ఫ్లిప్‌కార్ట్ నష్టం రూ. 2 వేల కోట్లు: డిస్కౌంట్లే కొంపముంచాయి

By Hazarath
|

ఈ కామర్స్ రంగంలో అనతి కాంలోనే దిగ్గజ కంపెనీగా ఎదిగిన ఫ్లిప్ కార్ట్ గతేడాది భారీ నష్టాలను చవిచూసింది. అప్పటిదాకా లాభాలతో పరుగులు పెట్టిన ఈ సంస్థ గతేడాది ఆఖరుకి భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయినా వినూత్న ఆఫర్లతో భారీ సంఖ్యలో కొనుగోళ్లకు కేంద్రంగా నిలిచిన ఫ్లిప్ కార్ట్ కు నష్టాలు వచ్చాయంటే నమ్మడం అసాధ్యమే.

Read more : అమ్మకానికి యాహూ ఇంటర్నెట్..

Flipcart 2

అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి ఆ సంస్థ సమర్పించిన పత్రాల్లోనూ సదరు నష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నమ్మక తప్పడం లేదు. గత మార్చి త్రైమాసికానికి ఫ్లిప్ కార్ట్ కు ఏకంగా రూ. 2 వేల కోట్లు నష్టం వాటిల్లిందట. దీనికంతటికి కారణమేంటంటే అడక్కున్నా భారీ ఆపర్లంటూ హోరెత్తని ప్రచారమే. ఈ కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు భారీ డిస్కౌంట్లు ఇవ్వకతప్పడం లేదు. ఫ్లిప్ కార్ట్ అదే చేసింది.

Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

Flipcart 2

అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉత్పత్తిదారుడు ఇచ్చే డిబేటుతో పాటు ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ పోర్టల్ కు రూ. 1096 కోట్ల నష్టం రాగా హోల్ సేల్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇండియాకు రూ.836 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ఇదిలా ఉంటే నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహా త్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది.

Read more : మోడీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

Flipcart 2

సరఫరా చెయిన్ నిర్వహణను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు.

Flipcart 2

ఫ్లిప్‌కార్ట్ వాటా కొనుగోలుతో మ్యాప్‌మైఇండియాకు ప్రారంభంలో పెట్టుబడులు అందించిన నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, లైట్‌బాక్స్ వెంచర్స్ సంస్థలు మ్యాప్‌మైఇండియా నుంచి నిష్ర్కమిస్తాయి. మ్యాప్‌మైఇండియా స్వతంత్రగానే కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Flipkart suffers Rs 2,000-crore wound in bruising discount war

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X