32 లక్షల కార్డులు హ్యాక్

Written By:

గత ఏడాది అక్టోబర్‌లో వెలుగుచూసిన అతి పెద్ద సైబర్ అటాక్స్‌పై హిటాచి పేమెంట్ సర్వీసెస్ స్పందించింది. భారత్‌లో దాదాపు 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయని హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఒప్పుకుంది. యస్ బ్యాంకుకు సేవలందిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనే సంస్థ కంప్యూటర్లోకి మాల్‌వేర్(దొంగ సాఫ్ట్‌వేర్)ను పంపి వినియోగదారుల సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది.

చైనా గడ్డపై జెండా పాతిన ఆపిల్, షియోమి అవుట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా దొంగల చేతుల్లోకి

ఈ ఏటీఎం నెట్‌వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల బ్యాంకు ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతుల్లోకి వెళ్లిపోయింది.

సెప్టెంబరు, అక్టోబర్‌లో ఫిర్యాదులు

ఈ వ్యవహారం మే, జూన్‌ల్లోనే జరిగినప్పటికీ తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందని వినియోగదారులు సెప్టెంబరు, అక్టోబర్‌లో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రూ. 1.3 కోట్లు దొంగతనానికి గురైనట్టు

600కు పైగా కస్టమర్లు ఈ హ్యాంకింగ్‌లో నష్టపోయారని, వారి లావాదేవీల విలువ రూ. 1.3 కోట్లు దొంగతనానికి గురైనట్టు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే.

భద్రతా చర్యలపై

గురువారం మీడియాకు హ్యాకింగ్ జరిగినట్టు ధృవీకరించిన హిటాచి పేమెంట్ సర్వీసెస్, తమ భద్రతా చర్యలపై ఎప్పడికప్పుడూ సమీక్షిస్తున్నామని పేర్కొంది.

సెక్యురిటీ సిస్టమ్స్ దొంగతనానికి గురైనట్టు

మిడ్-2016లో మా సెక్యురిటీ సిస్టమ్స్ దొంగతనానికి గురైనట్టు ఒప్పుకుంటున్నాం. త్వరలోనే ఈ దొంగతనాన్ని కనిపెడతాం. కనిపెట్టిన వెంటనే ఆ వివరాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలకు వివరిస్తామని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
3.2 million debit cards hacking in India: Hitachi owns up to security flaw read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting