18 సంవత్సరాల గూగుల్ చరిత్ర ఇదే

|

సెప్టెంబర్ 15న గూగుల్ 18వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే గూగుల్ పుట్టిన రోజు ఈ రోజు కాదు కదా అని అశ్చర్యపోకండి. నిజంగానే సెప్టెంబర్ 15 గూగుల్ పుట్టినరోజు కాదు. ఈ రోజు గూగుల్ కి పేరు పెట్టినరోజు. తొలిసారి 1995లో లారీపేజ్,సెర్చీబ్రిన్ లు స్టాన్ పోర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో స్నేహం కుదిరి ఇద్దరూ 1996లో బ్యాక్ రబ్ పేరిట సెర్చ్ ఇంజిన్ ప్రారంభించారు.

Read more: గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

దీనికి గూగుల్ గా నామకరణం చేస్తూ 1997 సెప్టెంబర్ 15న వెబ్ సైట్ రిజిష్టర్ చేశారు. googol అనే పేరు నుంచి ఇప్పుడున్న పేరు గూగుల్ వచ్చింది. googol అనేది ఓ సంఖ్య పేరు ఈ సంఖ్యలో 1 తరువాత 100 సున్నాలు ఉంటాయి. దీంతో నేడు గూగుల్ నామకరణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 15గా పేర్కొంటారు. అయితే ఇదే సందర్భంలో గూగుల్ 18 సంవత్సరాల కాలంలో జరిగిన మూమెంట్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more :గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

1997

1997

సెప్టెంబర్ 15 ..1997

గూగుల్ .కమ్ పేరుతో రిజిష్టర్ చేశారు

1998

1998

ఆగస్టు 30 1998

గూగుల్ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అత్యంత రంగ వైభవంగా యూఎస్ లో జరిగింది.

సెప్టెంబర్ 4 1998

కాలిఫోర్నియాలో కంపెనీ స్థాపన కొరకు పైళ్లను సిద్ధం చేసింది.

2000

2000

మే 9, 2000

10 లాంగ్వేజ్ లతో కూడిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దాదాపు 150 భాషల్లో లభ్యమవుతోంది.

జూన్ 2000

గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గా అవతరించింది.

డిసెంబర్ 2000

గూగుల్ టూల్ బార్ రిలీజ్ అయింది.

2001
 

2001

జూలై 2001

గూగుల్ ఇమేజెస్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాదాపు 250 మిలియన్ల ఇమేజెస్ గూగుల్ లో ఉన్నాయి.ఇదే అతి పెద్ద ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ వెబ్

డిసెంబర్ 2001

గూగుల్ మొదటి వార్షికొత్సవం జరిగింది. సంవత్సరంలో లక్షల మంది ప్రజలు గూగుల్ లో ఏమి వెతికారు అన్నదానిపై కూడా చర్చ జరిగింది.

2002

2002

సెప్టెంబర్ 2002

గూగుల్ 4000 న్యూ సోర్సెస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు అది 50,000కి చేరింది.

2003

2003

డిసెంబర్ 2003

గూగుల్ ప్రింట్ ని లాంచ్ చేసింది. అయితే అది ఇప్పుడు గూగుల్ బుక్ గా మారింది. గూగుల్ ఇప్పటికే 20 లక్షల పుస్తకాలను స్కాన్ చేసింది.

 2004

2004

జనవరి 2004

గూగుల్ ఆర్కుట్ ని లాంచ్ చేసింది. అది కొద్ది రోజులు అన్ని దేశాల్లో చాలా పాపులర్ అయింది. కాని ఇప్పుడు వెనుకబడిపోయింది.

ఏప్రిల్ 1, 2004

ఏప్రిల్ పూల్స్ డే న గూగుల్ జీమెయిల్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 425 మిలియన్ల మంది జీమెయిల్ ని వాడుతున్నారు.

అక్టోబర్ 2004

గూగుల్ తన ఆఫీసులను హైదరాబాద్ ,బెంగుళూరులో ప్రారంభించింది.

2005

2005

ఫిబ్రవరి 2005

గూగుల్ మ్యాప్ లను లైవ్ లోకి వచ్చింది.

ఏప్రిల్ 2005

ఫస్ట్ వీడియో గూగుల్ లో అప్ లోడ్ చేయబడింది. ఇప్పుడు ప్రతి గంటకు 100ల వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ప్రతి నిమిషానికి ఓ వీడియో అఫ్ లోడ్ అవుతూ పీపుల్స్ నెలకు 6 మిలియన్ల గంటలు వీక్షిస్తున్నారు.

జూన్ 2005

గూగుల్ తన మొబైల్ సెర్చ్ ని ప్రారంభించింది. అలాగే గూగుల్ ఎర్త్ ని లాంచ్ చేసింది. గూగుల్ ఎర్త్ ని ఇప్పటికే లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

నవంబర్ 2005

గూగుల్ తన ఎనాలటిక్స్ ని లాంచ్ చేసింది.

2006

2006

ఏప్రిల్ 2006

గూగుల్ ట్రాన్స్ లేటర్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 80 భాషల్లో ఈ అనువాదం లభ్యం అవుతోంది.

మే 2006

గూగుల్ ట్రెండ్స్ ఎక్కువమంది ఏమి చూసారు అన్నదానిని రిలీజ్ చేసింది.

2007

2007

ఫిబ్రవరి 2007

యుఎస్ సిటీలోని 30 నగరాలకు సంబంధించిన ట్రాఫిక్ సమాచారాన్ని యాడ్ చేసింది. ఇప్పుడు అది 50 సిటీలకు పైగానే సమాచారం లభ్యమవుతోంది.

నవంబర్ 2007

ఆండ్రాయిడ్ అనౌన్స్ చేసింది.

2008

2008

సెప్టెంబర్ 2008

జీ1 ఫస్ట్ ఆండ్రాయిడ్ బేస్ డ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది.ఇదే నెలలోనే గూగుల్ క్రోమ్ ని కూడా రిలీజ్ చేసింది.

2009

2009

ఫిబ్రవరి 2009

ఆండ్రాయిడ్ లో వాయిస్ సెర్చ్ వెబ్ ని రిలీజ్ చేసింది.

అక్టోబర్ 2009 గూగుల్ మ్యాప్ నేవిగేషన్ ఇంట్రడ్యూస్ చేసింది.

2010

2010

జనవరి 2010

గూగుల్ నక్సస్ ని ప్రారంభించింది.

సెప్టెంబర్ 2010

గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో టైపింగ్ ని లాంచ్ చేసింది.

 2011

2011

మే 2011

గూగుల్ వెబ్ సైట్ లో లక్షల మందికి పైగా నే రిజిస్టర్స్ సందర్శించారు

అక్టోబర్ 2011

గూగుల్ ఎర్త్ ను 1 బిలియన్స్ టైమ్స్ డౌన్ లోడ్ చేసుకున్న రోజు

డిసెంబర్ 2011

ఆండ్రాయిడ్ మార్కెట్ లో 10 బిలియన్ల యాప్ డౌన్ లోడ్ అయ్యాయి.

2012

2012

ఫిబ్రవరి 2012

ఆండ్రాయిడ్ కి క్రోమ్ లాంచ్ అయింది

ఏప్రిల్ 2012 గూగుల్ డ్రైవ్ రిలీజ్ అయింది.

2013

2013

జూన్ 2013

లూన్ ప్రాజెక్ట్ ని చేపట్టింది.అలాగే జైలై 2013న మొబైల్ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్ ని రిలీజ్ చేసింది.

2014

2014

జూలై 2014

గూగుల్ మ్యాప్ ని హిందీలో ప్రవేశ పెట్టింది.సెప్టెంబర్ 2014న ఆండ్రాయిడ్ వన్ ని ఇండియాలో ప్రవేశపెట్టింది. అక్టోబర్ 14న గూగుల్ వాయిస్ ను ఇండియాలోకి తీసుకొచ్చింది.

2015

2015

జూన్ 2015

గూగుల్ ఫోటోస్ ని లాంచ్ చేసింది.

ఆగస్టు 10

సిలికాన్ వ్యాలీలో ఆల్ఫాబీట్ ని అనౌన్స్ చేసింది. దీనికి మన ఇండియన్ సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ సీఈఓగా ఉన్నారు.

సెప్టెంబర్ 1 2015

గూగుల్ లోగో సరికొత్తగా దర్శన మిచ్చింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
he domain name Google that millions across the world type in while searching for any query, location and image turned 18 this month. We trace the most important moments in the search giant's journey over the years.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X