కోట్లాస్తి మాకొద్దంటున్న దానకర్ణులు

|

దానం చేయండంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన భారతీయులు..వ్యాపారంలో తమకు వచ్చిన లాభాలను సమాజ సేవకు ఉపయోగిస్తూ నవ భారత దాన కర్ణులుగా గుర్తింపు పొందుతున్నారు. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసిన ఆసియా పసిఫిక్ రీజియన్‌లోని దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఇందులో ముగ్గురు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు, దుబాయ్‌కి చెందిన విద్యాసంస్థ నిర్వాహకులు ఉన్నారు. 13 దేశాల్లో చేసిన సర్వేలో వీరిని ఎంపిక చేసినట్లు ఫోర్బ్స్ ఆసియా ఎడిషన్ ప్రకటించింది. సో వారు ఎవరెవరో వారిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : సెక్స్ సినిమాలపై ఆశతో 30 వేలు వదిలాయి

సేనాపతి గోపాలక్రిష్ణన్... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు
 

సేనాపతి గోపాలక్రిష్ణన్... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు

విద్యా వైద్య రంగంలో అపారంగా కృషి చేస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

నందన్ నీలేకని... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు

నందన్ నీలేకని... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు

ఆరోగ్య ,విద్య వైద్య రంగాలకు అపారంగా దానాలు చేస్తున్నారు.

ఎస్డీ షిబులాల్ ... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు

ఎస్డీ షిబులాల్ ... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు

విద్యా, వైద్య రంగంలో భారీ ఎత్తున విరాళాలు అందించారు.

రోహన్‌..ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి కుమారుడు

రోహన్‌..ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి కుమారుడు

ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి కుమారుడు రోషన్ కూడా పురాతన భారతీయ ప్రాచీన గ్రంథాల ప్రచారానికి హార్వార్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కు 5.2మిలియన్ డాలర్లు (రూ.34,56,44,000) విరాళం ఇచ్చారు.

సన్నీ వర్కీ.. 14 దేశాల్లో 70 పాఠశాలలు
 

సన్నీ వర్కీ.. 14 దేశాల్లో 70 పాఠశాలలు

కేరళకు చెందిన సన్నీ వర్కే కూడా ప్రముఖ దాతల జాబితాలో చోటు దొరొకింది. వర్కీ దుబాయ్‌ కేంద్రంగా జెమ్స్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో 19 దేశాల్లో 70 ప్రైవేట్‌ స్కూల్స్‌ నడుపుతున్నారు.ఈయన తనకున్న 250 కోట్ల డాలర్ల విలువైన ఆస్తిలో సగం ఆస్తులను విద్య, ఆరోగ్య కార్యక్రమాలకు దానం చేస్తానని జూన్‌ లో ప్రకటించారు.అలాగే బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు 2.25 మిలియన్ డాలర్లు (రూ.14,95,57,500) అందించారు.

సురేశ్ రామకృష్ణన్.. లండన్ వ్యాపారవేత్త

సురేశ్ రామకృష్ణన్.. లండన్ వ్యాపారవేత్త

ఫోర్బ్స్ పత్రిక ప్రముఖ దాతల జాబితాలో సురేశ్ రామకృష్ణన్ ఉన్నారు. లండన్‌లో దుస్తుల తయారీరంగంలో అగ్రశ్రేణిలో ఉన్న ఈయన భారత్‌లో 4వేల మందికి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు 3మిలియన్ డాలర్లు (రూ.19,94,10,000) విరాళం ఇచ్చారు.సురేశ్ రామకృష్ణన్,మహేష్ రామకృష్ణన్ ఇద్దరూ అన్నదమ్ములు

మహేశ్ రామకృష్ణన్.. లండన్ వ్యాపారవేత్త

మహేశ్ రామకృష్ణన్.. లండన్ వ్యాపారవేత్త

ఫోర్బ్స్ పత్రిక ప్రముఖ దాతల జాబితాలో మహేష్ రామకృష్ణన్ ఉన్నారు. లండన్‌లో దుస్తుల తయారీరంగంలో అగ్రశ్రేణిలో ఉన్న ఈయన భారత్‌లో 4వేల మందికి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు 3మిలియన్ డాలర్లు (రూ.19,94,10,000) విరాళం ఇచ్చారు.సురేశ్ రామకృష్ణన్,మహేష్ రామకృష్ణన్ ఇద్దరూ అన్నదమ్ములు

జాబితాను వెల్లడించిన ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ పత్రిక

జాబితాను వెల్లడించిన ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ పత్రిక

జాబితాను వెల్లడించిన ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ పత్రిక.ఏటా బిలియనర్స్ ను వెల్లడిస్తూ ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Seven Indians feature in Forbes Asia's ninth Heroes of Philanthropy list, highlighting most noteworthy contributions to philanthropy from 13 countries across Asia Pacific.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X