2013 టెలికామ్ పోకడలు!

Posted By: Staff

2013 టెలికామ్ పోకడలు!

 

2012, టెలికాం రంగానికి అంతగా అచ్చిరాలేదని చెప్పొచ్చు. అభివృద్ధి మాట అలా ఉంచితే సంక్షోభం ఓ వైపు.. స్కామ్‌లు మరో వైపు ఉక్కిరి బిక్కిరి చేసాయి. అసాధారణ పరిస్థితులను ఎదుర్కొన్న టెలికాం రంగంలో 2013లో చోటుచేసుకోబోయే ఆధునిక పోకడలను ఓ సారి పరిశీలిద్దాం..

అలనాటి మొబైల్ ఫోన్‌లు!

రోమింగ్‌కు స్వస్తి!

2012 టెలికాం జాతీయ విధానంలో ప్రభుత్వం రోమింగ్ చార్జీల ఎత్తివేతను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోమింగ్ చార్జీలు ఎత్తివేత వల్ల కాల్ చార్జీలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సౌలభ్యతతో దేశంలోని ఏ ప్రాంతానికైనా మీ సొంత నెంబర్‌తో.. ఏ విధమైన అదనపు చార్జీలు చెల్లించుకుండా నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. దేశమంతా ఫ్రీ రోమింగ్ ఉండాలనే ప్రతిపాదన మంచిదేనని అయితే దీనికి పరిశ్రమ కూడా సన్నద్ధం కావాల్సి ఉందని సెల్‌ఫోన్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యు చెప్పా రు.

మొబైల్ టారిఫ్‌లో పెరిగే అవకాశం!

క్యాబినెట్ ఆమోదం పొంది రోమింగ్ చార్జీలు ఎత్తివేత అమలైనట్లయితే మొబైల్ టారిఫ్‌‍లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు అంచనా వేసినట్లయితే యూజర్ల సంఖ్యను పెంచుకునే క్రమంలో నేపధ్యంలో టెలికం ఆపరేటర్లు వివిధ ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి.

3జీ ధరలు తగ్గే అవకాశం!

కాలింగ్ ఛార్జీలు పెరగనున్ననేపధ్యంలో 3జీ డాటా వినియోగం మరింత చవక కానుందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఓ అడుగుముందున్న ఎయిర్‌టెల్ ‘3జీ షేరింగ్ ప్లాన్’ పేరుతో పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ!

‘వన్ నేషన్ వన్ నంబర్’ పేరుతో సరికొత్త అధ్యయానికి టెలికాం శాఖ శ్రీకారం చుట్టునుంది. మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రయోగం వల్ల ఒకే నంబర్‌ను దేశంలో ఎక్కడికి వెళ్లినా వినియోగించుకోవచ్చు.

4జీ సర్వీసులు విస్తరించే అవకాశం?

నేటి ఆధునిక ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను కోరకుంటున్నారు. ఈ క్రమంలో టెలికం ఆపరేటర్లు 4జీ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వరసలో ముందున్న ఎయిర్‌టెల్ 4జీ (ఎల్‌టీఈ) సర్వీస్‌లను కోల్‌కతా, బెంగుళూరు, పూణే ప్రాంతాలకు అందిస్తోంది. ఈ సర్వీస్‌లు త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot