ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్‌లు ఇవే

Written By:

ఆపిల్ కంపెనీ రహస్యంగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. ఓ రకంగా చెప్పాలంటే అవి క్రేజీ ప్రాజెక్ట్లు. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో దూసుకుపోతూ కష్టమర్ల మదిని దోచుకుంటున్న ఆపిల్ ఇప్పుడు చేపట్టిన క్రేజీ ప్రాజెక్టులతో వారిలో ఇంకా ఉత్సాహం పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆపిల్ చేపట్టిన ఆ క్రేజీ రహస్య ప్రాజెక్టులేంటి. అవి ఎటువంటి సంచలనాలకు తెరలేపబోతున్నాయో తెలసుకోవాలనుకుంటున్నారా..అయితే ఇంకెందుకాలస్యం..కింద స్టోరిని చదివేయండి.

Read more: యాహూ.. నా ఆనందానికి హద్దుల్లేవ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ కారు

ఆపిల్ కారు ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. దీన్ని ప్రాజెక్టు టైటాన్ అని కూడా పిలుస్తున్నారు. దీన్ని 2014లో టిమ్ కుక్ అనౌన్స్ చేశారు. దీన్ని కాలిఫోర్నియాలో ఆపిల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేశారు. గూగుల్ సెల్ప్ డ్రైవింగ్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చినట్టే ఆపిల్ కూడా సెల్ప్ డ్రైవింగ్ కార్లు మార్కెట్ లోకి తీసుకురావాలని ఆ మీటింగ్ లో డిస్కస్ చేశారు.

డ్యూయెల్ కెమెరా ఫర్ ఐ ఫోన్ 7

ఆపిల్ కంపెనీ మార్కెట్ లోకి డ్యూయెల్ కెమెరా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. రెండో కెమెరాలో ఫోటోలను అత్యంత షార్ప్ నెస్ అలాగే బ్రైట్ నెస్ తో వచ్చే విధంగా మార్కెట్ లోకి వదలాలని ప్రయత్నిస్తోంది. ఐ ఫోన్ 7 డ్యూయెల్ కెమెరాతో మార్కెట్ లోకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

లైట్ స్ప్లిట్టంగ్ ప్రిజమ్ కెమెరా

కెమెరాకు వివిధ రకాల రంగులను అమర్చే ప్లాన్ కూడా ఐ ఫోన్ చేస్తోంది. ఆ కెమెరాకు రకరకాల రంగులను అమర్చి వాటితో కెమెరాను సెట్ చేస్తోంది. ఈ రంగులు రెడ్ ,గ్రీన్ ,బ్లూ కలర్స్ లో ఉంటాయని సమాచారం.

ఆర్గ్యూమ్ రియాలిటీ విత్ 3డీ సెన్సింగ్

ఆపిల్ కంపెనీ 3డీ సెన్సింగ్ ను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటికే ఆపిల్ కంపెనీతో ప్రైమ్ సెన్స్ అనే సంస్థ కలిసి పనిచేస్తోంది. అలాగే రెండు సంవత్సరాల క్రితం ఆపిల్ కంపెనీ ఇజ్రాయెల్ కంపెనీనీ 350 మిలియన్ల డాలర్లకు కొన్నది. మరి ఈ 3డీ సెన్సింగ్ దీనికి వాడుతారనేది తెలియదు.

వీఆర్ హెడ్ సెట్

ముందు కళ్లతోనే అద్భుతాన్ని వీక్షించే వీఆర్ హెడ్ సెట్ కూడా ఆపిల్ కంపెనీ సీక్రెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఉంది.

ఐ ట్రాకింగ్ 3డీ ఫోన్ డిస్ ప్లే

కనుసైగలతోనే బీ ఫోన్ డిస్ ప్లే ని మార్చే సరికొత్త టెక్నాలజీకి ఆపిల్ పచ్చజెండా ఊపింది. ఇది కూడా త్వరలో ఆపిల్ కష్టమర్లను కనువిందు చేయనుంది.

ఎ వి స్టైల్ గేమ్స్ కన్ సోల్

ఇప్పుడు ఆపిల్ కొత్తగా గేమ్స్ మార్కెట్ లోకి కూడా ఎంటర్ కాబోతోందని సమాచారం.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write 7 Crazy Projects Apple Are Secretly Working On
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot