బిఎస్ఎన్ఎల్ ఆఫర్ల ఢమాకా.. ప్రయోజనాలివే

Written By:

ఇప్పుడు టెలికం మార్కెట్ ని రిలయన్స్ జియో అలాగే బిఎస్ఎన్ఎల్ మాత్రమే శాసిస్తున్నాయి. పోటీలు పడి ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ఇప్పటికే గిగా పైబర్ నెట్ ద్వారా మారుమూల పల్లెల్లోకి జియో బ్రాడ్ బ్యాండ్ ని విస్తరించాలని కూడా చూస్తోంది. అయితే జియో ఫైబర్ ఒకవేళ అందుబాటులోకి వస్తే రూ. 500 నుంచి ప్లాన్ స్టార్టయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏం తీసిపోలేదన్నట్లు బిఎస్ఎన్ఎల్ కూడా కష్టమర్ల కోసం ధీటుగానే ఆఫర్లను ఇస్తోంది. ఇందులో భాగంగా BSNL's BBG ULD 999ను తెచ్చింది. ఇందులో కష్టమర్‌కి లభించే బెనిఫిట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

జియోపై సర్వే చెప్పిన షాకింగ్ నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డౌన్‌లోడ్ స్పీడ్‌

1oజిబి వరకు 4Mbps స్పీడ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 10 జిబి దాటిన తర్వాత 1Mbps స్పీడ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉచిత కాలింగ్

ఈ ఆఫర్ ద్వారా మీరు 400 నిమిషాల పాటు ఉచిత కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అది 30 రోజుల వ్యాలిడితో మీకు లభిస్తుంది.

అందరికీ ఆఫర్

ఈ ఆఫర్ లో అందరూ భాగస్వాములు కావచ్చు. పాత వారు అలాగే కొత్తవారు కూడా ఈ ఆపర్ ని వినియోగించుకోవచ్చు.

సండే కాల్స్

రెగ్యులర్ డేస్ లో మీరు 400 నిమిషాలు చేసుకుంటే సండే రోజున మాత్రం అపరిమిత కాలింగ్స్ చేసుకోవచ్చు. రాత్రి 9 నుంచి ఉదయం మధ్యలో మీరు ఈ అపరిమిత కాల్ సదుపాయాన్ని పొందవచ్చు.

పిరియడ్ టైం

మీరు సంవత్సరానికే కాకుండా 2 లేక 3 సంవత్సరాలకు కూడా ఈ ప్యాక్ ను తీసుకోవచ్చు.

కొత్త కష్టమర్ల కోసం మరో నూతన పథకాన్ని

దీంతో పాటు కొత్త కష్టమర్ల కోసం మరో నూతన పథకాన్ని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. పాత ప్లాన్ ఎక్స్‌పీరియన్స్ అన్‌లిమిటెడ్ బీబీ249లోనే కష్టమర్లు రూ 249 చెల్లించి అపరిమిత బ్రాడ్ బ్యాండ్ డేటాను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

మొదటి ఆరునెలలు

మొదటి ఆరునెలలు నెలల వరకూ రూ.249 ల చార్జ్ తో అపరిమిత డాటా డౌన్ లోడ్ అనుభవాన్ని అందించనుంది. సెప్టెంబర్ 9వతేదీనుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించింది.

కొత్త బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు

అయితే ఈ ఆఫర్ కొత్త బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఇదే టారిఫ్ తో ఎఫ్‌టీటీహెచ్ అందుబాటులో ఉంటుంది.

ప్రమోషన్ పీరియడ్ లో

ప్రమోషన్ పీరియడ్ లో ఎలాంటి ఇన్ స్టలేషన్ చార్జీలు ఉండవు. మిగతా అన్ని చార్జీలు ప్రస్తుతం అమలుచేస్తున్న టారిఫ్ ప్రకారమే ఉంటాయని కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
5 Benefits of BSNL BBG ULD 999 Over BB249 Broadband Plan read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot