సెక్స్ మోజు రూ.30 వేలు క్లోజు

Posted By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ స్మార్ట్ పోన్ లేనిదే బయటి ప్రపంచానికి అడుగుపెట్టరు.ఇక స్మార్ట్ పోన్ చేతిలో ఉంది కదా..దానికి నెట్ కనక్ట్ పెట్టి కావాల్సిన యాప్స్ అన్నీ డౌన్ లోడ్ చేసుకుంటారు. ఇక మంచి మసాలా కోసం అందరూ ఫోర్న్ మూవీస్ ను చూడాలని తెగ తాపత్రయపడుతుంటారు కదా..అయితే ఈ పోర్న్ మూవీస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మొదటికే మోసం వస్తుంది..మీకు డబ్బులు వదులుతాయి. వదిలేది ఏంది ..ఇప్పటికే చాలా మంది తమ డబ్బులను వదిలించుకున్నారు. ఎలా వదిలించుకున్నారో కింద చూడండి మీకే తెలుస్తుంది.

Read more at:బ్లాక్ బెర్రీకి బాలీవుడ్ ఫిదా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అడల్ట్‌ ప్లేయర్‌

అడల్ట్‌ ప్లేయర్‌.. ఆండ్రాయిడ్‌ ఆపరేటిగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లలో వినియోగదారులకు ఇటీవలికాలంలో వలవేస్తున్న ప్రమాదకరమైన యాప్‌ ఇది.

సర్వీసులన్నీ బంద్

అశ్లీల వీడియోలను చూడటానికి ప్రత్యేకం అంటూ ఆకర్షించే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయగానే.. ఫోన్‌లో ఉన్న సర్వీసులన్నిటినీ నిలిపివేస్తుంది.

ఫ్రంట్‌ కెమెరాతో వినియోగదారు ఫొటో

ఆ తరువాత ఫ్రంట్‌ కెమెరాతో వినియోగదారు ఫొటో తీస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది మనకు అసలు సమస్య.. ఎఫ్‌బీఐ పేరుతో స్క్రీన్‌పై ఒక మెసేజ్‌ కనిపిస్తుంది.

ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌

మీరు అశ్లీల చిత్రాలు చూశారు.. ఈ చిత్రాలు చూసినందుకు ఆ ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నాంమంటూ ఓ సందేశం మీకు వస్తుంది.

తొలగించుకోవాలంటే 500 డాలర్లు

మీరు దాన్ని వెంటనే తొలగించుకోవాలంటే 500 డాలర్లు (దాదాపు రూ.33,000) చెల్లిస్తేగానీ బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించబోమని ఈ మేసేజ్ సారాంశమన్నమాట

గప్‌చుప్ గా ఆ సొమ్ము కట్టేసి ఫోన్‌ లాక్‌

ఆ మేసేజ్ వచ్చిన తరువాత ఇక ఫోన్ పనిచేయదు...చేసేది లేక బయటకు చెప్పుకోలేక ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా మంది గప్‌చుప్ గా ఆ సొమ్ము కట్టేసి ఫోన్‌ లాక్‌ తీయించుకుంటున్నారు.

గుర్తించిన జడ్‌ స్కేలర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ పరిశోధక సంస్థ

అయితే ఈ యాప్ పై ఓ సెక్యూరిటీ సంస్థ కన్ను పడటంతో ఈ విషయం బయటకు వచ్చింది. జడ్‌ స్కేలర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ పరిశోధక సంస్థ ఈ పోర్న్‌యా‌ప్ ను మొదటిసారిగా గమనించింది.

ఫోన్‌ను సేఫ్‌మోడ్‌లో స్టార్ట్‌

ఫోన్‌ను సేఫ్‌మోడ్‌లో స్టార్ట్‌చేసి, ఈ యాప్‌నకు ఉన్న అడ్మినిస్ట్రేటర్‌ హక్కులను తీసేసి అన్‌ఇన్‌స్టాల్‌ చేయవచ్చని జడ్‌ స్కేలర్‌ సూచించింది.

పోర్న్ యాప్ ఉంటే వెంటనే తీసిపారేయండి

సో మీ మొబైల్ లో ఈ పోర్న్ యాప్ ఉంటే వెంటనే తీసిపారేయండి.లేకుంటే 30 వేలు వారికి సమర్పించుకోవాల్సి రావచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

ఈ పేజీని లైక్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ పొందండి

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Forget nuclear facility sabotage; ignore stock market glitches; the world of cyber-threats just got serious.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot