ట్రాక్ చేయకుండా ఇంటర్నెట్‌ను ఎలా బ్రౌజ్ చేయాలి?

|

మనలో చాలా మంది ప్రతి రోజు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ ద్వారా ఏదైనా విషయాన్ని సెర్చ్ చేయవచ్చు, లేదా సోషల్ నెట్‌వర్కింగ్ లేదా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయడం వంటివి చేయవచ్చు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నవారికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) అనే పదం గురించి తెలిసిఉండవచ్చు.

ట్రాక్ చేయకుండా ఇంటర్నెట్‌ను ఎలా బ్రౌజ్ చేయాలి?

 

VPN అనేది మీకు కొంచెం గందరగోళంగా అనిపించినప్పటికీ దీని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. మీరు సందర్శించే వెబ్‌సైట్ మరియు మీ PC మధ్య VPN ను సురక్షితమైన సొరంగంగా పరిగణించవచ్చు. ఇది మీ ఆన్‌లైన్ కార్యకలాపాలు సురక్షితంగా మరియు ప్రైవేట్‌గా ఉన్నాయని నిర్ధారిస్తుంది.

VPN:

VPN:

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(VPN) ఎలా పనిచేస్తుందో అని ఆలోచిస్తున్నవారికి దాని గురించి తెలుసుకోవడానికి కింద చదవండి. మీ యొక్క PC యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరప్ వంటి విదేశీ దేశంలో ఉండే సర్వర్‌కు కనెక్ట్ అవుతుంది. మీ వెబ్ ట్రాఫిక్ అంతా ఈ సర్వర్ ద్వారా ముందుకు వెనుకకు వెళుతు ఉంటుంది. మీకు కావలసిన డేటా కోసం వెబ్‌సైట్‌లను లాగిన్ చేసిన లేదా బ్రౌజ్ చేస్తున్నది సర్వర్ యొక్క భౌగోళిక స్థానం నుండి కానీ మీ కంప్యూటర్ యొక్క స్థానం నుండి కాదు. సురక్షితమైన VPN కనెక్షన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే వెబ్ బ్రౌజింగ్ కార్యకలాపాలపై ట్రాక్ చేయడం ఎవరికైనా కష్టమవుతుంది. ప్రైవేట్ వెబ్ బ్రౌజింగ్ కోసం మీరు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించడానికి ఇక్కడ నాలుగు కారణాలు ఉన్నాయి.

 P2P ఫైల్‌:
 

P2P ఫైల్‌:

టోరెంట్ వెబ్‌సైట్ల నుండి మ్యూజిక్, మూవీస్, టీవీ షోస్, వీడియోలు మరియు మరిన్ని పైరేటెడ్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ అటువంటి వెబ్‌సైట్ల నుండి కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు. పీర్ -2-పీర్ (P2P) కనెక్షన్‌ను ఉపయోగించి ప్రజలు తమ ఫైల్‌లను ఇతరులతో పంచుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. మీ యొక్క గుర్తింపును సురక్షితంగా ఉంచడానికి మరియు మీ యొక్క ఆన్‌లైన్ కార్యకలాపాలను అధికారులు చూడకుండా ఉండటానికి VPN ని ఉపయోగించడం ఉత్తమ పరిష్కారం. ఖచ్చితంగా చెప్పాలంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(VPN) బ్యాండ్‌విడ్త్‌ను 50 శాతం వరకు తగ్గించడం ద్వారా మీ ఇంటర్నెట్ కనెక్టివిటీని నెమ్మదిస్తుంది.

పబ్లిక్ వై-ఫైను విశ్వాసంతో ఉపయోగించడం:

పబ్లిక్ వై-ఫైను విశ్వాసంతో ఉపయోగించడం:

ఇప్పుడున్న కాలంలో ఉచిత ఇంటర్నెట్‌ను ఎవరు ఇష్టపడరు? కాఫీ షాపులు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లకు కేంద్రంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటి ద్వారా యాక్సెస్ పొందడం కూడా ఉచితం.దీని ద్వారా మీకు నచ్చిన అభిమాన వెబ్‌సైట్‌లను సెర్చ్ చేయడానికి, కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, వీడియోలను చూడటానికి మరియు మరెన్నో కార్యకలాపాలను పొందడానికి హాట్‌స్పాట్‌లకు కనెక్ట్ అవుతాము. అయితే ఇవి ఓపెన్ వై-ఫై నెట్‌వర్క్‌లు కావున వీటి ద్వారా మీ PC లేదా స్మార్ట్‌ఫోన్‌ను లక్ష్యంగా చేసుకోవడం మరియు సున్నితమైన డేటాను దొంగిలించడం హ్యాకర్లకు సులభతరం అవుతుంది.

ఓపెన్ వై-ఫై నెట్‌వర్క్‌లు ఎలాంటి సెక్యూరిటీ మరియు భద్రతను అందించనందున మీ డేటా - ఇమెయిల్‌లు,కాంటాక్ట్స్ , బ్రౌజింగ్ హిస్టరీ వంటి మరిన్ని విషయాలు చాలా ప్రమాదంలో పడతాయి. మీ డేటాను హైడ్ చేయడానికి మరియు హ్యాకర్ల కళ్ళ నుండి దాచడానికి మీరు VPN కనెక్షన్‌ను ఉపయోగించి బ్రౌజ్ చేయడం చాలా మంచిది.

అకౌంట్ లాగిన్ చేయకుండా డేటాను శోధించడం:

అకౌంట్ లాగిన్ చేయకుండా డేటాను శోధించడం:

బింగ్, గూగుల్ మరియు ఇతరులు సెర్చ్ ఇంజన్లు మీరు చేసే ప్రతి వెబ్ సెర్చ్ ను లాగిన్ చేస్తాయి. ఈ సెర్చ్ లు మీ కంప్యూటర్ యొక్క IP అడ్రస్ కు జతచేయబడతాయి. ఇది మీరు చూసే ప్రతి ప్రకటనలను కస్టమైజ్ చేయడానికి ఉపయోగించబడతాయి. ఉదాహరణకు మీరు విడాకుల న్యాయవాదుల కోసం, ప్రేమ సలహాలు వంటి మరెన్నో వాటి కోసం సెర్చ్ చేస్తే వాటిని అన్నిటిని గూగుల్ ద్వారా స్టోర్ చేయబడతాయి.అప్పుడు ఖచ్చితంగా మీ ఆసక్తుల ఆధారంగా గూగుల్ మీకు సంబంధిత మొత్తం సమాచారాన్ని ప్రదర్శించగలదు దీని ద్వారా కొన్ని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఒకవేళ డేటా ఎప్పుడైనా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే మాత్రం దాని ద్వారా చాలా ప్రమాదాలు జరుగవచ్చు. అటువంటి సమయాల్లో మీ యొక్క డేటాను ప్రైవేట్‌గా ఉంచడానికి VPN మీకు సహాయపడుతుంది.

కంటెంట్ సెన్సార్‌షిప్‌ను దాటవేయడం:

కంటెంట్ సెన్సార్‌షిప్‌ను దాటవేయడం:

ప్రతి దేశానికి వెబ్ కంటెంట్‌పై ఒకరకమైన సెన్సార్‌షిప్ ఉంటుంది. ఉదాహరణకు చైనాలో ఫేస్‌బుక్, జిమెయిల్ మరియు ఇతర గూగుల్ సర్వీస్ లకు యాక్సిస్ పరిమితం చేయబడింది. అదేవిధంగా భారతదేశంలో చాలా మంది ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు టొరెంట్ ఆధారిత సైట్‌లకు యాక్సిస్ ను నిరోధించారు. సెన్సార్‌షిప్ పరిమితులను ‘టన్నెల్ అవుట్' చేయడానికి VPN సర్వర్‌కు కనెక్ట్ అవ్వడానికి మరియు ప్రభుత్వం యొక్క చొరవ లేకుండా మీకు పూర్తి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి VPN సహాయపడుతుంది.

 VPN సర్వీసు ప్రొవైడర్లు:

VPN సర్వీసు ప్రొవైడర్లు:

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(VPN) సర్వీసు ప్రొవైడర్ల విషయానికి వస్తే వీటిని మీరు ఎంచుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ VPN, హాట్‌స్పాట్ షీల్డ్, టన్నెల్ బేర్ మరియు SurfEasy వంటివి విండోస్ PC మరియు Mac లో మీరు ప్రయత్నించగల కొన్ని సర్వీసులు. ఈ సేవలకు నెలకు $ 7 (సుమారు రూ .450) నుండి $ 15 (సుమారు రూ. 1,000) వరకు ఉచిత మరియు చెల్లింపు సేవలు ఉన్నాయి.

ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్‌ఫామ్‌లలో ఉన్నవారి కోసం టన్నెల్ బేర్, హాట్‌స్పాట్ VPN మరియు VPN ప్రాక్సీ మాస్టర్‌లను ఎంచుకోవచ్చు.

విండోస్ మరియు macOS కోసం ఒపెరా బ్రౌజర్ అంతర్నిర్మిత VPN తో వస్తుంది. అయితే Google Chrome బ్రౌజర్‌లో SaferVPN, Hotspot Shield VPN, TunnelBear మరియు BetterNet వంటి వాటిని ఇన్‌స్టాల్ చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
4 reasons why you should use vpn for private web browsing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X