ఈ బంపర్ ఆఫర్లు ఎక్స్‌క్లూజివ్‌గా ఆండ్రాయిడ్ యూజర్లకే!

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్.. ప్రస్తుతం యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలకు ప్రపంచమే దాసోహమంటోంది. మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టం‌ల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని సగర్వంగా చెప్పుకోటానికి పలు అంశాలను ఆండ్రాయిడ్ ప్రియులకు సూచించటం జరుగుతోంది...

(ఇంకా చదవండి: అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏ కేబుల్‌తోనైనా ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ విషయంలో ఇలా కదురదు.

ఆండ్రాయిడ్ ఫోన్ మోడల్స్‌కు సంబంధించి మార్కెట్లో వందల కొలది ఫోన్ కేస్‌లు లభ్యమవుతాయి. యాపిల్ ఐఫోన్ లకు పరిమితి స్థాయిలో మాత్రమే ఫోన్ కేస్‌లు లభ్యమవుతాయి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కావల్సిన స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతాయి. యాపిల్ ఐపోన్ లు లిమిటెడ్ స్ర్కీన్ వేరియంట్ లలో మాత్రమే లభ్యమవుతాయి.

ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను విడుదల రోజునే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌ల విషయంలో ఇలా కదురదు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వివిధ బ్రాండ్‌లు ఆఫర్ చేస్తోన్న నేపధ్యంలో నెలకో ఫ్లాగ్‌షిప్ మోడల ఫోన్ మార్కెట్లో విడుదలవుతుంటుంది.

వాయిస్ సెర్చ్, నేవిగేషన్ వంటి ఫీచర్లు గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్ లలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తాయి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లక్షల కొలది యాప్‌లను సపోర్ట్ చేస్తాయి. ఇందుకు కారణం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండటమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 things only Android users will understand. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot