వాట్సాప్ స్టేటస్ ఫోటోలు&వీడియోను ఎలా సేవ్ చేయాలి?

|

భారతదేశంలో సర్వత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉన్న వాట్సాప్ మెసేజ్ సర్వీస్ యొక్క వాట్సాప్ స్టేటస్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరు తమ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్ అనేది ప్రజలతో చాట్ చేయగల యాప్. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇది వాట్సాప్ స్టేటస్ అనే కొత్త లక్షణాన్ని కూడా జోడించింది.

whatsapp status video download how to save gallery on android

ఇది స్నాప్‌చాట్ మరియు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌తో సమానంగా ఉంటుంది. ఇక్కడ మీరు అప్‌లోడ్ చేసిన విషయాలు 24 గంటల తర్వాత ఆటొమ్యాటిక్ గా తొలగించబడతాయి. వాట్సాప్ స్టేటస్ ని సృష్టించడం చాలా సులభం మరియు మీరు వేరొకరి స్టేటస్ ని చూడాలనుకుంటే మీరు వాట్సాప్‌లోని స్టేటస్ ట్యాబ్ కు వెళ్లడం ద్వారా చూడవచ్చు. మీరు వాట్సాప్ స్టేటస్ ని సేవ్ చేయాలనుకుంటున్నారా?ఒక వేల మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే క్రింద జాబితా చేయబడిన ఈ సాధారణ దశలను అనుసరించడం ద్వారా మీరు వాట్సాప్ స్టేటస్ వీడియోలు మరియు ఫోటోలను సేవ్ చేయవచ్చు.

whatsapp status video download how to save gallery on android

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ స్టేటస్ వీడియోను ఎలా సేవ్ చేయాలి?

ఈ మొత్తం ప్రక్రియకు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్ మేనేజర్ అవసరం.దీని కోసం మీకు నచ్చిన ఏదైనా ఫైల్ మేనేజర్‌ను మీరు ఉపయోగించవచ్చు. ఈ విషయాలు సరళంగా ఉంచడానికి ఆండ్రాయిడ్ కోసం ఉచిత ఫైల్ మేనేజర్ అనువర్తనం అయిన గూగుల్ ఫైల్స్ యాప్ న్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ యొక్క పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలో ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది కావున మీరు దీన్ని గూగుల్ ప్లే ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఇన్‌స్టాల్ చేయవచ్చు.

whatsapp status video download how to save gallery on android

ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ స్టేటస్ వీడియోను సేవ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి:

1* మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫైల్స్ యాప్ న్ని ఓపెన్ చేసి ఎగువున-ఎడమ వైపున ఉన్న హాంబర్గర్ చిహ్నంపై క్లిక్ చేసి సెట్టింగ్‌ ఆప్షన్లను నొక్కండి.

2 * అదేవిధంగా మీరు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే ఫైల్స్ యాప్ న్ని ఓపెన్ చేసి ఎగువున-కుడి వైపున ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేసి సెట్టింగ్‌లను నొక్కండి.

3 * తదుపరి స్క్రీన్‌లో షో హిడెన్ ఫైల్‌లను నొక్కండి. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలో అయితే మీరు షో ఇంటర్నల్ స్టోరేజీను ప్రారంభించాలి.

4 * ఇప్పుడు ఫైల్స్ యాప్ యొక్క ప్రధాన మెనూకు తిరిగి వెళ్లి ఇంటర్నల్ స్టోరేజీను నొక్కండి.

5 * ఇప్పుడు వాట్సాప్ ఫోల్డర్> మీడియా> 'స్టేటస్ 'కి వెళ్ళండి.

6 * ఫోటో లేదా వీడియోను సేవ్ చేయడానికి దానిపై ఎక్కువసేపు నొక్కి కాపీని నొక్కండి. ఇప్పుడు ఫోన్ యొక్క అంతర్గత నిల్వలో మీకు నచ్చిన ఏదైనా ఫోల్డర్‌లో ఫైల్‌ను సేవ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
whatsapp status video download how to save gallery on android

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X