సంచలనం రేపుతున్న బిఎస్ఎన్ఎల్ రూ. 49 ఆఫర్

Written By:

ప్రజలకు టెలికాం సేవలను మరింత చేరువలోకి తీసుకొచ్చేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అత్యంత తక్కువ ధరకే ల్యాండ్ లైన్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మీరు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టింది. అయితే దీనికి డిమాండ్ ఉన్న నేపధ్యంలో డిసెంబర్ 31 వరకే దీన్ని అమల్లో ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ పై ఓ లుక్కేయండి.

పర్స్ , డబ్బుల గురించి మరచిపోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 49 రూపాయలకే ల్యాండ్ లైన్

ఈ ఆఫర్లో భాగంగా మీకు రూ. 49 రూపాయలకే ల్యాండ్ లైన్ సౌకర్యం లభిస్తుంది. ఎటువంటి ఇన్ స్టాలేషన్ ఛార్జీలు ఉండవు. ఈ ఆఫర్ కొత్త కష్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాత కష్టమర్లకు అందుబాటులో ఉండదు.

మొదటి ఆరు నెలల పాటు

ఈ ప్లాన్ తీసుకున్న వారు మొదటి ఆరు నెలల పాటు కేవలం నెలకి రూ. 49 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత మీకు కంపెనీ రూల్స్ ప్రకారం ఛార్జీలు ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్ లిమిటెడ్

ఈ ప్లాన్ ద్వారా మీరు ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల ల్యాండ్లైన్, సెల్ఫోన్లకు ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇది అన్ లిమిటెడ్

నైట్ ఫ్రీ కాలింగ్

దీంతో పాటు ప్రతీ రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్ ఫ్రీ కాలింగ్ సదుపాయం ఉంటుంది. అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.

ఉచితంగా బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్

ఈ ప్లాన్ పొందినవారికి ఉచితంగా బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ అందిచడం జరుగుతుంది.

ఆధార్ కార్డు నకలు, ఫోటో

మీరు కనెక్షన్ పొందాలంటే ఆధార్ కార్డు నకలు, ఫోటోతో మీ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళితే వారు మీకు వివరాలతో కూడి సమాచారం అందిస్తారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL is now extending it's 'Experience LL-49' promotional scheme till December 31, 2016 based on its demand in the market. Here are 5 major attractions you should know about it.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot