3జీ ఫోన్లు డెడ్..షాకవుతున్నయూజర్లు

Written By:

ఒకప్పుడు వచ్చి రావడంతోనే మార్కెట్లో దుమ్మురేపిన 3జీ ఫోన్లు నేడు డెడ్ స్ఠితికి చేరుకున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఎంతో వేగంగా వినియోగదారుల మనసుదోచుకున్న 3జీ ఫోన్లు 4జీ రాకతో ఇప్పుడు దుర్భర పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. తాజాగా వచ్చిన రిపోర్టులను చూస్తే ఈ పరిస్థితి ఇట్టే తెలిసిపోతుంది. రిపోర్ట్ ను ఓ సారి పరిశీలిస్తే...

అన్నాదమ్ముళ్లు ఏకమయ్యారు..జియోతో ఏం చేయబోతున్నారు ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించకముందే 4జీ రంగ ప్రవేశం

ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన 3జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించకముందే 4జీ రంగ ప్రవేశం చేసింది. ఇది పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకముందే రిలయన్స్ జియో ప్రకటనతో అందరి దృష్టి అటువైపు మళ్లింది.

సిమ్ పొందేందుకు కొందరు కొత్తగా 4జీ మొబైళ్లను

కేవలం సిమ్ పొందేందుకు కొందరు కొత్తగా 4జీ మొబైళ్లను కొనుగోలు చేశారంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు రూ.3వేల నుంచే ఈ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతుండడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి.

ఆన్‌లైన్‌లోనూ 4జీ ఫోన్ల అమ్మకాలు

మరోవైపు ఆన్‌లైన్‌లోనూ 4జీ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి. ఆరు నెలల క్రితం 40 శాతం మాత్రమే ఉన్న వీటి విక్రయాలు తాజాగా 80 శాతానికి చేరుకున్నాయంటే కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

జియో లైఫ్ సిరీస్‌లో

రిలయన్స్ జియో లైఫ్ సిరీస్‌లో భాగంగా రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా శామ్‌సంగ్ రూ.4,699కే 4జీ మొబైల్‌ను విక్రయిస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ కొంచె అటూఇటుగా ఇదే ధరతో ఫోన్లు విక్రయిస్తుండడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఎంటీఎన్‌ఎల్ 2008 డిసెంబరులో

ప్రభుత్వ రంగ ఎంటీఎన్‌ఎల్ 2008 డిసెంబరులో 3జీ సేవలను ప్రారంభించింది. ప్రైవేటు రంగంలో ఎయిర్‌టెల్ 2011 జనవరిలో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలిన టెల్కోలు 3జీ సేవలను ప్రారంభించాయి.

ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 3జీ సేవలు

ఈ ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 3జీ సేవలు ఇంకా విస్తరించకముందే అప్పుడే 4జీ వేగం పుంజుకుంది. రిలయన్స్ జియో ఇందుకు ఆజ్యం పోసింది. 4జీ మొబైళ్ల ధర 3జీ స్థాయికి వచ్చి చేరింది. దీంతో 3జీ హ్యాండ్‌సెట్లు ఉన్నవారు సైతం మరో స్మార్ట్‌ఫోన్‌ను 4జీలో తీసుకుంటున్నారు.

4జీ నెట్‌వర్క్ లేని

4జీ నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు చెందిన కస్టమర్లు మాత్రమే 3జీ మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే 3జీలో కొత్త ఫోన్లు రావడం లేదని లాట్ మొబైల్స్ వెల్లడించింది.

ఎంతో వేగంతో వచ్చి సంచలనం రేపిన 3జీ ఫోన్లు

మరి ముందు ముందు స్మార్ట్‌ఫోన్ల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే 3జీ మోడళ్లకు కాలం చెల్లినట్టేనని వర్తకులు అంటున్నారు. ఎంతో వేగంతో వచ్చి సంచలనం రేపిన 3జీ ఫోన్లు అంతే వేగంతో తెరవెనక్కి వెళ్లనున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
3G smartphone demand declining, handset makers like Samsung, Micromax and others to launch only 4G phones read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot