'చీకటి రోజున' వీకీపీడియా యాక్సెస్‌కి ఐదు మార్గాలు..?

Posted By: Staff

'చీకటి రోజున' వీకీపీడియా యాక్సెస్‌కి ఐదు మార్గాలు..?

 

ప్రస్తుతం ప్రపంచ జనాభా విషయం ఏదైనా కానీ వీకీపీడియాలో  తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వీకీపీడియా జనవరి 18న మూత పడిన విషయం తెలిసిందే. అందుకు గల కారణం అమెరికా సెనేట్‌లో చర్చకు చేపట్టిన పైరసీ నిరోధ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ సోమవారం చెప్పారు. బుధవారం ఆ చట్టంపై వికీపిడీయా నిరసన వ్యక్తం చేస్తోందని ఆయన తన ట్విట్టర్‌లో సమాచారాన్ని పోస్టు చేశారు.  వికీపీడియా మూతపై తాను ఫోన్ ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పారు.

ఐపి యాక్ట్ రక్షణ, ఆన్‌లైన్ పైరసీ నిరోధ చట్టంగా చెబుతున్న పైరసీ నిరోధ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తూ 24 గంటల పాటు వికీపీడియాను ఆపేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెబ్‌సైట్‌లో ఈ సందేశం సందర్శకులకు కనిపిస్తుందని తెలిపారు. సోప్ ఆవిష్కరణలకు ఆటంకంగా మారుతుందని, భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని గూగుల్, ఫేస్ బుక్ వంటి వెబ్‌సైట్లు అంటున్నాయి. కామ్‌స్కోర్ లెక్కల ప్రకారం - వికీపీడియాకు ప్రతి రోజూ  25 మిలియన్ల విజిటర్స్ వస్తారు.

ఐతే కొంత మంది నిపుణులకు మూత పడిన రోజున కూడా వీకీపీడియా యాక్సెస్ చేసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి ఆసక్తిని గమనించిన 'వన్ ఇండియా తెలుగు' వారి ప్రత్యేకంగా జనవరి 18న వీకీపీడియాని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో కొన్ని టిప్స్‌ని పాఠకులకు ప్రత్యేకంగా అందజేస్తుంది.

1. మొదటి టెక్నిక్ చాలా సులభం. మీరు సింగిల్ బ్రౌజర్ సెట్టింగును వినియోగిస్తుంటే, వికీపీడియా యొక్క బ్లాక్అవుట్ అమలు జావాస్క్రిప్ట్ ఉపయోగిస్తుంది, మీరు చెయ్యాల్సిన మీ అన్ని వెబ్ బ్రౌజర్లో జావాస్క్రిప్ట్‌ని ఆఫ్ చేయడమే. ఈ క్రింది విధానాలను అనుసరించండి.

ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తుంటే: go to Tools > Options > Content. Uncheck the JavaScript option to disable JavaScript.

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తుంటే: go to Tools > Internet Options > Security. Select Internet and then the Custom level option. Under the Scripting section, disable "Active scripting".

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తుంటే: go to Setting > Options > Under the hood > COntent Settings under Privacy > Choose the "Do not allow any site to run JavaScript" radio button.

2. మీకు ఏదైనా ఆర్టికల్ గనుక నచ్చినట్లేతే గూగుల్ సెర్చ్ ద్వారా ఆ వెబ్ పేజ్ లింక్‌కి అనుసంధానం కావచ్చు. అనుసంధానం అయిన తర్వాత గూగుల్ క్యాచీ ద్వారా వెబ్ పేజ్ లింక్‌కి చేరుకోవచ్చు. గూగుల్ కాష్ లింక్ మీకు కుడి భాగాన కనిపించే బాణం సూక్ష్మచిత్రాన్ని క్లిక్ అప్పుడు గూగుల్ శోధన ఇంజిన్ ఫలితాల్లో పేజీ లింక్లో పరిశీలించిన కనిపిస్తుంది.

3. ఇంగ్లీషు వీకీపీడియా కంటెంట్‌ని encyclopedia.thefreedictionary.com కూడా పోందవచ్చు. వీటితో పాటు  Reference.com లేదా  Answers.com ద్వారా కంటెంట్ ఫలితాలు తెలుసుకోండి.

4. మీ డెస్క్ టాప్, బ్రౌజర్, ఫోన్ ద్వారా ఆఫ్‌లైన్ వీకీపీడియాని యాక్సెస్ చేసుకోవడానికి  ఆఫ్‌లైన్  సోల్యుషన్స్ ఉన్నాయి. వీకీపీడియాని ఆఫ్‌లైన్ ద్వారా వినియోగించుకునేందుకు గాను Kiwix అనే ఓపెన్ సోర్స్ ని రూపొందించారు.

Kiwix మీరు ఉపయోగించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా, http://www.kiwix.org/index.php/Main_Page#Wikipedia_files లింక్ లోకి వెళ్లి మీ కంప్యూటర్‌లోకి డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే Kiwixని ఓపెన్ చెయ్యండి.

5. మొబైల్ అప్లికేషన్స్ ద్వారా కూడా వీకీపీడియాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మార్కెట్లో ఉన్న ఏదైనా వీకీపీడియా అప్లికేషన్‌ని మీ మొబైల్‌లోకి ఇనిస్టాల్ చేసుకోని వీకీపీడియా కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot