వామ్మో..ఆన్‌లైన్ ఉద్యోగులకు కోట్లలో జీతాలు

Written By:

ఫ్లిప్ కార్ట్ ఈ మధ్య 2వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుందని మనం వార్తల్లో చదివాం. అయితే ఎంత నష్టాల్లో ఉన్నాకాని ప్లిప్ కార్ట్ లోనే అత్యధిక శాలరీలు నమోదవుతున్నాయట. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ బిజినెస్ సంస్థలో ఏడాదికి కోటి రూపాయల వేతనం అందుకుంటున్నారట..ఆన్ లైన్ బిజినెస్ లో ఏడాదికి కోటి రూపాయాలా అని అశ్చర్యపోకండి..ఇది నిజమే..అయితే ఒకరో లేకుంటే ఇద్దరో ఈ మొత్తాన్ని అందుకుంటే ఫర్వాలేదు. ఏకంగా 23 మంది కోటి రూపాయల వేతనాన్ని అందుకుంటున్నారట. సంచలనం రేపుతున్న న్యూస్ చూడండి.

Read more : ఫ్లిప్‌కార్ట్ నష్టం రూ. 2 వేల కోట్లు: డిస్కౌంట్లే కొంపముంచాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు

ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకుంటున్నారు. ఐటీసీ తరహాలో ఫ్లిప్కార్ట్ కూడా ఉద్యోగుల ప్రతిభను గుర్తిస్తూ, వారికి భారీ స్థాయిలో వేతనాలిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఉద్యోగులకు 476 కోట్ల రూపాయలను

ఉద్యోగులకు 476 కోట్ల రూపాయలను

గతేడాది ఫ్లిప్కార్ట్ యాజమాన్యం ఉద్యోగులకు 476 కోట్ల రూపాయలను చెల్లించింది. ఇక 2014-15 సంవత్సరానికి గాను ఫ్లిప్కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మెకిన్ మహేశ్వరి 18.73 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు.

గత సెప్టెంబర్ లో ఈ పదవి నుంచి వైదొలగి..

గత సెప్టెంబర్ లో ఈ పదవి నుంచి వైదొలగి..

కాగా మెకిన్ మహేశ్వరి గత సెప్టెంబర్ లో ఈ పదవి నుంచి వైదొలగి.. సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో

హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో

గతేడాది హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో 169 మంది ఎగ్జిక్యూటివ్లు ఎనిమిదంకెల జీతాన్ని (కోటి) తీసుకున్నారు.

ఇన్ఫోసిస్లో 123 మంది, విప్రోలో 70 మంది

ఇన్ఫోసిస్లో 123 మంది, విప్రోలో 70 మంది

ఇన్ఫోసిస్లో 123 మంది, విప్రోలో 70 మంది ఉద్యోగులు కోటి రూపాయలకుపైగా జీతాన్ని అందుకున్నారు.

ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా

ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా

ఈ ఏడాది ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా ఎగ్జిక్యూటివ్లు కోటి రూపాయల వేతనాలను తీసుకోబోతున్నారు.

ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు

ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు

కాగా ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు తాము అందుకుంటున్న భారీ స్థాయి వేతనాలకు తగినట్టుగా లక్ష్యాలకు చేరువకావాల్సిన బాధ్యత ఉంటుంది. నిరంతరం ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write 23 Flipkart Internet employees draw more than Rs 1 crore salary annually
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting