పర్స్ , డబ్బుల గురించి మరచిపోండి !

Written By:

మీరు బయటకు వెళుతున్నారనుకోండి .ముందుగా మీరు మీ పర్స్ లో డబ్బులు ఉన్నాయా లేవా అని తెగ వదికేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా డిజిటల్ విప్లవం వచ్చేసింది. మీ పర్స్ లో డబ్బులు లేకపోయినా కాని మీరు డబ్బులు చెల్లించవచ్చు అలాగే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం.

ఆర్‌బిఐ సర్వర్ డౌన్, నోట్లను మార్చుకునే మార్గాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బయోమెట్రిక్ చెల్లింపులు

ఇదొక కొత్తరకం చెల్లింపు పద్దతి . మీ చేతి వేళ్ల ద్వారా కాని లేకుంటే మీ కంటి రెటీనా ద్వారా కాని చెల్లింపులు చేయవచ్చు. భవిష్యత్ లో ఈ విధానమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డిపాజిట్ మిషన్

బ్యాంకులకు వెళ్లి క్యూలో నిల్చునే అవసరం లేకుండా మీరు డబ్బులు డిపాజిట్ చేసుకునే పద్ధతి. అక్కడ కనిపించే వివరాలను ఫాలో అవుతూ మీ మొబైల్ నంబర్ అలాగే ఖాతా నంబర్ ఎంటర్ చేస్తే అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరచేతితో లావాదేవీలు

మీరు ఇప్పుడు అరచేతిని పెట్టి కూడా లావాదేవీలు జరిపే టెక్నాలజీ వస్తోంది. మీ అకౌంట్ కు మీ అరచేతిని అనుసంధానం చేయడం ద్వారా ఈ రకమైన లావాదేవీలు జరుపుతారు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు

ఎన్ఎఫ్సీ NFC (Near Field Communication)

ఇదొక మొబైల్ కమ్యూనికేషన్. మీ ఫోన్ తోనే అన్ని చెల్లింపులు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఓ డివైజ్ నుంచి మరో డివైజ్ కు చెల్లింపులు జరుపుకోవచ్చు.

ఆన్ లైన్ పేమెంట్

ఇప్పుడు ఇది చాలా పాపులర్. ప్రతీది ఆన్ లైన్ వేదికగానే జరుగుతోంది. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది.

మొబైల్ పేమెంట్

మొబైల్ నుంచి రకరకాల యాప్స్ ద్వారా కొనుగోళ్లు జరిపే వారు దీని ద్వారా అమౌంట్ పే చేస్తారు. ఆన్ లైన్ నగదు మార్పిడి చాలా తొందరగా జరిగిపోతుంది. ఈ యాప ద్వారా.

చిప్ , పిన్ కార్డు

ఇంతకుముందు డబ్బులు డ్రా చేయాలంటే కార్డు పెట్టి స్వైప్ చేస్తే చాలు. కాని ఇప్పుడు చిప్ కొత్తగా చేరింది. మీరు కార్డు స్వైప్ చేసినా మీ మొబైల్ నంబర్ కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే మీ లావా దేవీలు జరుగుతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
dont carry purse around so keep digital wallet read more at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot