ఐఫోన్ 7 తక్కువ ధరకే కావాలా..అయితే వీటిపై ఓ లుక్కేయండి

Written By:

ఈ రోజు సాయంత్రం నుంచి ఆపిల్ ఐఫోన్ 7 వేరియంట్లు ఇండియన్ల చేతుల్లోకి రానున్నాయి. అయితే ఈ ఫోన్ సొంతం చేసుకోడానికి ఇప్పటికే చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. తక్కువలో సొంతం చేసుకోవాలని ఆపర్లను వెతుకుతున్నారు. వారి కోసం ఓ అయిదు ఆఫర్లను ఈ కామర్స్ దిగ్గజాలు అందిస్తున్నాయి. ఓ సారి చూడండి.

ఐఫోన్ 7 ఈ రోజే వస్తోంది..రూ.10 వేల తగ్గింపుతో సొంతం చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై రూ.24,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఐఫోన్7 పై ఫ్లిప్‌కార్ట్ ఈఎంఐ ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది రూ.2,910 స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ 7 ప్లస్ వినియోగదారులు నెలసరి వాయిదాల్లో రూ.3,967 చెల్లించుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్

సిటీ బ్యాంకు కార్డ్స్‌తో ఈ ఫోన్లను కొన్నవారికి ఫ్లాట్‌పై రూ.10వేల క్యాష్?బ్యాక్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 2017 జనవరి 8న ఈ మొత్తాన్ని క్రెడిడ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెజాన్

అమెజాన్ సైతం ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను రూ.16వేల వరకు ఆఫర్ చేసింది. ఐఫోన్7, 7ప్లస్ కొన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు ఫ్లాట్ పై రూ.11వేల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేసింది.పాత ఐఫోన్లను కొత్త ఐఫోన్7 ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకునే వారు అమెజాన్‌లో రూ.4వేల గిప్ట్ కార్డు కూడా పొందనున్నారు. ప్రైమ్ సర్వీసు యూజర్లకు కేవలం రూ.500 గిప్ట్ కార్డును మాత్రమే అందించనున్నట్టు అమెజాన్ వెల్లడించింది.

స్నాప్‌డీల్

స్నాప్‌డీల్ వెబ్‌సైట్‌లో కూడా ఐఫోన్ 7 ఈఎంఐ రూ.2,852 నుంచి, ఐఫోన్ 7ప్లస్ ఈఎంఐ రూ.3,898 నుంచి మొదలవుతుంది. వివిధ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 20 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ప్రకటించింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేటీఎం

పేటీఎం రూ.7వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. టాటా సీఎల్ఐక్యూ‌లో కొత్త ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నారు.

ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ కూడా ప్రతి ఐఫోన్ కొనుగోలుపై 10జిబి 4జీ డేటాను ప్రతినెలా ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఇలా 12 నెలలపాటు కష్టమర్లు అందుకుంటారని కూడా చెప్పింది. అయితే ఈ ఆఫర్ Airtel Infinity postpaid planలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 deals and discounts available on Apple iPhone 7, iPhone 7 Plus read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot