ఇండియాను హడలెత్తిస్తున్న ఇంటర్నెట్ పిచ్చి

Written By:

ఇండియాలో ఇంటర్నెట్ పిచ్చి అందరినీ హడలెత్తిస్తోంది. అది అలాంటి ఇలాంటి హడల్ కాదు..రానున్న కాలంలో అమెరికా కూడా ఇండియా దెబ్బకు తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితి రానుందంటే నమ్మండి. పదేళ్ల కాలంలో 10 నుంచి 100 మిలియన్లకే చేరితే 200 మిలియన్లకు చేరడానికి పట్టిన సంవత్సరాలు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 300 నుంచి 400 మిలియన్లకు రావడానికి కేవలం సంవత్సరం మాత్రమే పట్టిందట.. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ లాంటిదే.

Read more: గూగుల్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో ఇంటర్నెట్‌ను వాడే వినియోగదారుల సంఖ్య 402 మిలియన్లకు

ఈ ఏడాది చివరి వరకు భారత్‌లో ఇంటర్నెట్‌ను వాడే వినియోగదారుల సంఖ్య 402 మిలియన్లకు చేరుకుంటుందని 'ఐఏఎంఏఐ' చేసిన సర్వేలో వెల్లడైంది. 2015 డిసెంబర్ చివరి వరకు ఈ సంఖ్య నమోదు కానుందని సర్వేలో తేలింది. గతేడాదితో పోలిస్తే ఈ వృద్ధి రేటు 49 శాతానికి పెరినట్టు తెలిసింది.

300 నుంచి 400 మిలియన్లు అయ్యేందుకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే

భారత్‌లో ఇంటర్నెట్‌ను వాడే వారి సంఖ్య 10 మిలియన్ల నుంచి 100 మిలియన్లు కావడానికి దశాబ్దం పడితే 100 నుంచి 200 మిలియన్లు కావడానికి 3 ఏళ్లు పట్టిందని, 300 నుంచి 400 మిలియన్లు అయ్యేందుకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే పట్టిందని సర్వే చేసిన పరిశోధకులు వెల్లడించారు.

వచ్చే ఏడాది జూన్ నెల వరకు ఈ సంఖ్య 462 మిలియన్లకు

వచ్చే ఏడాది జూన్ నెల వరకు ఈ సంఖ్య 462 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ సంఖ్యతో భారత్ అమెరికాను దాటి అత్యధిక ఇంటర్నెట్ యూజర్లు కలిగిన దేశాల్లో ద్వితీయ స్థానం పొందనుంది. 600 మిలియన్ యూజర్లతో చైనా మొదటి స్థానంలో ఉంది.

నగరాలే కాక పట్టణాలు, గ్రామాల్లోనూ

నగరాలే కాక పట్టణాలు, గ్రామాల్లోనూ ఇంటర్నెట్‌ను వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. కాగా ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికర విషయమేమిటంటే అధిక శాతం మంది యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్లలోనే ఇంటర్నెట్‌ను వాడేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది.

‘ఇండియాలో ఇంటర్నెట్-2015' పేరుతో

‘ఇండియాలో ఇంటర్నెట్-2015' పేరుతో ది ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్‌బి ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. ప్రస్తుత భారతదేశంలో ఇంటర్నెట్ అనేది ప్రతీ ఒక్కరికీ ప్రధాన సాధనంగా మారింది. ఇది డిజిటల్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఓ సూచికగా చెప్పుకోవచ్చు.

2015 అక్టోబర్‌లో 375 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు

2015 అక్టోబర్‌లో 375 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్లు ఎక్కువగా ఉన్న తృతీయ దేశంగా కొనసాగుతోంది. అయితే ఈ డిసెంబర్ నాటికి ఇంటర్నెట్ యూజర్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ద్వితీయ స్థానంలో ఉన్న అమెరికాను అధిగమించే అవకాశం కనిపిస్తోంది.

600మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లతో చైనా అగ్రస్థానంలో

ప్రస్తుతం 600మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంటర్నెట్ యూజర్ల పెరిగితే చైనా తర్వాతి స్థానం భారతదేశందే. నివేదిక ప్రకారం.. 71శాతం పురుషులు, 29శాతం మహిళలు భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ శాతంలో పురుషులు 50శాతంలో పెరుగుతుండగా, మహిళలు 46శాతంతో పెరుగుతున్నారు. నగరాల్లో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు, మహిళలు 62:46శాతంగా ఉంది.

గ్రామీణ ఇంటర్నెట్ యూజర్లలో 88శాతం పురుషులే

గ్రామీణ ఇంటర్నెట్ యూజర్లలో 88శాతం పురుషులే ఉన్నారు. 61శాతంతో మహిళా యూజర్ల పెరుగుదల ఉండగా, 79శాతంతో పురుషులు పెరుగుదల ఉంది. 18-30ఏళ్ల వారే గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. మిగితా 11శాతం మంది 18ఏళ్ల లోపువారు, 8శాతం మంది 31-45ఏళ్ల వయస్సుల వారు వినియోగిస్తున్నారు.

కాలేజీకి వెళ్లే విద్యార్థులే 26శాతం

32శాతం మంది యూజర్లలో కాలేజీకి వెళ్లే విద్యార్థులే 26శాతం ఉన్నారు. నాన్ వర్కింగ్ వుమెన్లలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఎక్కువ పెరుగుదల నమోదవుతోంది. గతేడాడి ఈ పెరుగుదల 97శాతంగా ఉంది. పాఠశాలకు వెళ్లే అమ్మాయిల్లో 36శాతం, కళాశాలకు వెళ్లే అమ్మాయిల్లో 26శాతం పెరుగుదల నమోదైంది.

దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజువారీగా

దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజువారీగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 2015నాటికి 69శాతం రోజువారీగా ఉపయోగిస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటూ 60శాతం పెరుగుదల కనిపిస్తోంది. కళాశాలకు వెళ్లే విద్యార్థులు, యువకులే అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తుండటం గమనార్హం.

75శాతం వర్కింగ్ వుమెన్ రోజూ ఇంటర్నెట్

కాగా, 75శాతం వర్కింగ్ వుమెన్ రోజూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. రోజువారీగా ఉపయోగిస్తున్న వారిలో 37శాతం పురుష వినియోగదారులుండగా, 23శాతం మహిళా వినియోదారులున్నారు. 75శాతం స్త్రీ, పురుషులిద్దరూ వారంలో కనీసం ఒక్కసారైన ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.

65శాతం మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు

పట్టణ భారతదేశంలో 65శాతం మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు పెరిగిపోయారు. గతేడాది కంటే 65శాతం పెరుగుదల నమోదు చేసి 197 మిలియన్లకు చేరుకుంది ఈ అక్టోబర్ నాటికి. గతేడాది కంటే 99శాతం పెరుగుదలతో అక్టోబర్ చివరినాటికి ఈ సంఖ్య 80మిలియన్లకు చేరుకుంది.

2016 జూన్ నాటికి 109 మిలియన్లకు చేరుకునే అవకాశం

గ్రామీణ భారత వినియోగదరులను చూసుకున్నట్లయితే డిసెంబర్ 2015 నాటికి 87 మిలియన్లకు చేరుకుంటుండగా, 2016 జూన్ నాటికి 109 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది.

11.4మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగించేందుకు

35నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఆసక్తికరంగా 11.4మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగించేందుకు విముఖత చూపుతున్నారు. వారిలో 2/3శాతం మంది వచ్చే ఏడాదిలోగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write With 243 million users by 2014 India to beat US in internet reach: Study
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot