నోకియాకు ‘4’ కలిసిరాదా..?

Posted By:

నిన్న మొన్నటి వకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ప్రముఖంగా వినిపించిన పేరు ‘నోకియా'. దశాబ్ధాల కాలంగా అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తూ వచ్చిన ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి ఎదురవుతోన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో నోకియా భవిష్యత్ ప్రశార్థకంలో పడినట్లు తెలుస్తోంది. మార్కెట్లో తిరిగి పుంజుకునేందుకు నోకియా ఆధునిక వర్షన్ ఫోన్‌ల రూపకల్పన పై దృష్టి సారించినట్లు సమాచారం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించుకుందాం..

ఇంకా చదవండి: షియోమి ధర తగ్గింపు ప్లాన్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘నోకియా ట్యూన్' రింగ్‌టోన్ 19వ శతాబ్థపు గిటార్ వర్క్ ‘గ్రాన్ వాల్స్' ప్రేరణతో పుట్టుకొచ్చింది. 1998లో ‘నోకియా ట్యూన్'కు మరింత ప్రాచుర్యం లభించింది.

ప్రపంచపు మొట్టమొదటి వాణిజ్యపరమైన జీఎస్ఎమ్ కాల్ 1991లో హెల్సింకి నుంచి చేయబడింది. ఈ నెట్‌వర్క్‌ను నోకియా సమకూర్చటం విశేషం.

డిజిటల్ కెమెరా‌తో కూడిన మొబైల్ ఫోన్‌లను అత్యధికంగా విక్రయించిన బ్రాండ్‌గా నోకియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆసియా ఖండంలోని అనేక ప్రాంతాల్లో విడుదలయ్యే నోకియా ఫోన్ లకు సంబంధించిన మోడల్ నెంబర్లలో ‘4' అంకె మనుకు కనిపించదు. కారణం, నోకియాకు (4) సంఖ్య కలిసిరాదట!.

ఫార్చ్యూన్ 2006 జాబితాలో నోకియా ప్రపంచవ్యాప్తంగా 20 వ అత్యంత ప్రశంసనీయ సంస్థగా నిలిచింది.

నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లూమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం.

ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది. 19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది.

ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
1O interesting facts about nokia. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot