50% Lenovo స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

Written By:

మోటో, వైబ్ బ్రాండ్‌ల క్రింద తాము ఈ ఏడాది విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లలో 50% భారత్‌లోనే తయారవుతాయని లెనోవో (Lenovo) తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ల తయారీకై ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ ఇండియాతో గతేడాది ఆగష్ట్‌లో లెనోవో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ మొబైల్ తయారీ ప్లాంట్ చెన్నై సమీపంలో ఉన్న శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇక్కడే లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు తయరుకానున్నాయి. 60 లక్షల ఫోన్‌లను తయారీ చేసే సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి ఉంది. మరిన్ని వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

చైనాలో కాకుండా మోటో ఇంకా లెనోవో ఫోన్‌లను తయారు చేస్తున్నది ఒక్క భారత్ మాత్రమే.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

భారత్‌లో తమ తయారీ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తామని లెనోవో ఇండియా స్మార్ట్‌ఫోన్స్ డైరెక్టర్ సుదిన్ మతుర్ తెలిపారు.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

గూగుల్ వద్ద నుంచి మోటరోలా మొబిలిటీ విభాగాన్ని, లెనోవో 2014లో 2.9 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

ప్రముఖ యూఎస్ బ్రాండ్‌లలో ఒకటైన మోటరోలాకు భారత్‌లో మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ ఫోన్‌లను ప్రత్యేక బ్రాండ్ లేబుల్ క్రింద విక్రయిస్తామని లెనోవో తెలిపింది.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

2015లో లెనోవో, మోటరోలాలు సంయుక్తంగా భారత్‌లో 80 లక్షల ఫోన్‌లను విక్రయించగలిగాయి. 2014లో ఈ అమ్మకాల సంఖ్య 49 లక్షల యూనిట్లుగా ఉంది.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

ఓ ప్రముఖ రిసెర్చ్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు భారత్‌లో మూడవ అతిపెద్ద బ్రాండ్‌గా లెనోవో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో సామ్‌‍సంగ్, మైక్రోమాక్స్‌లు కొనసాగుతున్నాయి.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్న లెనోవో, తమ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా భారత్‌లో మోటో సిరీస్ ఫోన్‌లను
ఫ్లాగ్‌షిప్ మోడల్స్ గానూ, వైబ్ సిరీస్ ఫోన్‌లను ఇతర బ్రాండ్‌లకు ఛాలెంజర్ మోడల్స్‌గా తీర్చిదిద్దనుంచి.

50% లెనోవో స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

భారత రిటైలింగ్ మార్కెట్లో తమ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే జూన్ నాటికి దేశవ్యాప్తంగా 60 నుంచి 100 సర్వీస్ సెంటర్ల‌‍‌ను కొత్తగా ఏర్పాటు చేయబోతోంది.

మార్కెట్లోకి తాజా మోటో ఎక్స్ ఫోర్స్

Shatterproof స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'ను సోమవారం ఇండియన్ మార్కెట్లో లెనోవో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌‍లో పొందుపరిరచిన మోటో షాటర్‌షీల్డ్ ఫీచర్ ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఫోన్ క్రింద పడినప్పటికి ఎలాంటి ప్రమాదానికి లోను కాదు. షాక్ ప్రభావాన్ని తట్టుకోగలిగే ఫైవ్ లేయర్ ఇంటిగ్రేటెడ్ సిస్టంతో మోటో ఎక్స్ ఫోర్స్ డిస్‌ప్లేను అభివృద్థి చేసారు...

 

 

మార్కెట్లోకి తాజా మోటో ఎక్స్ ఫోర్స్

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1440×2560పిక్సల్స్) విత్ మోటో షాటర్‌షీల్డ్ టెక్నాలజీ,ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0), 2.0గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో), కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీ), టర్బో చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మూడు కలర్ వేరియంట్‌‍లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. వైట్, బ్లాక్ ఇంకా గ్రే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
50 Percent of Lenovo smartphones to be made in India in 2016. Read More in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot