అరచేతిలో అద్భుతాల మయం..!

Posted By:

నేటి మన డిజిటల్ ప్రపంచంలో కమ్యూ్నికేషన్ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. ఫిజికల్ ఫోటో ఆల్బమ్‌లకు కాలం చెల్లిపోయింది. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా తమ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటున్న మోడ్రన్ గీక్స్ తమకు నచ్చిన ఫోటోలను అధునాతన పద్ధతుల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భవిష్యత్ ఫోటో షేరింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర ఫోటో స్లైడర్ స్టోరీ...

Read More: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త మొబైల్ యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు వెహికల్స్ వీడియో స్ర్కీన్‌లతో వస్తున్నాయి. దూర ప్రయాణాల్లో భాగంగా ఈ వీడియో స్ర్కీన్స్ మనల్ని ఎంటర్‌టైన్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. టయోటా, జనరల్స్ మోడల్స్ వంటి ప్రముఖ కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో ఇంటరాక్టివ్ కార్ విండో కాన్సెప్ట్‌ను అభివృద్థి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ అడ్వాన్సుడ్ కార్ విండోస్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే వెనక సీట్లలో కూర్చునే ప్యాసింజర్లు ఈ విండోస్ ద్వారా తమకు సమీపంలో ఉన్న ఆబ్జెక్ట్ లను ఫోటో లేదా వీడియో రూపంలో క్యాప్చర్ చేసుకోవచ్చు. డ్రాయింగ్స్ అలానే మేసేజ్‌లను రోడ్డు పై ప్రయాణిస్తోన్న ఇతర ప్రయాణికులకు ఈ విండో ద్వారా కన్వే చేయవచ్చు.

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

ఫోటోలను మీ అరచేతిలోనే భద్రపరుచుకుని కావల్సిన సమయంలో వాటిని డిస్‌ప్లే చేసుకునే విధంగా అడ్వాన్సుడ్ బయోసెన్సార్ యూజర్ ఇంటర్‌ఫేస్ రూపుదిద్దుకుంటోంది. మైక్రోసాఫ్ట్ ఈ తరహా ప్రాజెక్ట్ పై పనిచేస్తోంది.

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

క్లౌడ్ కంప్యూటింగ్

భవిష్యత్ ఫోటో షేరింగ్ ప్రక్రియలో క్లౌడ్ కంప్యూటింగ్ మరింత క్రియాశీలక పాత్ర పోషించనుంద. ఇప్పటికే డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, ఫ్లికర్ , స్మగ్ మగ్ వంటి క్లౌడ్ సర్వీసులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

 

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

ఎలక్ట్రానిక్ పేపర్

పలుచటి శరీర తత్వంతో ఎటు కావాలంటే అటు వొంపుకునే విధంగా ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌‌ప్లేలు త్వరలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఫోల్డబుల్ టెక్నాలజీ రాకతో ఫోటో షేరింగ్ మరింత విప్లవాత్మకం కాబోతోంది.

 

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

డిజిటల్ క్లాతింగ్

గూగుల్ గ్లాస్ రాకతో వేరబుల్ టెక్నాలజీ మరింత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసందే. ఈ సాంకేతికతను మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో దుస్తులకు ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలను ఇంటిగ్రేట్ చేసేందుకు డిజైనర్లు సిద్ధమయ్యారు. డిజిటల్ క్లాతింగ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే మీకు నచ్చిన ఫోటోలతో పాటు యానిమేషన్‌లను షర్ట్ పై డిస్‌ప్లే చేయవచ్చు.

 

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

ఇంటరాక్టివ్ హోలోగ్రామ్స్

భవిష్యత్‌లో రాబోతున్న 3డీ హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే ఫోటో షేరింగ్ వ్యవస్థను మరింత విప్లవాత్మకం చేయనుంది.

 

భవిష్యత్‌లో ఫోటో షేరింగ్ ఏలా ఉండబోతోంది..?

అందుబాటులోకి మాగ్నటిక్ టేప్స్

సోనీ సంస్థ ఇటీవల నానోటెక్నాలజీతో కూడిన మాగ్నటిక్ స్టోరేజ్ టేప్‌లను ఆవిష్కరించింది. సోనీ సంస్థ తీసుకువచ్చిన ఈ ఒక్కో మాగ్నటిక్ టేప్ 185 టెరాబైట్స్ డేటాను రికార్డ్ చేయగలదు. ఇది 3,700 బ్లు-రే డిస్కుల డేటాతో సమానం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 High Tech Ways to Share Images in Near Future. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot