అసలు నిజాలు అవే!

Posted By:

మనలో చాలా మందికి మనం వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి రకరకాల సందేహాలు వ్యక్తవమవుతుంటాయి. ఇప్పటికే మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి అనేక రకాల రూమర్స్ ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ లు గురించి బలంగా నాటుకుపోయిన అపోహలు వాటిలో దాగి ఉన్నా నిజానిజాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం...

Read More: ‘ఫోన్స్ విత్ స్పెషల్ ఫీచర్స్‌'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అపోహ: ఎక్కువ మెగా పిక్సల్స్ ఉన్నట్లయితే అది మంచి కెమెరానే

వాస్తవం: ఎక్కువ మెగా పిక్సల్స్, ఇమేజ్ క్వాలిటీ పై ఏ విధమైన ప్రభావం చూపలేవు. అయితే, అధిక మెగా పిక్సల్స్‌తో చిత్రీకరింబడిన ఫోటోలను పెద్ద సైజు షీట్‌ల పై క్లారిటీతో ప్రింట్ తీసుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ సెన్సార్, అపర్చెర్ సైజ్ వంటి అంశాలు ఫోటో నాణ్యతను రెట్టింపు చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

అపోహ: ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ అని అర్థం
వాస్తవం: ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ బ్యాటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందనటంలో వాస్తవం చాలా తక్కువ. ఫోన్ ప్రాసెసర్ పనితీరుటట్టే బ్యాటరీ బ్యాకప్ ఆధారపడి ఉంటుంది.

అపోహ: ఆటోమెటిక్ బ్రైట్నస్, లైవ్ వాల్ పేపర్స్, బ్లూటత్ వంటి ఫీచర్లను బ్యాటరీ బ్యాకప్‍ను ఎక్కువ తీసుకుంటాయ్..?
వాస్తవం: వివిధ పరీక్షల ద్వారా రుజువైంది ఏంటంటే..? ఈ అన్ని ఫీచర్లను టర్నాఫ్ చేయటం వల్ల కేవలం 2శాతం మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ఆదా అయ్యిందట.

అపోహ: ఎక్కువ కోర్‌లు ఉంటే ప్రాసెసర్ పనితీరు బాగుంటుంది..?
వాస్తవం: వాస్తవానికి ప్రాసెసర్ పనితీరు బాగుండాలంటే ప్రాసెసర్ ఆర్కిటెక్షర్ అలానే ప్రాసెసర్ మల్టీత్రెడింగ్ వంటి అంశాలు బాగుండాలి.

అపోహ: ఫోన్ దగ్గరలో అయిస్కాంతాన్ని ఉంచినట్లయితే ఫోన్ డ్రైవ్‌లోని డేటా మొత్తం చెరిగిపోతుంది.
వాస్తవం: ఈ అపోహ ఏమాత్రం నిజం కాదు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే ఎస్ఎస్‌డి (సాలిడ్ స్టేట్ డ్రైవ్)లు అయిస్కాంత శక్తికి ఏ మాత్రం ఆకర్షింపబడవు. కాబట్టి ఫోన్‌లోని ఏవిధమైన డేటా చెరిగిపోదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 biggest smartphone myths busted. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot