గెలాక్సీ ఎస్6 గురించి 7 ఆసక్తికర విషయాలు

Posted By:

సామ్‌సంగ్ ఫోన్‌లంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్. ఈ బ్రాండ్ నుంచి కొత్త వర్షన్ ఫోన్ విడుదలవుతుదంటే చాలు టెక్నాలజీ ప్రపంచమంగా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా సామ్‌సంగ్, తన గెలాక్సీ సిరీస్ నుంచి విడుదల చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు అన్ని మార్కెట్లలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎన్నో అంచనాలతో గతేడాది మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5 అభిమానులను నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి.

ఈ క్రమంలో సామ్‌సంగ్ తన 2015 ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్6' ఇటీవల భారత్ మార్కెట్లో విడుదలచేసింది. 5.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఎక్సినోన్ 7420 ఆక్టా‌కోర్ 64 బిట్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, మాలీ టీ760 ఎంపీ8 ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేక ఫీచర్లు డివైస్ లో ఉన్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గెలాక్సీ ఎస్6 గురించి మీరు తెలుసుకోవల్సిన 7 ఆసక్తికర విషయాలను మీ ముందుంచుతున్నాం.....

ఇంకా చదవండి: బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 సరికొత్త డిజైనింగ్‌ను కలిగి ఉంది. గ్లాస్ ఇంకా మెటల్ లుక్‌తో ఫోన్‌కు మరింత క్రియేటివ్ లుక్ ను తీుసుకువచ్చింది.

ఎక్సినోస్ 7 ఆక్టా కోర్ ప్రాసెసర్ (2.1గిగాహెర్ట్జ్ ఇంకా 1.5గిగాహెర్ట్జ్), 3జీ ర్యామ్ వంటి ఫీచర్లను గెలాక్సీ ఎస్6 కలిగి ఉంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, హెచ్ డీఆర్ షూటింగ్ మోడ్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను గెలాక్సీ ఎస్6 కలిగి ఉంది.

గెలాక్సీ ఎస్6 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

స్టోరేజ్ గెలాక్సీ ఎస్6 మూడు ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 32జీబి, 64జీబి, 128జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ లోపించింది.

గెలాక్సీ ఎస్6 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Things You Need To Know About Samsung Galaxy S6. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot