ఐఫోన్ 7 ఈ రోజే వస్తోంది..రూ.10 వేల తగ్గింపుతో సొంతం చేసుకోండి

By Hazarath
|

ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ ఫోన్లు నేటి నుంచి భారత మార్కెట్లోకి రానున్నాయి. ఐఫోన్ నుంచి వచ్చిన అన్ని ఫోన్లు పడమర దేశాల్లో అర్థరాత్రి లాంచింగ్ ముహర్తం పెట్టుకోగా ఇండియాలో సాయంత్రం ఏడుగంటల నుంచే ఈఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం ఏడు గంటల నుంచే అమ్మకాలు చేపడతామని ప్రకటించేశాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే రాయితీలను కూడా ప్రకటిస్తున్నాయి.

మొబైల్ డిస్‌ప్లే గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

స్నాప్‌డీల్ ఈ ఫోన్లపై రూ.10 వేల రాయితీ

స్నాప్‌డీల్ ఈ ఫోన్లపై రూ.10 వేల రాయితీ

ఇప్పటికే ఆన్‌లైన్ దిగ్గజం స్నాప్‌డీల్ ఈ ఫోన్లపై రూ.10 వేల రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ మొబైళ్ల ప్రారంభ ధర రూ.60 వేలు

ఈ మొబైళ్ల ప్రారంభ ధర రూ.60 వేలు

భారత్‌లో ఈ మొబైళ్ల ప్రారంభ ధర రూ.60 వేలుగా ఉండగా, డిస్కౌంట్‌తోపాటు ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని స్నాప్‌డీల్ తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం
 

వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం

వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో జతకట్టినట్లు స్నాప్‌డీల్ కో-ఫౌండర్ రోహిత్ బన్సల్ తెలిపారు. 32 జీబీ నుంచి 128 జీబీ, 256 జీబీ సామర్థ్యం కలిగిన ఈ మొబైళ్లను సంస్థ విక్రయిస్తున్నది.

 సంగీత మొబైల్ కూడా బంఫరాఫర్

సంగీత మొబైల్ కూడా బంఫరాఫర్

ఇక సంగీత మొబైల్ కూడా బంఫరాఫర్ ను ఇచ్చింది. ఐఫోన్-7ను సిటీబ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసి రూ. 10వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చని తెలిపింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే ఉంటుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అర్ధరాత్రి 12 గంటల వరకు

అర్ధరాత్రి 12 గంటల వరకు

ఐఫోన్ 7 సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు సంగీత షోరూంలు తెరిచి ఉంటాయని ఎండీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆపిల్ ఇప్పుడు నేరుగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం

ఆపిల్ ఇప్పుడు నేరుగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం

గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో సంబంధం లేకుండా ఆపిల్ ఇప్పుడు నేరుగా ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వివిధ వేరియంట్లలో

వివిధ వేరియంట్లలో

జెట్ బ్లాక్, బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో అధికారికంగా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. మూడు స్టోరేజ్ వేరియంట్లు 32జీబీ,128జీబీ, 256జీబీలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

ధర

ధర

32జీబీ ఐఫోన్7 ధర..రూ.60,000గానూ, 128జీబీ ఐఫోన్7 ధర...రూ.70,000గానూ, 256జీబీ ఐఫోన్7ధర.. రూ.80,000గా కంపెనీ నిర్ణయించింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్ 7ప్లస్

ఐఫోన్ 7ప్లస్

ఐఫోన్ 7ప్లస్ విషయానికొస్తే 32జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.72,000గానూ, 128జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.82,000గానూ, 256జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.92,000 కంపెనీ నిర్ణయించింది.

ఐఫోన్ 7 ఫీచర్స్

ఐఫోన్ 7 ఫీచర్స్

ఐఫోన్ 7 ఫీచర్స్ విషయానికొస్తే.. 4.70 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్ -కోర్ ప్రాసెసర్, 750x1334 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఉంటుంది.
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ కెపాసిటీ 1960ఎంఏహెచ్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్ 7 ప్లస్ ఫీచర్స్

ఐఫోన్ 7 ప్లస్ ఫీచర్స్

ఐఫోన్ 7 ప్లస్ ఫీచర్స్ విషయానికొస్తే.. 5.50 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్-కోర్ ప్రాసెసర్ , 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటుంది. ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. దీంతో పాటు 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఉంది. 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ కెపాసిటీ 2900ఎంఏహెచ్.

 

 

ఐఫోన్8

ఐఫోన్8

కమింగ్ సూన్: మునుపెన్నడూ లేని ఫీచర్లతో ఐఫోన్8 మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Snapdeal Partners Amex To Offer Rs. 10,000 Off On iPhone7, 7 Plus read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X