కష్టమర్ల కోసం జియో తక్షణం చేయాల్సిన పనులు !

Written By:

రిలయన్స్ జియో గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే..ఎందుకంటే ఆ ఫీవర్ గురించి అందరికీ తెలుసు.. మార్కెట్లో అన్ని టెల్కోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకప్పుడు టెలికం ప్రపంచాన్ని ఏలిన అన్ని కంపెనీలు జియో రాకతో ఇప్పుడు కోట్ల నష్టాలను మూటగట్టుకుంటూ కష్టమర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి. అయితే జియో పై ఇప్పుడు కొందరు కొన్ని విషయాలపై నిరాశను వ్యక్తం చేస్తున్నారు. వాటిని జియో వెంటనే పరిష్కరించాలని చెబుతున్నారు. అవేంటో మీరే చూడండి.

జియోపై సర్వే చెప్పిన షాకింగ్ నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాయిస్ కాల్ ఫెయిల్యూర్

జియోకి ఇది పెద్ద దెబ్బలా మారింది. జియో విడుదల చేసిన ఓ రిపోర్ట్ లో జియోని షాకయ్యే నిజాలు తెలిసాయి. కూడా. ఒక్కరోజులో 1500 కోట్ల కాల్స్ చేస్తే అందులో 12 కోట్ల కాల్స్ ఫెయిలయ్యాయని జియో తెలిపింది. దీన్ని వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉంది.

ఇంటర్నెట్ స్పీడ్

జిగా ఫైబర్ నెట్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో జియో ఇప్పుడు ఈ సమ్యసను ఎదుర్కుంటోంది. దేశంలో ఇప్పుడు 3జీ కేబుల్స్ పైనే నడుస్తుంటడం వల్ల ఇది కూడా సమస్యలా మారింది. ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ 6 నుంచి 10 ఎంబీపీఎస్ మధ్యలోనే నడుస్తోంది. 50 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇస్తామని జియో లాంచ్ టైంలో చెప్పింది. ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

బగ్గి జీయో యాప్స్

జియో యాప్స్ కూడా అనుకున్నంత మేర కష్టమర్లను సంతృప్తిపరచలేకపోతోంది. జియో టీవీ అయితే కష్టమర్లను చాలా నిరాశకు గురిచేస్తోంది. ఈ సమస్యను కూడా జియో పరిష్కరించాల్సి ఉంటుంది.

వోల్ట్ సపోర్ట్

జియో సిమ్ వోల్ట్ సపోర్ట్ ఫోన్లకే పనిచేస్తుండటం కూడా ఇబ్బందిగా మారింది. దేశంలో చాలామందికి ఈ వోల్ట్ ఫోన్లు లేవు. ఎక్కువ శాతం మంది 2జీ 3జీ సిమ్ లనే వాడుతున్నారు. వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

బ్యాటరీ

2జీ 3జీ సర్వీసులకన్నా 4జీ సర్వీసు చాలా వేగవంతంగా ఉంటుంది. ఆ సిమ్ వాడిన ఫోన్ల బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉంటుంది. మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. కాబట్టి బ్యాటరీ సేవ్ అయ్యేదానికి ఏదైనా మార్గాన్ని జియో అన్వేషించవలిసి ఉంటుంది.

 

 

4G VoLTE వేరు, 4G వేరు

4G VoLTE వేరు, 4G వేరు..మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
5 problems that Reliance Jio needs to fix right away read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting