ఆకాశం నుంచి తీసిన అందమైన చిత్రాలు

By Hazarath
|

ఓ విషాదం..ఓ ఆనందం..అలాగే ఓ అద్భుతం..ఇంకా ఆశ్చర్యం...ఇలా ప్రపంచం మెచ్చిన చిత్రాలు..అలాగే మరచిపోలేని చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని చిత్రాలు ఆసక్తితో పాటు ఉత్కంఠకు గురిచేశాయి..ఎక్కడో వేల కిలోమీటర్ల దూరాన ఉన్న ఆకాశం నుంచి తీసిన ఈ చిత్రాలను అందరూ ఊపిరి బిగపట్టుకుని చూశారు..అంత అద్బుతంగా తీసిన ఈ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

Read more : మిస్సయిన విమానంపై నివ్వెరపరిచే వాస్తవాలు

ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ నగరం

ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ నగరం

నార్త్ రన్ ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ నగరం ఇది..ఏంతో అత్యద్భుతంగా ఉన్న ఈ చిత్రంలో ఓ పాప నవ్వుతూ కనపిస్తూ అందరినీ అబ్బురపరిచింది.వీరి కళకు నిజంగా విష్ చెప్పాల్సిందే.నవంబర్ 2 2013న క్లిక్ మనిపించారు.

సిరియాలోని అలెప్పో నగరంలోని ఓ మధ్య యుగ ప్యాలెస్

సిరియాలోని అలెప్పో నగరంలోని ఓ మధ్య యుగ ప్యాలెస్

సిరియాలోని అలెప్పో నగరంలోని ఓ మధ్య యుగ ప్యాలెస్ ఇది. వాదీన్ని మే 26 2013న క్లిక్ మనిపించారు.

యుఎస్ ఎ లోని కొలరాడో నది
 

యుఎస్ ఎ లోని కొలరాడో నది

ఇక్కడ పాములాగా వంకర్లు తిరుగుతున్న ఇది ఓ ప్రఖ్యాత నది..యుఎస్ ఎ లోని కొలరాడో నది...ఎంతో అద్బుతంగా వయ్యారాలు ఒలకపోస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 ,2013న క్లిక్ మనిపించారు.

కాంబంబె డ్యామ్.అలాగే క్యాన్జా నది

కాంబంబె డ్యామ్.అలాగే క్యాన్జా నది

మధ్యలో తెల్లని జలపాతంతో హోయలు పోతున్న ఈ చిత్రం ఆంగోలా లోని కాంబంబె డ్యామ్.అలాగే క్యాన్జా నది...ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 2013న క్లిక్ మనిపించారు.

దోహలోని ఖతార్ లో ఉన్న 4 వేల మిలియన్ల స్వాయిర్ మీటర్లలో విస్తరించిన కృత్రిమ ద్వీపం

దోహలోని ఖతార్ లో ఉన్న 4 వేల మిలియన్ల స్వాయిర్ మీటర్లలో విస్తరించిన కృత్రిమ ద్వీపం

చుట్టూ సముద్రం ఉందా అన్నంతగా ఉన్న ఈ చిత్రంలో నిజంగా సముద్రం లేదు.ఇది ఎడారిదేశం లోనిది. దోహలోని ఖతార్ లో ఉన్న 4 వేల మిలియన్ల స్వాయిర్ మీటర్లలో విస్తరించిన కృత్రిమ ద్వీపం.ఇది మార్చి 4 2013న క్లిక్ మనిపించారు.

ఆస్ట్రేలియాలోని డొనెల్లీలోని ఓ ప్రాంతం

ఆస్ట్రేలియాలోని డొనెల్లీలోని ఓ ప్రాంతం

ఆస్ట్రేలియాలోని డొనెల్లీలోని ఓ ప్రాంతం. చుట్టూ మంటలు ఉన్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం జనవరి 6 2013న క్లిక్ మనిపించారు.

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీప్

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీప్

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీప్ ఇది. ఐసు గడ్డలతో మరో హిమాలయాలను తలపిస్తున్నట్లుండే ఈ చిత్రం ఏప్రిల్ 22 2013న తీసారు.

దాయాది దేశంలోని గ్వాదర్ కోస్ట్ ఏరియా ప్రాంతం

దాయాది దేశంలోని గ్వాదర్ కోస్ట్ ఏరియా ప్రాంతం

దాయాది దేశంలోని గ్వాదర్ కోస్ట్ ఏరియా ప్రాంతం ఇది. భూకంపాన్ని తెలుసుకోవడం కోసం ఈ కోస్ట్ ద్వీపాన్ని ఏర్పాటు చేశారు.

ప్రేమ గుర్తుకు చిహ్నంగా ఉన్న ఈ ద్వీపం క్రోటియాలోనిది

ప్రేమ గుర్తుకు చిహ్నంగా ఉన్న ఈ ద్వీపం క్రోటియాలోనిది

ప్రేమ గుర్తుకు చిహ్నంగా ఉన్న ఈ ద్వీపం క్రోటియాలోనిది. లవ్ ఆకారంలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16 2013న క్లిక్ మనిపించారు.

 గెయింట్ రబ్బర్ ట్కాంక్

గెయింట్ రబ్బర్ ట్కాంక్

చైనాలోని హాంకాంగ్ లో గల గెయింట్ రబ్బర్ ట్కాంక్ ఇది. సముద్రమంతా ఆక్రమించినట్లుండే ఈ చిత్రాన్ని మే9 2013న క్లిక్ మనిపించారు.

న్యూగినియాలోని పపూ నగరంలోనిది

న్యూగినియాలోని పపూ నగరంలోనిది

ఇంత పెద్ద ఆకు కూడా ఉంటుందా అనిపించే ఈ చిత్రం న్యూగినియాలోని పపూ నగరంలోనిది. నిజానికి ఇది ఒక అగ్ని పర్వతం. దీన్నుంచి లావా బయలకు వస్తున్నప్పుడు మార్చి 22 2013న క్లిక్ మనిపించారు.

నంబాయిలోని ఓ ఎడారి ప్రాంతం

నంబాయిలోని ఓ ఎడారి ప్రాంతం

ఎడారి కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్లుండే ఈ చిత్రాన్ని మే 13 2013న క్లిక్ మనిపించారు. ఇది నంబాయిలోని ఓ ఎడారి ప్రాంతం.

ఇటలీలోని నేపెల్స్ లో గల పర్వత శిఖరం

ఇటలీలోని నేపెల్స్ లో గల పర్వత శిఖరం

ఇంత పెద్ద గొయ్యా అని ఆశ్చర్యపోతున్నారా..నిజానికి ఇది గొయ్య కాదు ఓ పర్వతానికి సంబంధించింది. ఇటలీలోని నేపెల్స్ లో గల పర్వత శిఖరం ఇది. దీన్ని ఫిబ్రవరి 9 2013న క్లిక్ మనిపించారు

ఓ యురేనియం మైన్

ఓ యురేనియం మైన్

ఇదేదో విచిత్రంగా ఉంది కదా..నిజానికి ఇది ఓ యురేనియం మైన్..నైజర్ లో ఉంది. దీన్ని ఫిబ్రవరి 13 2013న క్లిక్ మనిపించారు.

స్కూనర్ దీవులలో ఉన్న  ఓ ప్రాంతం ఇది

స్కూనర్ దీవులలో ఉన్న ఓ ప్రాంతం ఇది

స్కూనర్ దీవులలో ఉన్న ఓ ప్రాంతం ఇది. బహమాస్ లో ఉంది. దీన్ని మే 26 2013న క్లిక్ మనిపించారు.

2014వింటర్ ఒలంపిక్స్ సైట్

2014వింటర్ ఒలంపిక్స్ సైట్

2014వింటర్ ఒలంపిక్స్ సైట్ ఇది ఇది రష్యాలోని సోచి నగరంలో ఉంది. దీన్ని మార్చి 17 2013న క్లిక్ మనిపించారు.

ఒమన్ లోని సుర్ సిటీకి దగ్గర్లోని ప్రాంతం

ఒమన్ లోని సుర్ సిటీకి దగ్గర్లోని ప్రాంతం

ఆకుపచ్చ పోటులాగా ఉన్న ఈ చిత్రం ఒమన్ లోని సుర్ సిటీకి దగ్గర్లోని ప్రాంతం. దీన్ని ఫిబ్రవరి 13 2013 న క్లిక్ మనిపించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write 20 Breathtaking Images Of The Earth As Seen From Space

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X