జియోపై సర్వే చెప్పిన షాకింగ్ నిజాలు

Written By:

టెలికం మార్కెట్ ప్రపంచాన్ని జియో ఇప్పుడు కుదిపేస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు జియో.. జియో అంటూ కలవరిస్తోంది. జియో దెబ్బకు ఇప్పుడు అన్ని కంపెనీలు కోట్ల నష్టాలను మూటగట్టుకుని ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టారిఫ్ ఆఫర్లను అన్ని కంపెనీలు భారీగా తగ్గించేశాయి. అయితే ఓ సర్వే జియోపై కొన్ని షాకింగ్ నిజాలతో బయటకు వచ్చింది. అవేంటో చూడాలనుకుంటున్నారా..అయితే ఓ స్మార్ట్ లుక్కేయండి.

మరో సంచలనం..ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ ఉచిత కాల్స్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో కంపెనీకి రెండవ స్థానాన్ని

ముఖేష్ అంబానికి చెందిన జియో కంపెనీకి అత్యధికమంది వినియోగదారులు ఇప్పుడు రెండవ స్థానాన్ని ఇస్తున్నారని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బ్యాంకు ఆఫ్‌ అమెరికా మెర్రిల్‌ లించ్‌ (బిఎఎంఎల్‌) ఒక అధ్యయనంలో వెల్లడించింది.

56 శాత మంది జియోను రెండో సిమ్‌కార్డుగా

ప్రతి 1000 మంది వినియోగదారుల్లో 56 శాత మంది జియోను రెండో సిమ్‌కార్డుగా ఉపయోగించుకుంటున్నారని, కేవలం 24 శాతం మంది మాత్రమే జియోకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆ రిపోర్ట్ వెల్లడించింది.

11 శాతం మంది ఎలా ఉందో చూద్దామని

ఇక మరో 11 శాతం మంది ఎలా ఉందో చూద్దామని డొంగల్‌, మిఫ్పి ఉత్పత్తుల్లో ఈ జియోని ఉపయోగిస్తున్నారు. మిగిలిన మరో 9 శాతము మంది జియోను ఏ పద్దతిలోనూ ఉపయోగించుకూడదని భావిస్తున్నారని ఈ రిపోర్టులో తేలింది.

మొత్తం ఖాతాదారుల్లో 24 శాతం మంది

జియో సిమ్‌పై వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ సర్వేలో ప్రయత్నించామని బిఎఎంఎల్‌ తెలిపింది. అయితే మొత్తం ఖాతాదారుల్లో 24 శాతం మంది జియోకే ఓటు వేశారని పేర్కొంది. ఈ కంపెనీ టెల్కోల మధ్య పోటీ పెంచిందని అది ఖాతాదారులే చెబుుతన్నారని రిపోర్ట్ తెలిపింది. 

ఎయిర్‌సెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సేవలను

కాగా ఎయిర్‌సెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సేవలు సరిగా లేవని ఖాతాదారులు చెబుతున్నారు. ఎయిర్‌సెల్‌కు చెందిన 33 శాతం మంది, ఆర్‌కామ్‌కు చెందిన 28 శాతం మంది జియో సేవల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా ఈ రిపోర్టు తెలిపింది.

మొబైల్‌ ఆపరేటర్‌తోనే కొనసాగించడానికి

బిఎఎంఎల్‌ రిపోర్టు ప్రకారం 95 శాతం మంది వినియోగదారులు తమ ప్రస్తుత మొబైల్‌ ఆపరేటర్‌తోనే కొనసాగించడానికి ఆసక్తి చూపారు. జియో వచ్చినా మేము ఇదే సిమ్ ని కొనసాగిస్తామని తెలిపారు.

అధిక వీడియోలు, బ్రౌజింగ్‌కు ఆసక్తి చూపనున్నారని

డాటా టారీఫ్‌లు తగ్గినందున వచ్చే 12 మాసాల్లో 92 శాతం మంది కూడా అధిక వీడియోలు, బ్రౌజింగ్‌కు ఆసక్తి చూపనున్నారని తెలిపింది. రానున్న కాలంలో 72 శాతం మంది వినియోగదారులు 4జి స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్‌ కానున్నట్లు తెలిపారు.

కాల్ డ్రాప్ సమస్యను

అయితే ఈ మధ్య కుదిపేస్తున్న కాల్ డ్రాప్ సమస్యను చాలామంది సమస్యగా భావించడం లేదని రిపోర్ట్ తెలిపింది.  

 

15 శాతం వినియోగదారులు మాత్రమే

కాల్‌ డ్రాప్స్‌పై కేవలం 15 శాతం వినియోగదారులు మాత్రమే సమస్యగా భావిస్తున్నారని పేర్కొంది. అందులోనూ సొమ్ముకు తగ్గ తక్కువ డాటా వేగంపై నిరాసక్తత వ్యక్తం చేశారు.

జియో యూజర్ల సీక్రెట్స్

జియో యూజర్లకు దిమ్మతిరిగే షాక్: వారి సీక్రెట్స్ విదేశాలకు..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

 

అంబానీలు కలిసారు

అన్నాదమ్ముళ్లు ఏకమయ్యారు..జియోతో ఏం చేయబోతున్నారు ..? మరింత సమాచారం కావాలంటే క్లిక్ చేయండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio preferred as secondary SIM, finds mobile user survey read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot