ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది

Posted By:
  X

  26వ తేదీ...చరిత్రలో విషాద ఛాయలతో లిఖించబడ్డ రోజు..అది అలాంటి ఇలాంటి విషాద చరిత్ర కాదు. వేలమందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర దీనికి సొంతం. 26వ తేదీ అంటేనే ప్రపంచానికి ఓ హడల్ చరిత్రలో ఎన్నో విలయాలకు కారణమైంది. గుజరాత్ ను మట్టి దిబ్బలుగా మార్చింది ఇదే రోజు..చైనాను స్మశానం చేసింది ఇదే రోజు..తైవాన్ పై భూకంపం తైతక్కాలాడింది ఇదే రోజు..ఇక చరిత్రలో చెరగని మచ్చ ముంబై దాడులు కూడా ఇదే రోజు.. అంతకు ముందే వరదలతో ముంబై నగరం విలవిల్లాడిన రోజు సైతం ఇదే..ఇక ఇప్పుడు నేపాల్ లో సైతం పెను ఉపద్రవానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది ఇదే..రోజు...ఇంకా..ఇంకా ఎన్నో విషాదాలు గుండెలను పిండేస్తున్నాయి.

  Read more: పెను విషాదం వెనుక భయానక వాస్తవాలు

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  జనవరి 26 గుజరాత్ భూకంపం

  మాతృభూమికి ప్రణమిల్లే వేళ భారత ప్రజానీకాన్ని విషాద ఛాయల్లో ముంచిన రోజది..భీకర భూకంపానికి గుజరాత్ అల్లకల్లోలమై వణికిపోయిన సంధర్భం అది.ప్రాణ ఆస్తి నష్టం ఏమి జరగకున్నా కాని ఏమవుతుందోనన్న భయం ప్రజలకు నిద్ర లేని రాత్రులను చూపింది.

  1976 జూలై 26...చైనా భూకంపం

  జూలై 26న మొదలైన ఈ భూకంపం దాదాపు మూడు రోజుల పాటు నిద్ర లేని రాత్రులను గడిపిన సంధర్భం అది..మొత్తం 2,42 వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ డెడిస్ట్ భూకంపంగా చరిత్ర పుటల్లో లిఖించబడింది.

  26 Dec 2004 హిందూ మహాసముద్రం లో సునామి

  సునామి.. ఈ మూడక్షరాల పదం వింటేనే ప్రపంచ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. 2004 డిసెంబరు 26వ తేదీన సునామీ రూపంలో తాండవించిన జల ప్రళయం.. లక్షలాది మంది ప్రాణాలను పొట్టపెట్టుకుంది. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో పుట్టిన సునామీ జలప్రళయానికి పలు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్‌ దేశాల్లో అపారనష్టం వాటిల్లింది. కర్కశ అలల తాకిడికి కుటుంబాలకు కుటుంబాలే సముద్రం గర్భంలో కలసిపోయాయి.

  2008 26 నవంబరు.. ముంబై దాడి 26/11

  భారత ఆర్థిక వ్యవస్థకు పెట్టని కోటగా విరాజిల్లుతున్న ముంబైని శవాల దిబ్బగా మార్చిన రోజు..కర్కశులు వికృతానికి 160 మంది పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముష్కరుల వికృత క్రీడకు ముంబై విలవిలలాడింది.

  2010 26 జూలై.. తైవాన్ భూకంపం

  ఏప్రిల్ నెలలో సంభవించిన భూకంపంతో అతలాకుతలమైన తైవాన్ దాన్నుంచి తేరుకోకముందు మరొక భూకంపం వచ్చి పడింది. దాని నుంచి కోలుకోవడానికి తైవాన్ కు చాలా సంవత్సరాలే పట్టింది.

  26 ఫిబ్రవరి 2010... జపాన్ భూకంపం

  ప్రపంచంలోనే భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతం జపాన్‌. అగ్నిపర్వతాలు, సముద్రపు అగడ్తలు కలిగిన ప్రాంతంలో ఉన్న జపాన్‌లో కనీసం ఐదు నిమిషాలకు ఒకసారి అయినా భూమి కంపిస్తుంది. 26 ఫిబ్రవరి 2010న సంభవించిన భూకంపంలో స్వల్ప ఆస్తి ప్రాణ నష్టం జరిగింది.

  26 ఏప్రిల్ 2015... నేపాల్ భూకంపం

  నేపాల్ ను తాకిన భారీ భూకంపం ఆ చిన్న దేశంలో విలయాన్ని సృష్టించింది. ఇప్పటివరకు 2,263 మంది శవాలను శిధిలాల నుండి వెలికి తీశారు. మరిన్ని మృత దేహాలు వెలికి తీయవలసి ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశీ టూరిస్టులు కనీసం 200 మంది వరకు జాడ తెలియడం లేదని తెలుస్తోంది.

  రోడ్స్ భూకంపం 26 1926 జూన్

  ఆసియన్ టర్కీగా పిలువబడే ఆంటోలియాలో సంభంవించిన భూంకంపానికి తీవ్ర నష్టమే వాటిల్లింది. ప్రాణ నష్టం లేకున్నా కాని భారీ స్థాయిలో ఆస్తులు ధ్వంసమయ్యాయి.

  ఉత్తర అమెరికా సునామి 26 Jan 1700

  ఫసిపిక్ నార్త్ వెస్ట్ తీరంలో పుట్టిన సునామి ఉత్తర అమెరికాను అతలాకులతలం చేసింది. మూడు రోజుల పాటు ఉత్తర అమెరికాను అల్లాడించింది. అలలు దాదాపు 6 నుంచి 7 అడుగుల మేర ఎగిసిపడ్డాయి.

  యుగోస్లేవియా భూకంపం.. 26 1963 జూలై

  వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ భూకంపం యుగోస్లోవియాని కొన్ని సంవత్సరాల పాటు కోలుకోనీయకుండా చేసింది. దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలారు.

  మెరాపీ అగ్నిపర్వత విస్ఫోటనం 26 Oct 2010

  ఇండోనేషియాలో బద్దలయిన ఆగ్ని పర్వతానికి ప్రపంచమే బిత్తరపోయింది. అతి పెద్ద అగ్ని పర్వత విస్ఫోటనంగా చరిత్ర పుటలకెక్కిన ఈ విషాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 10 కిలోమీటర్ల మేర దీని ప్రభావం కనిపించింది.

  బామ్, ఇరాన్ భూకంపం 26 Dec 2003

  2003 డిసెంబర్ లో ఇరాన్ లోని కెర్మాన్ ప్రాంతంలోని బామ్ లో చోటు చేసుకున్న భూకంప ప్రమాదంలో 31 వేల మంది మరణించారు. అప్పట్లో భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రాత్మక నగరం బామ్‌ను తుడిచిపెట్టేసింది.

  ఉప్పెనలు 26 Dec 1996

  హిందూ మహసముద్రంలో పుట్టిన ఈ సునామి దెబ్బకు సుమత్రా ఇండోనేషియా దీవులు అల్లకల్లోలమయ్యాయి. నాలుగు దేశాలలో దాదాపు 2 లక్షల 30 వేల మంది మరణించారు. అలల 36 మీటర్ల మేర ఎగసి పడ్డాయి. సునామితో పాటు వచ్చిన భూకంపం నాలుగు దేశాలను కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1 గా నమైదైనట్లు తెలుస్తోంది.

  టర్కీ భూకంపం 26 Dec 1939

  టర్కీ చరిత్రలోనే పెను విషాదాన్ని నింపిన భూకంపం అది. అనుకోకుండానే వచ్చిన ఈ భూకంపానికి దాదాపు 8000 మంది ప్రజలు శిధిలాల కింద పడి మరణించారు. భూకంప తీవ్రత దాదాపు రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది.

  పోర్చుగల్ భూకంపం.. 1951 26 Jan

  ఈ భూకంపంలో దాదాపు 30,000 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

  Krakatau అగ్నిపర్వత విస్ఫోటనం 26 Aug 1883

  ఇండోనేషియాలో బద్దలయిన ఈ అగ్ని పర్వతం దెబ్బకు 36 వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పర్వతం బద్దలయిన తర్వాత ఎగజిమ్మిన లావా దాదాపు 3 వేల కిలోమీటర్ల మే వ్యాపించింది.

  Tasik భూకంపం 26 జూన్ 2010

  ఇండోనేషియా లో వచ్చిన ఈ భూంకపానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాని జనాలు భయందోళనతో పరుగులు తీసారు.

  ముంబై 2005 26 జూలై వరదలు

  2005 జూలై 26న నగరంలో కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చి ఆస్తి నష్టంతోపాటు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అత్యవసర సమయంలో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలలో సకాలంలో సాయం అందలేకపోయింది కూడా.

  గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

  మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write Why did all natural disasters occur on the 26th day of a month
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more