సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో ఇప్పుడు వీటికే భారీ డిమాండ్ !

Written By:

ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అనేక ఆందోళనకర వార్తలు బయటకొస్తున్నాయి.ఇప్పటికే ఐటీ ప్రొఫిషనల్స్ పై పలు ఆసక్తికర సర్వేలు వెలువడుతుండగా... తాజాగా మరో ఆందోళనకర రిపోర్టు వెల్లడైంది. కంపెనీలకు 100కి పైగా రెజ్యూమ్ లు వస్తుండగా.. వారిలో 3,4 మంది మాత్రమే ఈ స్కిల్స్ కు తగ్గట్టు ఉంటున్నారని తెలిసింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి.

అంతా రిలయన్స్ జియో పుణ్యమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐటీ ఇండస్ట్రీలో

ఐటీ ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉన్న డేటా సైంటిస్టులు, సాప్ట్ వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా ఇంజనీర్లు, యూఐ(యూజర్ ఇంటర్ ఫేస్), యూఎక్స్(యూజర్ ఎక్స్ పీరియెన్స్)లను నియమించుకోవడం కంపెనీలకు క్లిష్టతరమని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.

70 శాతం ఐటీ ప్రొఫిషినల్స్

అదేవిధంగా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న 70 శాతం ఐటీ ప్రొఫిషినల్స్ ఈ కొత్త స్కిల్స్ కు అప్ గ్రేడ్ కాలేరని తేల్చాయి. ఈ స్కిల్స్ కలిగిన చురుకైన అభ్యర్థులు డిమాండ్ కంటే సగానికి తక్కువగా ఉన్నారని సర్వేలు పేర్కొన్నాయి.

అన్ని ఇండస్ట్రీల్లో ఈ పొజిషన్లకు డిమాండ్

అన్ని ఇండస్ట్రీల్లో ఈ పొజిషన్లకు డిమాండ్ ఉంటుందని, కానీ ఐటీ సెక్టార్ లో వీటికి మెజార్టీ డిమాండ్ ఉందని ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ సంస్థ బెలాంగ్ తెలిపింది. నౌకరి, గ్లాస్ డోర్, కామ్ స్కోర్, గూగుల్ ట్రెండ్స్, నాస్కామ్, గిట్ హబ్, ట్విట్టర్ వంటి రిక్రూట్ మెంట్ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వేను వెలువరించింది.

డిమాండ్ మించిపోయి సప్లై

జావా డెవలపర్, ఆటోకాడ్, మైక్రోకంట్రోలర్ ప్రొగ్రామింగ్, సొల్యుషన్ ఆర్కిటెక్ట్ వంటి కొన్ని స్కిల్స్ లో డిమాండ్ మించిపోయి, సప్లై ఉండగా.. డేటా ఇంజనీర్లు, సాప్ట్ వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా సైంటిస్టులు తక్కువగా లభ్యమవుతున్నారని సర్వేల్లో తెలిసింది.

ఇతర పొజిషన్స్ లో సప్లైకి మించి డిమాండ్

ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇతర పొజిషన్స్ లో సప్లైకి మించి డిమాండ్ ఉందన్నారు. ఈ కొత్త కోర్సులను కూడా చాలా కాలేజీలు తమ సిలబస్ లో చేర్చడం లేదని రిక్రూట్ మెంట్ సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
70% IT professionals can't upgrade to new skills: Report read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting