సోప్‌ల ప్రపంచం నుండి సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యందాకా..

|

దేశంలో అత్యంత ఉదారావాదిగా అలాగే ఎక్కువ సంపాదనను దానం చేసిన వ్యక్తిగా ఎవరైనా నిలిచారంటే అది ఒక్క విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీకి మాత్రమే సాధ్యం. తనకున్న సంపాదనలో చాలాభాగం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ అపర దాతృత్వ వేత్తగా జేజేలు అందుకుంటున్నాడు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నారు. సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా ప్రయాణం సాగించి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణాన్ని అలవర్చుకున్న ఈ దానకర్ణుడి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం.

 

డిగ్రీలేదు.. కాని ప్రపంచాన్ని ఏలారు

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

అజీమ్ ప్రేమ్‌జీ గుజరాత్ నుంచి వచ్చి ముంబై లో నివసిస్తున్న ఒక షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఆయన తండ్రి ఎం.హెచ్. ప్రేమ్‌జీ వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రాడక్ట్ కంపెనీ (దీన్నే తరువాత విప్రో గా మార్చడం జరిగింది)అనే సంస్థకు యజమాని. ఈ సంస్థ వంటనూనెలు ఉత్పత్తి చేసేది.

 

 

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

21 ఏళ్ల వయసులో తండ్రి అకాల మరణంతో స్టాన్ పోర్డ్ యూనివర్సిటీలో చదువుకు మధ్యలో రాంరాం చెప్పి విప్రో పగ్గాలు అందుకున్నాడు. ఆ తరువాత 30 ఏళ్లకు పట్టుబట్టి తన డిగ్రీని పూర్తి చేశారు. అప్పుడు కంపెనీ వంట నూనెల ఉత్పత్తిని తయారు చేస్తుండేది.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..
 

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణమైన మహమ్మదాలీ జిన్నా ఒకానొక దశలో అజీమ్ ప్రేమ్ జీ తండ్రిని పాకిస్తాన్ కు వెళ్లమని చెప్పాడు. అయితే దాన్ని అజీమ్ తండ్రి సున్నితంగా తిరస్కరించి నాకు ఇండియాలో ఉండటమంటేనే ఇష్టమని ఇక్కడే తన వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు ఏర్పరిచాడు.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

మూడు సంవత్సరాల తరువాత ఇద్దరు సీఈఓలను నియమించి సంచలనానికి తెరలేపారు. వారిలో ఒకరు సురేష్ వశ్వని కాగా మరొకరు గిరీష్ పరాంజే. అకారణంగా సడన్ గా అలా మార్చడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నంత పనిచేశారు. అయితే కంపెనీ మాత్రం డెవలప్ మెంట్ కోసమేనని చెప్పింది.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

అజీమ్ కు టాటా అధినేత జెఆర్ డి టాటా అంటే చాలా ఇష్టం. నా ఐకాన్ జహంగీర్ దాదాబాయ్ టాటా అని ఎల్లప్పుడూ చెబుతుంటారు. ఎంతోమంది ఆయన నుంచి ఇన్స్పిరేషన్ పొందారని నేను అందులో ఒకరినని చెబుతారు. నాయకత్వ లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలని చెబుతారు.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

విమానాలలో వసతులను బట్టి రకరకాల తరగతులుగా విభజిస్తారు. కొన్ని కోట్ల రుపాయల సంపదను కలిగి ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ ఎప్పుడు కూడా సాధారణ తరగతిలో ప్రయాణం చేసేవాడు.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సమయాన్ని ఖచ్చితంగా పాటించే అజీమ్‌ ప్రేమ్‌జీ ఎప్పుడు కూడా తన కారు కోసం వేచి చూసేవాడు కాదు. ప్రజారవాణాలో వినియోగించే సిటి బస్సులలో మరియు ఆటో రిక్షాలలో ప్రయాణించడం ఇతనికి షరామామూలే.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

విప్రో కంపెనీలో తన వాటా నుంచి దాదాపు 8.6 శాతం షేర్లు అంటే 8,646 కోట్లు అజీమ్ ప్రేమ్ జీ పౌండేషన్ కి విరాళంగా ఇచ్చారు. ఈ సంస్థ అనేక సామాజిక కార్యక్రమాలను చేస్తోంది. ఈ ఫౌండేషన్ 8 రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల యాభై వేల పాఠశాలల్లో తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. ఇప్పటివరకు 30 వేల కోట్లకు పైగానే విద్యతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు దానం చేశారు.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

కాలక్షేపం కోసం సినిమాలు అలాగే కొండలు ఎక్కడం చేస్తుంటారు. బయటకెళ్లితే అఫీసును పూర్తిగా మరచిపోతారు.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

2011లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నాడు. అలాగే 2005లో పద్మభూషణ్ అందుకున్నాడు.ఇంకా ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

కంపెనీ అభివృద్ధి పధంలో నడవాలంటే నీవు నీ సహచర ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలవు. నీ శక్తిని మాత్రమే నీవు నమ్ముకుంటే పైకి వస్తావు.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

ఇన్ని కోట్లు ఉన్నా ఆజీమ్ ప్రేమ్ జీ వాడేది సెకండ్ హ్యాండ్ కారు. 50 లక్షలు పోసి మెర్సిడెంజ్ బెంజ్ కారును కొనడం ఎందుకని అదే కంపెనీకి చెందిన సెకండ్ హ్యాండ్ కారుని కొన్నారు. దాన్నే తన వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారు కూడా .

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

ఇక ఆయన షేవింగ్ కోసం ఏం క్రీమ్ ను వాడుతారో తెలుసా విప్రో కంపెనీ తయారుచేస్తున్న చంద్రిక సబ్బునే వినియోగిస్తారు. ఎందుకని ఎవరైనా అడిగితే మన కంపెనీ సబ్బును మనం వాడకపోతే ఇంకెవరు వాడుతారని సున్నితంగా బదులిస్తారట.

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

సోప్‌ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా..

ప్రేమ్ జీ ఇప్పటిదాకా తన వ్యక్తిగత సంపద నుంచి 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను దానధర్మాల కోసం అందించారట. అది కూడా కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే ఇంత మేర దాతృత్వం ప్రదర్శించడం విశేషం. భారత్ లో భారీస్థాయిలో వితరణ చేసిన వ్యక్తుల్లో అజీమ్ ప్రేమ్ జీనే టాప్ అంటూ చైనాకు చెందిన ద హరూన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Here Write 16 Things You Should Know About Indian Business Tycoon, wipro chairman Azim Premji

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X