్కోవిట్జ్ ఫేస్ బుక్ కో ఫౌండర్. ఇతనే ఫేస్ బుక్ లో ఫస్ట్ ఉద్యోగి..అలాగే ఫేస్ బుక్ లో కీలక పాత్ర పోషించారు.

ల్యారీ ఎల్లిన్ సన్ (LARRY ELLINSON)

ల్యారీ ఎల్లిన్ సన్ (LARRY ELLINSON)

‘ఒరాకిల్' సాఫ్ట్ వేర్ కో-ఫౌండర్, సీఈఓ అయిన ల్యారీ.. యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బనా-ఛాంపైన్ ల నుంచి డ్రాప్ అయ్యాడు.

హిరోషి యముషి (Hiroshi Yamauchi)

హిరోషి యముషి (Hiroshi Yamauchi)

నిటెండో కంపెనీ అధినేత. నిటెండోకి మూడవ అధిపతి హిరోషి తన 55 సంవత్సరాల వయసులో రిటైర్ అయ్యారు. ఇతను కాలేజి చదువను వదిలి తన వారసత్వ బిజినెస్ నిటెండోను చేపట్టారు. అనతి కాలంలోనే దాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు.

జాన్ కౌమ్ (JAN KOUM)

జాన్ కౌమ్ (JAN KOUM)

మొబైల్ మెస్సెంజింగ్ యాప్ అయిన ‘వాట్సాప్'ను క్రియేట్ చేసిన ఇతగాడు.. శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయ్యాడు.

జాక్ డోర్సీ (JACK DORSEY)

జాక్ డోర్సీ (JACK DORSEY)

‘ట్విటర్' వంటి సామాజిక మాధ్యమాన్ని సృష్టించిన ఈ బిలియనీర్.. మిస్సోరీలోని సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయ్యాడు.

బిల్ గేట్స్ (BILL GATES)

బిల్ గేట్స్ (BILL GATES)

తన ఫ్రెండుతో కలిసి ‘మైక్రోసాఫ్ట్' సంస్థను స్థాపించిన బిల్ గేట్స్... ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ గా పేరుగాంచాడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగానే డ్రాప్ అయ్యాడు.

అజిమ్ ప్రేమ్ జీ (Azim Premji)

అజిమ్ ప్రేమ్ జీ (Azim Premji)

తండ్రి హఠాన్మరణం కారణంగా విప్రో సంస్థ బాధ్యతలు చేపట్టడం కోసం 21 ఏటలో ఈయన స్టాన్ ఫర్ట్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయ్యాడు.

పాల్ అలెన్ (Paul Allen)

పాల్ అలెన్ (Paul Allen)

స్కూలు చదువును పూర్తి చేసుకున్న పాల్ డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. వాషిగ్టంన్ స్టేట్ యూనివర్సిటీ లో డిగ్రీలో చేరి అది నచ్చక మధ్యలోనే దానికి రాంరాం చెప్పారు. 1975లో బిల్ గేట్స్ తో కలిపి మైక్రోసాఫ్ట్ ను స్థాపించి ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు.

సీన్ పార్కర్( Sean Parker)

సీన్ పార్కర్( Sean Parker)

పార్కర్ తన జీవిత కాలంలో ఎప్పుడూ కాలేజీ గడప తొక్కలేదు. కాని ఇప్పుడు కోట్లకు వారసుడు. ప్లేక్సో కంపెనీని స్థాపించి అనతికాలంలోనే ఎదిగాడు. నాప్స్టార్ కు కై పౌండర్ ఇంకా ఫేస్ బుక్ కు తొలి ప్రెసిడెటంట్ ఇతనే

ఈవాన్ విలియమ్స్ ( Evan Williams)

ఈవాన్ విలియమ్స్ ( Evan Williams)

ట్విట్టర్ కౌ పౌండర్.కాలేజి చదువుకు మధ్యలోనే రాంరాం చెప్పి ట్విట్టర్ అనే మహా సామ్రాజ్యానికి అంకురార్పణ చేశాడు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

గ్యాబ్ నివెల్ (Gabe Newell)

గ్యాబ్ నివెల్ (Gabe Newell)

వాల్వ్ కార్పోరేషన్ అధినేత దాని స్థాపకుడు.ఇది వీడియో గేమ్ కంపెనీ ఇతను మైక్రోసాఫ్ట్ లో 13 సంవత్సరాలు పనిచేసిన తరువాత ఈ కంపెనీని స్థాపించారు. మైక్రోసాఫ్ట్ మొదట రిలీజ్ చేసిన మూడు విండోలకు ఇతనే ప్రొడ్యూసర్?హర్వర్ట్ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే తన చదువుకు రాంరాం చెప్పి ఉద్యోగం వైపు అడుగులు వేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 16 Tech Superstars Who Didn't Need College To Become Billionaires
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting