చరిత్ర గతిని మార్చిన ఆవిష్కరణలు

By Hazarath
|

ఓ ఆవిష్కరణ ప్రపంచగతిని మార్చింది. ఓ ఆవిష్కరణ ప్రపంచానికి వెలుగు దారిని చూపింది. ఓ ఆవిష్కరణ ప్రపంచాన్ని పరుగులు పెట్టించింది. ఓ ఆవిష్కరణ ప్రపంచాన్ని గాల్లోకి లేపింది. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని రోజుల్లో చేసిన ఈ ఆవిష్కరణలు ప్రపంచానికి ఇప్పుడు కొత్త దారిని చూపిస్తున్నాయి. నాడు వారు కనిపెట్టిన ఆవిష్కరణ నేడు కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఎన్నో విషయాలను మనకు నేర్పుతోంది. ఎన్ని కొత్త ఆవిష్కరణలు జరిగినా నేటికి అవి చిరస్థాయిగానే ఉన్నాయి. విజ్ఙానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో వారు కనిపెట్టిన అనేక పరికరాలు ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వారే కనిపెట్టిన వస్తువులు మనకు గమ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి నాడు ఆ పరిశోధకులు కనిపెట్టిన పరికరాలను అలాగే ఆ పరిశోధకులను మీకు పరిచయం చేస్తోంది గిజ్‌బాట్.

Read more: ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

మార్టిన్ కూపర్..( సెల్ ఫోన్)

మార్టిన్ కూపర్..( సెల్ ఫోన్)

మొబైల్‌ఫోన్ వాడకం ప్రారంభమై 2015 ఏప్రిల్ 3తోనే 42 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారి మొబైల్ ఫోన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న చేసిన కాల్‌తో మొబైల్ ఫోన్ వాడకం మొదలైంది. అతనే మొబైల్ ఫోన్ కు ఆది గురువుగా చెప్పుకుంటారు.

ఫెర్రీ స్పెన్సర్....( మైక్రోవేవ్ )

ఫెర్రీ స్పెన్సర్....( మైక్రోవేవ్ )

ఇప్పుడు వంటింట్లో మనం వాడుతున్న మైక్రోవేవ్ ని కనిపెట్టింది స్పెన్సర్.1945 లో దీనికి సంబంధించి పేటెంట్ తీసుకున్నారు.1947లో మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు దీని ధర 2000 నుంచి 3000 డాలర్ల వరకు ఉన్నది. 6 అడుగుల పొడవుతో పాటు 750 ఎల్ బిఎస్ ఉండేది.

చెస్టర్ కార్లసన్...( ఎలక్ట్రో ఫోటోగ్రఫీ )

చెస్టర్ కార్లసన్...( ఎలక్ట్రో ఫోటోగ్రఫీ )

కటిక దరిద్రం నుంచి ఎదిగిన అసామాన్యుడు. తినడానికి తిండి లేదు. చేయడానికి జాబు లేదు. కాని ప్రపంచానికి తనేంటో చూపించాలనుకున్నాడు. తన ఆవిష్కరణతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు.

విల్స్ హ్యవిలాండ్ క్యారియర్ (ఎయిర్ కండీషనింగ్ )

విల్స్ హ్యవిలాండ్ క్యారియర్ (ఎయిర్ కండీషనింగ్ )

1902లో విల్స్ హ్యవిలాండ్ ఓ సంచలనానికి వారధిగా నిలిచాడు. తాను కనిపెట్టిన ప్రయోగం ప్రపంచ గతినే మార్చివేస్తుందని ఆయన ఆనాడు ఊహించి ఉండకపోవచ్చు.

అడాల్ప్ రికెన్ బ్యాకర్.. (ఎలక్ట్రిక్ గిటార్ )

అడాల్ప్ రికెన్ బ్యాకర్.. (ఎలక్ట్రిక్ గిటార్ )

75 సంవత్సరాల క్రితం కనుగొన్న తన పరిశోధన ఇప్పుడు ఇలా మలుపులు తిరుగుతుందని ఆ పరిశోధకుడు ఆనాడు ఊహించి ఉంటాడో లేదో తెలియదు కాని. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అనేక ఆవిష్కరణలు జరిగాయి.

జాన్ షెపర్ట్ బరూన్..( ఏటీఎమ్ )

జాన్ షెపర్ట్ బరూన్..( ఏటీఎమ్ )

1967లో జాన్ షెపర్డ్ ఫస్ట్ ఏటీఎమ్ కి దారులు తెరిచారు. లండన్ లోని బార్ క్లే బ్యాంకుకు తొలిసారిగా ఈ ఏటిఎమ్ ఏర్పాటు చేశారు. నేడు అది విశ్వవ్యాప్తమై జనజీవన స్రవంతిలో భాగమైంది. మొదట్లో ఆరు అంకెల డిజిట్ నెంబర్ పిన్ కోడ్ గా ఉండేది,అయితే రాను రాను అది 4 అంకెలకు మారింది

లాజ్లో బిరో..( బాల్ పాయింట్ పెన్ )

లాజ్లో బిరో..( బాల్ పాయింట్ పెన్ )

అర్జంటైనాకు చెందిన బిరో ఈ బాల్ పాయింట్ పెన్ ను కనుగొన్నారు. 1943లో ఈ బాల్ పాయింట్ ని కనిపెట్టిన ఈ ఆవిష్కర్త 1945లో దానికి బిక్ కంపెనీ నుంచి పేటెంట్ పొందాడు. అర్జంటైనాలో ఆయన జన్మదినం 29 సెప్టెంబర్ న ఆవిష్కర్త దినంగా కూడా జరుపుకుంటారు. ఇప్పుడు అది లేనిదే ఏ పని జరగనిస్థాయికి చేరింది. కంప్యూటర్లు వచ్చినా దాని స్థానం చెక్కు చెదరలేదు.

కార్ల్ బెంజ్..( ఆటోమొబైల్ )

కార్ల్ బెంజ్..( ఆటోమొబైల్ )

1844లో జర్మనీలో పుట్టిన ఈ ఆవిష్కర్త స్వతహాగా మెకానికల్ ఇంజనీర్. 3 చక్రాలతో కారును తయారు చేసి 1885లో రోడ్డుమీదకి తెచ్చారు.ఈయన కంపెనీనే తొలిసారిగా 1893లో నాలుగు చక్రాల కార్లకు శ్రీకారం చుట్టారు. అయితే ఫస్ట్ సీరీస్ రేసింగ్ కార్లు వచ్చింది మాత్రం 1899లో అని చెప్పాలి. ఆ తరువాత ఆ కంపెనీని వదిలేసి 1906లో తన కుమారులతో కలిసి స్వంతంగా కార్ల కంపెనీ స్థాపించారు.

జార్జీ డీ మెస్ట్రాల్...( వెల్ క్రొ )

జార్జీ డీ మెస్ట్రాల్...( వెల్ క్రొ )

1955 లో దీన్ని జార్జీ డీ మెస్ట్రాల్ ఆవిష్కరించారు.నేడు అది మల్టి మిలియన్ల డాలర్ల ఇండస్ట్రీగా మారిపోయింది . స్థాపించి అనతి కాలంలోనే సంవత్సరానికి వెల్ క్రో లు దాదాపు 60 మిలియన్ల మేర అమ్మకాలు జరిగాయి.

నీల్స్ బోహ్లిన్..( త్రి పాయింట్ సీట్ బెల్ట్ )

నీల్స్ బోహ్లిన్..( త్రి పాయింట్ సీట్ బెల్ట్ )

ఇప్పుడు మనం కారులో వాడుతున్న సీటు బెల్ట్ 1959లో వోల్వో కారు కోసం నీల్స్ రూపొందించారు. అప్పడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు ప్రాణా ప్రాయం లేకుండా ఉండేందుకు దీన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ సీటు బెల్ట్ ద్వారా సంవత్సరానికి 11 వేల మంది దాకా ప్రాణాలతో బయటపడుతున్నారని యుఎస్ నేషనల్ ట్రాఫిక్ సేప్టీ హైవే ఎజెన్సీ చెబుతోంది.

ఫిలో టీ ఫాన్స్ వర్త్ ...(టెలివిజన్)

ఫిలో టీ ఫాన్స్ వర్త్ ...(టెలివిజన్)

పియోనీర్ టెక్నాలజీకి ఆధ్యుడు. 1938లో టెలివిజన్ ట్రాన్స్ మిషన్ కు బీజం వేశారు. అప్పట్లో ఇది మిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ఆయన స్థాపించిన కంపెనీలో ఇప్పుడు రాడార్ .టెలిస్కోప్ అలాగే న్యూక్లియర్లాంటి మిషన్లు తయారవుతున్నాయి. 1971లో ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లారు.

ఆథర్ ప్రై...( పోస్ట్ ఇట్స్ )

ఆథర్ ప్రై...( పోస్ట్ ఇట్స్ )

ఆపీసులో ప్రతి నిత్యం వాడుతున్న పోస్ట్ ఇట్స్ ను ఆథర్ ప్రై 1977 లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు దీని ఒరిజినల్ ఎల్లో కలర్ లో ఉండేది. మొదట్లో ఇది చాలా నిరుత్సాహపరిచినా రాను రాను 1980లో ఇదే సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.

డగ్లస్ ఏంజెల్ బార్ట్..( కంప్యూటర్ మౌస్)

డగ్లస్ ఏంజెల్ బార్ట్..( కంప్యూటర్ మౌస్)

ఫస్ట్ కంప్యూటర్ మౌస్ ను 1960లో ఏంజెల్ బార్ట్ కనుగొన్నారు. అయితే ఇది అధికారికంగా స్టార్టయింది మాత్రం 1962లో అనే చెప్పాలి. అప్పట్లో ఈ మౌస్ ఓ సంచలనం. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఏంజెల్ బార్ట్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. ఇక 1964 లో ఫస్ట్ కంప్యూటర్ మౌస్ ని విండోస్ కోసం తయారుచేశారు.

జాన్ బోయ్ డ్ డన్‌లప్ ..( ఎయిర్ ఫిల్లర్ రబ్బర్ టైర్)

జాన్ బోయ్ డ్ డన్‌లప్ ..( ఎయిర్ ఫిల్లర్ రబ్బర్ టైర్)

1900వ సంవత్సర కాలంలో జాన్ డన్ లప్ ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. 1888లోనే దీనిపై పేటెంట్ పొందారు కూడా. అప్పట్లో ఇది సైకిల్ టైర్లను తయారుచేసే సంస్థగా ఉండేది. తదనంతరం అది మోటార్ సైకిల్ అలాగే కార్లు బస్సులు అన్నింటికీ మారింది. ఆయన పేరుతోనే డన్ లప్ అనే కంపెనీ కూడా పెట్టారు. అది నేడు విశ్వ వ్యాప్తమే మిలియన్ల డాలర్ల బిజినెస్ చేస్తోంది.

సెల్వస్టర్ హోవార్డ్ రూపర్..( మోటర్ సైకిల్ )

సెల్వస్టర్ హోవార్డ్ రూపర్..( మోటర్ సైకిల్ )

సెల్వస్టర్ హోవార్డ్ రూపర్ మోటార్ సైకిల్ రూపకర్త. ఫస్ట్ మోటార్ సైకిల్ ను 1959లో తాను కనుగొన్న ప్రయోగాన్ని అందరూ ఎగతాళి చేశారు. అయినా నిరుత్సాహపడకుండా 1869లో మోటార్ సైకిల్ కు ఇంజిన్ అమర్చి సంచలనం సృష్టించారు. ఎవరైతే తనను గేళి చేశారో వారిచేతే సలాం కొట్టించుకున్నారు. ఇప్పడు టూ వీలర్స్ రంగం కోట్లకు కోట్ల బిజినెస్ చేస్తోంది.

ధామ్సన్.. ( ఎలక్ట్రిక్ వెల్డింగ్)

ధామ్సన్.. ( ఎలక్ట్రిక్ వెల్డింగ్)

1890లో ఈ ఎలక్ట్రిక్ వెల్డింగ్ ను ఆవిష్కరించారు ధామ్సన్. ఇప్పుడు ఈ బిజినెస్ లో టెక్నాలజీ మరింతగా పెరిగి అధునాతనమైన పద్దతుల్లో మిషన్లు పనిచేస్తున్నాయి. కాని ఆ తరంలోనే ఇది టెక్నాలజీకి కొత్త రంగు తొడిగింది. ధామ్సన్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ కంపెనీ పేరిట ఆయన తన కంపెనీని స్థాపించి కోట్లకు పడగలెత్తారు.

ఎర్నొ రోబొక్ క్యూబ్.. ( రూబిక్ క్యూబ్ )

ఎర్నొ రోబొక్ క్యూబ్.. ( రూబిక్ క్యూబ్ )

ఫస్ట్ రూబిక్ క్యూబ్ ను హంగేరిలో డిస్టిబ్యూట్ చేశారు. అప్పట్లో ఇది మ్యాగిక్ క్యూబ్ గా అందరినీ అలరించింది. హంగరిలో ఇది ఘన విజయం సాధించింది కూడా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్లు దాకా అందరూ ఆ క్యూబ్ కోసం మార్కెట్ కు పరుగులు పెట్టారు. ఇది 1979లో జరిగిన సంఘటన.1980లో ఇది ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయగానే ఒక్క సంవత్సరంలోనే దాదాపు 350 మిలియన్ల క్యూబ్ అమ్మకాలు జరిగాయి. సినిమాల్లోనే కాకుండా టలీవి సీరియల్స్ లో కూడా ఇది అత్యంత పాపులర్ గా నిలిచింది.

టిమ్ బెర్నర్స్ లీ ..(వరల్డ్ వైడ్ వెబ్)

టిమ్ బెర్నర్స్ లీ ..(వరల్డ్ వైడ్ వెబ్)

టిమ్ బెర్నర్స్ లీ ఓ ఇంగ్లీష్ కంప్యూటర్ సైంటిస్ట్. దీని కోసం 1989లో ఓ ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ తో హైపర్ టెక్ట్స్ ప్రోటోకాల్ సర్వర్ ని అదే సంవత్సరం బయటి ప్రపంచానికి అందించారు. అదే వరల్డ్ వైడ్ వెబ్ గామారి నేడు కొత్త పుంతలు తొక్కుతోంది.

రైట్ బ్రదర్స్ విమానం

రైట్ బ్రదర్స్ విమానం

దాదాపు వందేళ్ళ క్రితం రైట్ బ్రదర్స్ యంత్ర శక్తితో గాలిలో ప్రయాణించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయాణంలో కేవలం కొన్ని అడుగుల ఎత్తు ఎగిరి, కొన్ని అడుగుల దూరం మాత్రమే ప్రయాణం చేశారు. ఉత్తర కరోలినా లోని బిగ్ కిల్ డెవిల్ పేరుతో ఉన్న కొండ మీది నుండి విల్బర్ రైట్ మొదటిసారిగా అక్టోబర్ 10, 1902 తేదీన గ్లైడర్ సహాయంతో కిందికి ఎగురుకుంటూ వచ్చాడు.1903లో వారు మొట్టమొదటిసారిగా యంత్రం అమర్చిన గ్లైడర్ ని తయారు చేశారు.1903 డిసెంబర్ 14 తేదీన ఈ విమానంతో ఎగరడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. అనంతరం డిసెంబర్ 17 తేదీన 12 సెకన్ల పాటు కొద్ది అడుగుల ఎత్తులో 120 అడుగుల దూరం ప్రయాణించి చరిత్ర సృష్టించారు. 1905, సెప్టెంబర్ 29 తేదీన 60 అడుగుల ఎత్తుకు ఎగిరారు. ఆ విమానానికి ఫ్లైట్ 41 అని పేరు పెట్టారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write 22 Genius Inventors With Their Inventions Who Have Changed Our Lives For Good

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X