Home
News

మీకు తెలియకుండానే పైనుంచి మృత్యువు మిమ్మల్ని వెంటాడుతోంది, సాక్ష్యం ఇదే !

పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది.ఏంటీ నమ్మలేకున్నారా..ఇది నమ్మలేని నిజం.

పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది. ఏంటీ నమ్మలేకున్నారా..ఇది నమ్మలేని నిజం.ఆకాశం నుంచి రకరకాల వస్తువులు భూమి మీద పడబోతున్నాయి. ఇవి పుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉండి భూమి మీదు రానున్నాయి. ఇక గుర్తుపట్టలేని వస్తువులు ఆకాశంలో లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.ఇంతకీ ఇది చెప్పింది ఎవరో కాదు..నాసా..అంతరిక్ష పరిశోధనలతో పైకి పంపిస్తున్న రాకెట్లు.. శాటిలైట్లు ఇవన్నీ భూమి మీద ఏదో ఓ చోట పడబోతున్నాయి.వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం.

Read more: రణ రంగం.. పాక్ వెనుక చైనా

20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు

20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు

అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో చాలా వస్తువులు ఫుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉన్నాయి.

మరో 5లక్షల చిన్న వ్యర్థాలు

మరో 5లక్షల చిన్న వ్యర్థాలు

వీటితోపాటు మరో 5లక్షల చిన్న వ్యర్థాలు కూడా శూన్యంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఇవి నట్లు, బోల్టులు, మేకుల వంటివి. ఇక గుర్తుపట్టలేనంత చిన్న వస్తువులు లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు

గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు

ఇవి గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మనం విసిరే రాయి తలకు తగిలితేనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఇంత వేగంతో తిరిగే వస్తువు వ్యోమగాములకు తగిలితే ఏమవుతుందో ఊహించారా?

ఆరు రెట్లు ఎక్కువ వేగం

ఆరు రెట్లు ఎక్కువ వేగం

మన శరీరాన్ని అది రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోవడం ఖాయం. గన్ నుంచి వచ్చే బుల్లెట్ గంటకు 4,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ అంతరిక్ష వస్తువులు అంతకు ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి.

ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా ...

ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా ...

అభివృద్ధి పేరుతో మనం భూమి చుట్టూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. ప్రపంచ దేశాల శాటిలైట్లు భూకక్ష్యలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయిగానీ, కాలపరిమితి ముగిసినవి మాత్రం ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా మారుతున్నాయి.

ఖర్చుతో కూడిన వ్యవహారం

ఖర్చుతో కూడిన వ్యవహారం

వాటిని తిరిగి భూమికి తెచ్చేందుకు ఏ దేశమూ ప్రయత్నించట్లేదు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మరి. చిన్న చిన్న వ్యర్థాల వల్ల ప్రస్తుత శాటిలైట్లకూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చాలా నష్టం జరుగుతోంది. స్పేస్ షటిల్స్ అద్దాలు, కిటికీలూ, సోలార్ ప్లేట్లూ దెబ్బతింటున్నాయి.

ఇరిడియం శాటిలైట్

ఇరిడియం శాటిలైట్

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను రష్యాకు చెందిన పాతకాలపు ఉపగ్రహం ఢీకొట్టింది.

క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు

క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు

2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను నాశనం చేసేద్దామని చైనా ఓ క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు శూన్యంలో తిరగడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ అవి తిరుగుతూనే ఉన్నాయి.

గతి తప్పి భూమిపై..

గతి తప్పి భూమిపై..

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి భూమిపై పడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్ మెంట్లపై కూలుతున్నాయి. అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.

భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు

భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరుగుతోంది. శాటిలైట్ ను పైకి పంపించేటప్పుడే, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత, తిరిగి భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

కాలపరిమితి 2028లో ముగుస్తుంది

కాలపరిమితి 2028లో ముగుస్తుంది

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంటెగ్రల్ మిషన్ ను పైకి పంపించింది. దాని కాలపరిమితి 2028లో ముగుస్తుంది.

ఫలితాలు తేలడానికి దశాబ్దం పైనే

ఫలితాలు తేలడానికి దశాబ్దం పైనే

అదే ఏడాది లేదా తర్వాతి సంవత్సరం అది భూమిపై పడేలా ప్రోగ్రాం రూపొందించారు. ఆ ఫలితాలు తేలడానికి మనం దశాబ్దం పైనే ఆగాలి.

Best Mobiles in India

English summary
Here Write Space Littering Can Impact Earth’s Atmosphere
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X