ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన దృశ్యాలు, విషాద చరిత్రకు సజీవ సాక్ష్యాలు

|

కెమెరా దృశ్యాన్ని బంధిస్తుంది.. ఆ దృశ్యం అందమైంది కావొచ్చు.. ఉల్లాసపరిచేది కావొచ్చు.. ఆకట్టుకునేది అవ్వొచ్చు. కానీ గుండెలో తడి ఉన్న ప్రతి హృదయాన్ని కన్నీరు పెట్టించే దృశ్యాలు మాత్రం అరుదుగానే ఉంటాయి. కేవలం ఫొటోలతో ప్రపంచాన్ని కదిలించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రాలు ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా నిలిచిన సంధర్భాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా చాలానే ఉన్నాయి.అవన్నీ మరుగున పడిపోయాయి..ప్రపంచం మరచిపోయిన చిత్రాలను మళ్లీ ఓ సారి గుర్తు చేసుకుందాం.

Read more : పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నా
 

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నా

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నానంటూ చిన్న పిల్లాడు పరిగెడుతున్న చిత్రం.యుద్ధంలోకి వెళుతున్న చాలామందికి ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో వేదన కలిగే ఉంటుంది. తన పిల్లల మీద ప్రేమను చూపెడుతోంది. యుద్ద పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చూపే ఈ చిత్రాన్ని డెట్లాఫ్ తీసారు.

చెగువేరా చివరిక్షణం

చెగువేరా చివరిక్షణం

ప్రపంచాన్నికి ఉద్యమం అంటే ఏంటో తెలియజెప్పిన చెగువేరా చివరిక్షణంలో ఇలా నేలకొరిగినప్పుడు తీసిన చిత్రం ఇది. దీనికి అందరూ చే లైవ్స్ అని స్లోగన్ కూడా ఇచ్చారు.

సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్

సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్

జర్మనీలో గల బెర్గిన్ లోని క్యాంప్ శిబిరంలో సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్ దీనంగా నడుస్తున్న చిత్రం. ఈ శవాలను ఓ చోటుకు చేర్చి తగలబెట్టడం ఇతని ప్రధాన విధి..ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలను చూసిన యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ చిత్రం ప్రపంచాన్నే మార్చి వేసింది.

యువతి తనవారిని చూసి రోదిస్తున్న వైనం
 

యువతి తనవారిని చూసి రోదిస్తున్న వైనం

యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పిస్తున్న ఈ చిత్రం కూడా ఎంతోమందిని విషాదంలోకి నింపింది. ఓ యువతి తనవారిని చూసి రోదిస్తున్న వైనం యావత్ ప్రపంచానికి కన్నీరు తెప్పించింది.

పసిమనస్సులపై ప్రభావం

పసిమనస్సులపై ప్రభావం

పాలబుగ్గల ఈ చిన్నారి ఫొటో మొన్నటివరకూ సోషల్‌ నెట్‌వర్క్‌లో విపరీతంగా చూసేలా చేసింది. చేస్తూనే ఉంది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న ఈ చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటో తీస్తుండగా ఆ చిన్నితల్లి కెమేరాను చూసి గన్‌ అనుకుంది.అంతే ఇలా చేతులెత్తి, లొంగిపోతున్నట్లు నిలబడి పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఫొటోగ్రాఫర్‌ కూడా కదలిపోయి, ఆనక తన కెమేరాలో బంధించి ఇలా మన ముందుంచారు. నిత్యం బాంబులు, తుపాకుల మధ్య లక్షలాది చిన్నారుల బతుకులు ఎలా భయభ్రాంతుల్లో కొట్టుమిట్టాడుతుందో ఈ చిత్రం అద్దంపడుతోంది. పసి మనస్సులపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో కన్నా వేరొకటి అవసరం లేదేమో!

యుధ్దోన్మాదం

యుధ్దోన్మాదం

ఒకప్పుడు అమెరికా-వియత్నాం యుద్ధం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. అంతేకాదు ఆ సందర్భంలో అమెరికా యుద్ధోన్మాదాన్ని ప్రతిబింబించే ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. ఆ చిత్రం అమెరికా సైన్యం ప్రయోగించిన నాపాం బాంబుదాడిలో శరీరం కాలిపోవడంతో ఆ గాయాలతో నగ్నంగా ప్రాణభయంతో పరిగెడుతున్న వియత్నాం బాలిక పాన్‌ ది కిమ్‌ పుట్‌ ఫొటో. ఈ దృశ్యాన్ని తన కెమెరాతో బంధించిన ఫొటోగ్రాఫర్‌ పేరు నిక్‌. ఫొటో తీయగానే అతను తన కోటును తీసి ఆ పాపకు కప్పి, ఆసుపత్రికి తరలించి, కిమ్‌ ప్రాణాల్ని కాపాడాడు. అప్పట్లో ఈ చిత్రం ప్రపంచానికి అమెరికా యుద్ధోన్మాదం ఎలాంంటిదో తెలియజేసింది.

ప్రపంచదేశాలను కదిలించిన చిత్రం

ప్రపంచదేశాలను కదిలించిన చిత్రం

యూరప్‌ ద్వంద్వ ప్రమాణాల్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం అది. అదే సముద్రతీరాన చనిపోయి పడివున్న బాలుని చిత్రం.నీలోఫర్‌ డెమిర్‌ అనే పాత్రికేయురాలు తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించింది. ఈ చిత్రం సొంత ఊరు, కన్నవారినీ వదిలి చేతబట్టుకుని పొరుగు దేశాలకు వెళ్లే శరణార్థుల వెతల్ని చూపెడుతోంది. ఈ ఫొటో చూసి ఇప్పటికే కోటాను కోట్ల మంది కన్నీరు పెట్టి ఉంటారు.

ఫాలింగ్ సోల్డియర్

ఫాలింగ్ సోల్డియర్

1935 సెప్టెంబర్ 5న రాబర్ట్ కాపా తీసిన చిత్రం.స్పానిష్ సివిల్ వార్ లో బుల్లెట్ తగులుతూ నేలకొరుగుతున్న సైనికుడిని చూసిన యావత్ ప్రపంచం విషాదంలో మునిగింది.

వలసల తల్లి

వలసల తల్లి

డోరోతీయా తీసిన చిత్రం.తినడానికి తిండిలేక తన కారును పుడ్ కోసం అమ్మేసింది. తన పిల్లల ఆకలి తీర్చడానికి తన పస్తులుంటూ కాలం గడిపింది.ఆఖరికి తన పిల్లల్ని అక్కడ పక్షులు చంపేస్తే ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ గడిపింది. ఈమె వయస్సు 32 సంవత్సారాలు.ఓ తల్లి పడే వేదనను ప్రపంచం మొత్తం చూసి తల్లడిల్లింది.

సూడాన్‌ కరువు

సూడాన్‌ కరువు

ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుగా మారి తల వంచిన చిన్నారి.. చనిపోతే బాగుండు తినేద్దాం అని ఎదురుచూసే రాబందు.. ఈ చిత్రం చూస్తే ఎంత కరడుగట్టిన వారినైనా కదలిస్తుంది. సూడాన్‌లో నాటి కరువు పరిస్థితులకు అద్దం పట్టిందీ చిత్రం. ఈ చిత్రాన్ని కెవిన్‌ కార్టర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాతో 1993లో చిత్రీకరించారు. అయితే ఆ బాలుడిని రక్షించకుండా కెవిన్‌ వచ్చేశాడు. ఆ తర్వాత కెవిన్‌కు మంచి కానుకే లభించింది. కానీ అతను తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాలుడిని రక్షించలేదన్న బాధతోనే కెవిన్‌ కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన

బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన

అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనల్లో బోపాల్‌ గ్యాస్‌ ఉదంతం ఒకటి. 1984లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ ఫ్యాక్టరీ నుంచి మిథైల్‌ ఐపోసైనేట్‌ అనే విషవాయువు లీకవటం వల్ల సుమారు 15 వేల మంది ప్రజలు చనిపోయారు. ఐదు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన తన కొడుకుని ఓ తండ్రి పూడ్చిపెడుతున్నప్పుడు తీసిన చిత్రం ఇది. ఆ దుర్ఘటనకు ప్రతిరూపంగా నిలిచింది. నాటి పరిస్థితుల్ని ప్రతింబించేలా నేటికీ సజీవ తార్కాణంగా ఉందా చిత్రం.

ట్యాంకర్ మ్యాన్

ట్యాంకర్ మ్యాన్

ఓ వ్యక్తి ఎంతో ధైర్యంగా యుద్ధ ట్యాంకర్లకు ఎదురుగా నిలబడి ఉన్న చిత్రం ఇది. 1989లో ప్రపంచ మొత్తం ఈ చిత్రం గురించే చర్చించింది. చైనా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ యావో బాంగ్ ఆకస్మిక మరణం తరువాత విద్యార్థులు చేపట్టిన ఆందోళనను అణచడానికి చైనా ఏకంగా యుద్ధ ట్యాంకులనే దించింది. అప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ యుద్ధ ట్యాంకర్లకు ఎదురుగా నిల్చున్నాడు. ఇప్పటికే అతనెవరో తెలియదు..అందుకే అతన్ని ట్యాంకర్ మ్యాన్ గా పిలుచుకున్నారు.

సైగాన్ ఎగ్జిక్యూషన్

సైగాన్ ఎగ్జిక్యూషన్

ఎడిల్ ఆడమ్స్ తీసిన చిత్రం. సైనికులు మానవత్వం మరచి ఓ వ్యక్తిని ఇలా నడిరోడ్డమీద కాల్చి చంపారు.

సెప్టెంబర్‌ 11 దాడి

సెప్టెంబర్‌ 11 దాడి

డబ్ల్యుటివోపై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో డీ కొన్నప్పటి సంఘటనకు సంబంధించిన చిత్రమిది. తన స్వార్థ ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాద దురంహకారంతో ఇతరదేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, చిచ్చుపెట్టి, ఆ భస్మాసుర హస్తం చివరకు తనకెలా చుట్టుముట్టిందో ఈ చిత్రమే చెబుతోంది. అది 2001, సెప్టెంబర్‌ 11. న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్లను ఉగ్రవాదులు పకడ్బందీ వ్యూహంతో విమానాలతో కూల్చేసి, అమెరికా గుండెల్లో దడపుట్టించారు. ఈ దుర్ఘటనలో సుమారు మూడు వేల మంది ప్రజలు చనిపోయారు. వారంతా తమ ప్రాణాలను కాపడుకోవడం కోసం ఇలా అంత ఎత్తు నుంచి కిందికి దూకారు.

ఓడ్ తీసిన చిత్రం

ఓడ్ తీసిన చిత్రం

ఈ చిత్రం కూడా పులిట్జర్ అవార్డును అందుకుంది. మిలిటరీ బలాలతో ఓ సాధారణ మహిళ యుద్దం చేస్తున్నప్పటి చిత్రం.ఫిబ్రవరి 2006 ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో తీసారు.

ఉగాండా బతుకుపోరు

ఉగాండా బతుకుపోరు

మైక్ వెల్స్ తీసిన చిత్రం. ఉగాండాలో కరువు ఏ స్థాయిలో ఉందో ఇట్టే కళ్లకు కడుతున్న చిత్రం.

శరణార్థుల ఆర్తనాదాలు

శరణార్థుల ఆర్తనాదాలు

1999లో ఆల్బేనియా శరణార్థులపై కారోల్ తీసిన చిత్రం.అక్కడ జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది ఇలా తీగలు వలసలు వెళ్లారు. దాదాపు 60000 వేల మందివరకు వలస వెళ్లారు. అప్పుడు ఈ రెండేళ్ల బాలుడు తన కన్నవారిని విడిచి అక్కడి నుంచి ఇలా తీగలు దాటారు.

 పులిట్జర్ అవార్డును అందుకున్న చిత్రం

పులిట్జర్ అవార్డును అందుకున్న చిత్రం

జాన్ పిలో తీసిన ఈ చిత్రం కూడా పులిట్జర్ అవార్డును అందుకుంది.1970 మే 4 ఓహియోలో జరిగిన దాష్టీకంలో నలుగురు విద్యార్థులు చనిపోయారు.అప్పుడు కూడా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.

తీగలను దూకి తప్పించుకున్నారు

తీగలను దూకి తప్పించుకున్నారు

ఈ చిత్రం కూడా బెర్లిన్ కోల్డ్ వార్ ను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అప్పుడు జరిగుతున్న యుద్ధంలో 19 సంవత్సరాలు ఆర్మీ యువకుడు ఇలా బెర్లిన్ వాల్ ను నిర్మిస్తునప్పుడు ఇలా తీగలను దూకి తప్పించుకున్నారు.

ర్వాండోలో జరిగిన మారణ హోమాన్ని కళ్లకు కట్టే చిత్రం

ర్వాండోలో జరిగిన మారణ హోమాన్ని కళ్లకు కట్టే చిత్రం

ర్వాండోలో జరిగిన మారణ హోమాన్ని కళ్లకు కట్టే చిత్రం ఇదే. అక్కడి ఈ వ్యక్తిని కిరాతకంగా హింసించారు. ఇది మానవాళిని అక్కడ జరుగుతున్న నరమేధాన్ని తట్టి లేపింది.

అమెరికా అధ్యక్షుడు అల్లెండె

అమెరికా అధ్యక్షుడు అల్లెండె

ఈ చిత్రం అమెరికా అధ్యక్షుడు అల్లెండె చివరి చిత్రం..ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని చాలా మంది అనుకుంటున్నారు.

ఆఫ్రికాలో వర్ణ వివక్ష

ఆఫ్రికాలో వర్ణ వివక్ష

ఆఫ్రికాలో వర్ణ వివక్షను కళ్లకు కట్టినట్లు చూపే చిత్రం ఇది

 చావు అంచులదాకా..

చావు అంచులదాకా..

బియాఫ్రాలో 1969లో జరిగిన యుధ్దంలో జరిగిన పరిణామాన్ని కళ్లకు కట్టే చిత్రం. 3 సంవత్సరాల పాటు యుద్ధంలో నలిగిపోయారు. దాదాపు 900 మంది చిన్నారులు తినడానికి తిండి లేక ఇలా బక్కచిక్కిపోయి చావు అంచులదాకా చేరారు.

ఇరాక్ లో యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు  చూపిన చిత్రం

ఇరాక్ లో యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిన చిత్రం

ఈ చిత్రం ఇరాక్ లో యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇరాక్ లో సైనికులు సాగిస్తున్న అరాచకాలను ఈ చిత్రమే తట్టి లేపింది. ఈ చిత్రం బయటకు వచ్చిన తరువాత యుఎస్ ఆర్మీ ,ఇతర బలగాలు అక్కడికి వెళ్లి ఆ అరాచకాన్ని అడ్డుకున్నాయి. ఈ చిత్రాన్ని అబూ గరీబ్ బయటి ప్రపంచానికి తీసుకొచ్చారు.

క్యాథలిక్ లకు బుద్ధులకు మధ్య సాగిన యుద్ధం

క్యాథలిక్ లకు బుద్ధులకు మధ్య సాగిన యుద్ధం

వియాత్నాంలో క్యాథలిక్ లకు బుద్ధులకు మధ్య సాగిన యుద్ధానిని నిలువెత్తు సాక్ష్యం ఇది.

జాత్యాహంకారాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది

జాత్యాహంకారాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది

ఇద్దరు నల్లవారు ఓ తెల్ల బాలికను రేప్ చేశారని ఇలా నడి రోడ్డు మీద చెట్టుకు వేలాడతీసారు. ఈ చిత్రం తెల్లవారి యెక్క జాత్యాహంకారాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. లార్వెన్స్ దీన్ని బయటి ప్రపంచానికి తెచ్చారు.

 పిట్టల్లా నేలకొరిగారు.

పిట్టల్లా నేలకొరిగారు.

1860లో పెన్సిల్వేనియాలో జరిగిన యుద్ధంలో తొలిరోజు సైనికులు ఇలా పిట్టల్లా నేలకొరిగారు.

పౌర హక్కుల కోసం...

పౌర హక్కుల కోసం...

మార్టిన్ లూధర్ కింగ్ హయాంలో పౌర హక్కుల కోసం నినదిస్తున్నప్పుడు అధికారులు ఇలా దాష్టీకానికి పాల్పడ్డారు.

పుస్తకాలు పట్టుకోవాల్సిన పాలబుగ్గల చిన్నారులు కోల్ మైన్ లోకి ..

పుస్తకాలు పట్టుకోవాల్సిన పాలబుగ్గల చిన్నారులు కోల్ మైన్ లోకి ..

పెన్సిల్వేనియా లో పుస్తకాలు పట్టుకోవాల్సిన పాలబుగ్గల చిన్నారులు కోల్ మైన్ లోకి పనికి వెళుతుంటే హైన్ ఈ చిత్రాన్ని క్లిక్ మనిపించారు. అక్కడి చిన్న పిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు బయటి ప్రపంచానికి చూపించింది.

వియాత్నాం వార్

వియాత్నాం వార్

వియాత్నాం వార్ జరుగుతున్న సమయంలో ఓ మహిళ సైనికులకు మీరు పట్టుకోవాల్సింది గన్ లు కాదు పూలు పట్టుకోండి చూపింది. ఈ చిత్రం తరువాత ఫ్లవర్ పవర్ మూవ్ మెంట్ కు సింబల్ గా మారింది. దీన్ని మార్క్ తీశారు

సియాచిన్ లో భూకంపం

సియాచిన్ లో భూకంపం

సియాచిన్ లో భూకంపం వచ్చినప్పుడు తన వాళ్లను కోల్పోయి ధీనంగా రోదిస్తున్న ఓ యువకుడి చిత్రం ఇది. ఈ భూకంపం చైనాను అప్పుడు వణికించింది. రిక్టర్ స్కేల్ పై దాదాపు 8గా నమోదైంది. ఈ చిత్రాన్ని మాడ్స్ తీసారు.

తల్లి బిడ్డల ప్రేమ బంధాన్ని చూపేది ఈ చిత్రం

తల్లి బిడ్డల ప్రేమ బంధాన్ని చూపేది ఈ చిత్రం

తల్లి బిడ్డల ప్రేమ బంధాన్ని చూపేది ఈ చిత్రం. యుద్ధంలో జరగరానిది ఏదైనా జరిగితే తరువాత పిల్లల పరిస్థితి ఏంటీ...ప్రపంచ ప్రజల మనసును తట్టిలేపింది ఈ చిత్రం.

Most Read Articles
Best Mobiles in India

English summary
here Write 30 MOST SHOCKING & HEART TOUCHING PHOTOGRAPHS EVER MADE

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X