ప్రపంచం విలవిలలాడిన విషాద క్షణాలు

|

ప్రపంచం శతాబ్దాలుగా అనేక ప్రకృతి వైపరీత్యాలకు గురి అవుతూనే ఉంది. మానవ నిర్మిత యుద్ధాలు ఓ వైపు అలాగే తీవ్రవాదం ఇంకో వైపు..మరో వైపు ఆకలి మంటలు..ఇంకో వైపు అంతు చిక్కని రోగాలు ఇలా అణు నిత్యం ఏదో ఓ వైపరీత్యం మనుషుల్ని చంపేస్తూనే ఉంది. ఇక భూకంపాలు ,సునామీలు,తుఫాన్లు ఒక్కసారిగా విరుచుకుపడి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ప్రపంచం వీటి దెబ్బకు విలవిలలాడిపోతోంది.శతాబ్దాల నుంచి ప్రపంచంలో జరిగిన అతి భయంకర వైపరీత్యాలను తెలుసుకుంటే ఒళ్లు జలదరించడం ఖాయం.. ఈ సందర్భంగా ప్రపంచానికి షాక్‌ కొట్టించిన వైపరీత్యాల గురించి తెలుసుకుందాం.

 

Read more: ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది

హైతి భూకంపం 2010

హైతి భూకంపం 2010

ప్రపంచంలోనే స్వాతంత్ర్యం సాధించుకున్న మొట్టమొదటి నల్లజాతి దేశం హైతీ. అప్పుడు ఫ్రెంచ్ సైన్యం ప్రపంచంలోకెల్ల అత్యంత శక్తివంతమైంది. దాన్ని ఒడించి ఎల్లలు దాటించిన దేశం అది. అటువంటి హైతీలో 2010 జనవరి 12 న భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం రాజధాని పోర్ట్- అవ్-ప్రిన్స్ కి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెక్టర్ స్కేల్ మీద 7.3 తీవ్రతతో నగరాన్ని కుదిపేసింది.

హైతి భూకంపం 2010

హైతి భూకంపం 2010

4 లక్షల టన్నుల TNT పేలితే ఎంతశక్తి విడుదలవుతుందో, అంత శక్తిగలదీ భూకంపం. ఇంతస్తాయిలో 230 ఏళ్ళలో ఎన్నడూ రాలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 250000 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. 30 వేల వ్యాపార భవనాలు పడిపోయాయి. 3 లక్షలమంది చనిపోయి ఉంటారని అంచనా. 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 2 లక్షలమందిని పూడ్చిపెట్టినట్లు ప్రధాని జీన్ మాక్స్ బెల్లిరైవ్ ఫిబ్రవరి రెండున ప్రకటించాడు.

సైక్లోన్ నర్గీస్ 2008
 

సైక్లోన్ నర్గీస్ 2008

ఉత్తర హిందూ మహా సముద్రంలో పుట్టిన ఈ తొలి సైక్లోన్ దెబ్బకు ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు 84,500 మంది మరణించారని లెక్క తేల్చారు. మయన్మార్ మెత్తం శవాలదిబ్బగా మారింది. 53, 800 మంది ప్రజలు ఈసైక్లోన్ దెబ్బకు గల్లంతయ్యారు. వరదలతో విరుచుకుపడిన ఈ సైక్లోన్ చరిత్రలో తొలి విధ్వంసక సైక్లోన్ గా తన పేరును లిఖించుకుంది.

పాకిస్తాన్ భూకంపం 2005

పాకిస్తాన్ భూకంపం 2005

అత్యంత దారుణమైన భూకంపం ఇది. పాకిస్తాన్‌లో 2005లో సంభవించింది. ఈ భూకంపంలో 75వేల మంది మరణించారు.రిక్టర్ స్కేలుపై దాదాపు 7.5 తీవ్రత నమోదైంది. లక్షా ఆరు వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు. అమెరికా తన వంతు సాయంగా 5.4 బిలియన్ల డాలర్లను అప్పుడు బాధితులకు ప్రకటించింది.

హరికేన్ కత్రినా 2005

హరికేన్ కత్రినా 2005

2005లో హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి , లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనం చేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1,000 మంది మరణానికి కారణమయ్యింది.దాదాపు 81 బిలియన్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.

హిందూ మహా సముద్ర భూకంపం 2004

హిందూ మహా సముద్ర భూకంపం 2004

ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు.

హిందూ మహా సముద్ర భూకంపం 2004

హిందూ మహా సముద్ర భూకంపం 2004

మొదట 9.1 పరిణామంలో హిందూ మహా సముద్రం అడుగున భారీ భూకంపం సంభవించింది. అనంతరం భూకంపం కేంద్రం నుండి నలు దిక్కులకు భారీ యెత్తున ఎగసిపడిన అలలు వందల కి.మీ దూరం ప్రయాణించి వివిధ దేశాల్లోని తీరాలను చేరాయి. ఆ చేరడం మామూలుగా కాకుండా తీర ప్రాంతాల్ని ముంచెత్తుతూ సమస్తం తమలో కలిపేసుకుంటూ చేరాయి. 6 విడతలుగా ఒకదానివెంట ఒకటి అలలు తీరాలను తాకడంతో, వాటిలో మునిగినవారికి తేరుకునే అవకాశం చిక్కలేదు.

నెవడాలో బద్దలయిన అగ్ని పర్వతం 1985

నెవడాలో బద్దలయిన అగ్ని పర్వతం 1985

20వ శతాబ్దంలోనే అత్యంత పెద్ద అగ్ని పర్వతంగా దీన్ని చెబుతారు. నవంబర్ 13,1985లో పేలిన ఈ అగ్ని పర్వంతం దెబ్బకు ఊళ్లకు ఊళ్లే మాడిమసైపోయాయి. ఈ పర్వతం బద్దలవడంతో అందలోనుంచి బయటకు ఎగజిమ్మిన లావా దెబ్బకు 25000 మంది ప్రజలు మాడి మసైపోయారు. చరిత్రలో అతి పెద్ద విషాదంగా నిలిచిపోయింది.

టాంగ్ షాన్ భూకంపం 1976

టాంగ్ షాన్ భూకంపం 1976

1976 జులై 28న ఒక్కసారిగా భూమి బద్దలయిందా అంటూ సంభవించిన ఈ భూకంపం చైనాలో 2,40 వేల మందిని తనలో కలిపేసుకుంది. 1,64 మందిని గాయాల పాలు చేసింది. రిక్టర్ స్కేలుపై 7.8గా దీని తీవ్రత నమోదైంది.

హరికేన్ ఆండ్రూ 1993

హరికేన్ ఆండ్రూ 1993

ఆఫ్రికాలో విరుచుకుపడిన ఈ సైక్లోన్ దెబ్బకు 26 బిలియన్ల మేర ఆస్తి నష్టం సంభవించింది.యుఎస్ చరిత్రలోనే ఆస్తినష్టం కలిగించిన అతి పెద్ద తుఫానుల్లో ఇది అయిదవది.

2011 భూకంపం తో పాటే సునామి

2011 భూకంపం తో పాటే సునామి

9.0 రిక్టర్ స్కేలుతో వచ్చిన ఈ భూకంపం జపాన్ ను మట్టి దిబ్బగా మార్చింది. ఈ సునామి దెబ్బకు ఫుకుషిమా అణు కేంద్రం దెబ్బతింది. 15 మీటర్ల ఎత్తున విరుచుకుపడిన రాకాసి అల అణు కేంద్రానికి సంబంధించిన విద్యుత్, శీతలీకరణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా అణు కేంద్రాల భద్రతపై ఆందోళన మొదలైంది. ఇది ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద భూకంపం

అలెప్పో భూకంపం 1138

అలెప్పో భూకంపం 1138

ప్రపంచంలోనే అత్యంత పాత డెడెస్ట్ భూకంపంగా ఈ భూకంపాన్ని చెబుతారు.సిరియాలోని అలెప్పోలో సంభవించిన ఈ భూకంపం ధాటికి 2,30,000 మంది మరణించారు.దీన్నే ఇప్పుడు హలబ్ గా పిలుస్తున్నారు.

హుయాన్ భూకంపం 1920

హుయాన్ భూకంపం 1920

ప్రపంచంలోనే నాలుగో వరస్ట్ భూకంపం ఇది. 2,40,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చైనాలో వచ్చింది

యాంటోక్ భూకంపం 526

యాంటోక్ భూకంపం 526

ప్రపచంలోనే మూడో అత్యంత వరస్ట్ భూకంపం..ఇది దాదాపు 526వ సంవత్సరంలోనే వచ్చింది. ఇది కూడా సిరియాలో ఉంది. ఈ భూకంపం దెబ్బకు 250000 నుంచి 3 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా

భోలా సైక్లోన్ 1970

భోలా సైక్లోన్ 1970

బంగ్లాదేశ్ ను అల్లకల్లోలం చేసి పోయిన ఈసైక్లోన్ ఈ దేశానికి 490 బిలియన్ల డాలర్ల ఆస్తినష్టం కలిగించింది. 85 శాతం వరకు ఇల్లు నేలమట్టమ్యాయి. ఒక్క తాజాముద్దీన్ లోనే 41 శాతం మంది ప్రజలు చనిపోయారు.5 లక్షల మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా

న్యూజిలాండ్ భూకంపం 2011

న్యూజిలాండ్ భూకంపం 2011

న్యూజిలాండ్ లోని రావుల్ ఐలాండ్ లో ఈ భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. న్యూజిలాండ్ లోని రెండో అతి పెద్ద సిటీ దీని దెబ్బకు సర్వనాశనమైంది.

ఆప్ఘనిస్తాన్ మంచు తుఫాను 2008

ఆప్ఘనిస్తాన్ మంచు తుఫాను 2008

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రెండో వరస్ట్ తుఫాను ఇది. 1337 మంది చనిపోయారు. ఇంకా లక్షల సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి. టెంపరేచర్ 30డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ..అంటే మంచుపై మనం పడుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణం

తూర్పు ఆఫ్రికా కరవు 2011

తూర్పు ఆఫ్రికా కరవు 2011

గత 60 సంవత్సరాల్లో వచ్చిన అతి పెద్ద కరువు ఇదే. 12.4 మిలియన్ల ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ కలవరించారు.ఆకలికి తాళలేక 9.5 బిలియన్ల మంది ప్రజలు ప్రాణాలొదిలారు. మొత్తం తూర్పు ఆఫ్రికా అన్నంకోసం అలమటించిన దుర్భర సంధర్భం ఇది.

నార్త్ కొరియా కరవు 1994

నార్త్ కొరియా కరవు 1994

ఇక్కడ సంభవించిన కరువుకు దాదాపు 2,40 లక్షల నుంచి 3,50 లక్షల వరకు ఆకలితో చనిపోయారు. 1994 నుంచి 2003 వరకు ఉత్తర కొరియా కరువు సుమారుగా 2.5 మిలియన్ల మంది పౌరుల ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది.ఈ సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు తమ దేశం నుంచి ఆహారాన్ని పంపాయి.

యూరోపియన్ హీట్ వేవ్ 2003

యూరోపియన్ హీట్ వేవ్ 2003

యూరోపియన్ లో వచ్చిన అలల వేడికి అక్కడ జనాభా నరకం చూశారు. దాదాపు 14 వేల మంది ఆస్పత్రలు వెంట పరుగులు పెట్టారు. ఇక పంటలు అయితే ఈ వేడి దెబ్బకు మాడిమసైపోయాయి. కరువు విలయతాండవం చేసింది

యాంగ్టైజ్ వరదలు 1931

యాంగ్టైజ్ వరదలు 1931

3.7 లక్షల మంది ప్రజలు ఈ వరదల్లో చనిపోయారు. సౌత్ చైనాలో విరుచుకు పడిన వరదలతో ఊర్లకు ఊర్లే నీటిలోపలకి వెళ్లి పోయాయి.20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ ప్రకృతీ వైపరీత్యంగా ఈ వరదలు నిలిచిపోయాయి.

మొజాంబిక్ వరదలు 2000

మొజాంబిక్ వరదలు 2000

2000 ఫిబ్రవరిలో విరుచుకు పడిన ఈ వరదలు దాదాపు అయిదు వారాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. 800 మంది చనిపోయారు. ఇక మూగజీవాలు దాదాపు 20 వేల దాకా ఈ వరదల్లో కొట్టుకుపోయాయి.

నార్త్ అమెరికా మశూచి మహమ్మారి 1775

నార్త్ అమెరికా మశూచి మహమ్మారి 1775

ఉత్తర అమెరికాను గడగడలాడించిన మహమ్మారి రోగమిది. యుద్ధ సమయంలో వచ్చిన ఈ రోగానికి అక్కడి అమెరికన్లు దాదాపు అనేక రోగాల భారీన పడ్డారు.

గుజరాత్ భూకంపం 2001

గుజరాత్ భూకంపం 2001

26 జనవరి 2001న గుజరాత్‌లో దారుణమైన భూకంపం సంభవించింది. ఇందులో 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20,000 మంది గాయపడ్డారు. భుజ్, పరిసర ప్రాంతాలు సంపూర్ణంగా నేలమట్టమయ్యాయి. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ధ భూకంపంగా చరిత్రకారులు చెబుతారు.

ది బ్లాక్ డెత్ 1348

ది బ్లాక్ డెత్ 1348

అంతుచిక్కని రోగంతో యూరప్ లో దాదాపు 60 శాతం మంది ప్రజలు పిట్టల్లా నేలరాలిపోయారు. అసలు ఆ వ్యాధి ఏంటో కూడా తెలియకుండానే వీరంతా నేలరాలారు. తరువాత 6వ శతాబ్దంలో అది ప్లేగుగా నిర్థారించారు .ఇవి భయంకర మరణాలు అని తెలుసుకున్నారు కూడా.

స్పానిష్ ఇన్ ప్లూయెంజా 1918

స్పానిష్ ఇన్ ప్లూయెంజా 1918

నార్త్ అమెరికలో స్పానిష్ ని వణికించిన రోగమిది. దాదాపు 20 నుంచి 40 మిలియన్ల మంది ప్రజలు ఈ రోగం భారీన పడి హరీమన్నారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ మరణాలు ఇంకా ఎక్కువేనని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Here Write 25 Worst Natural Disasters Ever Recorded

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X