అవి బయటకు వచ్చి ఉంటే పెను వినాశనమే

Written By:

ప్రపంచాన్ని నడిపిస్తోంది ఇప్పుడు ఆయుధాలే. క్షణాల్లో భస్మీపటలం చేసే ఆయుధాల తయారీ కోసం అన్ని దేశాలు కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నాయి. లక్షల కోట్ల డబ్బులు ఆ ఆయుధాల తయారీ కోసం వెచ్చిస్తున్నాయి. అగ్రరాజ్యాలతో పాటు చిన్నా చితకా దేశాలు సైతం ఆయుధాలను సముపార్జించుకునే దిశగానే అడుగులువేస్తున్నాయి. అయితే ఈ దశలో ఇప్పటికీ కొన్ని ఆయుధాలకు కోట్ల ఖర్చు పెట్టారు. అవి తయారీకానే లేదు. అవి బయటకు వచ్చుంటే ఇక పెను వినాశనం జరిగి ఉండేది.

Read more: నేతాజీ చివరి రోజుల మిస్టరీపై వెబ్‌సైట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లూనార్ న్యూక్లియర్ బాంబ్

ప్రాజెక్ట్ 119-ఎగా ఇది సుపరిచితం. అప్పట్లో సోవియట్ యూనియన్ అంతరిక్షంలో దూసుకుపోతున్న తరుణంలో యునైటెడ్ స్టేట్స్ ఈ బాంబ్ ను తయారుచేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంది. దీన్ని తయారుచేసి చంద్రమండలం మీదకు పంపాలని యుఎస్ అనుకున్నా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ది పేడే లోన్ కిల్లర్ : రుణాల ఉత్పత్తి

25000 డాలర్లు 5 సంవత్సరాల రీపేమేంట్ తో అలాగే డౌన్ పేమెంట్ ఏమీ లేకుండానే కష్టమర్లకు అందించే ప్లాన్ .దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. కాని అది కార్యరూపం దాల్చలేదు. నిమిషానికి 5 ఆపర్లు అలాగే ప్రతిపాదన ఫ్రీ.. అనుకున్నా కాని అది మెట్లెక్కలేదు.

ఐస్ బర్గ్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్

ప్రాజెక్ట్ హబాక్కుక్ గా అందరికీ ఇది పరిచయం. రెండవ ప్రపంచ యుద్ధంలో దీన్ని తయారుచేయాలని భావించారు. ఆకాశంలోకి విమానం ఐస్ అలాగే కలపగుజ్జు తీసుకెళ్లే విధంగా ప్లాన్ కూడా చేశారు. కొద్ది రోజులు వేచి చూసిన తరువాత ఎందుకు వేస్ట్ అని ఆలోచనను విరమించుకున్నారు.

ది ఫ్లయింగ్ డోరిటో

ఎ-12 అవేంజర్ టూనే ఈ ఫ్లయింగ్ డోరిటో. ఇది అననుకూల వాతావరణ సమయాల్లోనూ బాంబులను మోసుకెళ్లగలిగే అత్యంత విధ్వంసకరమైన విమానం. దీన్ని యునైటెడ్ స్టేట్స్ నేవీ ఆర్మీలో వాడుతోంది. ఏ 12 తయారు చేయడానికి ఖర్చు పరంగా కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఆ ఖర్చును భరించలేక 1991 తరువాత ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 5 బిలియన్ ప్రాజెక్ట్ ఇది.

సోవియట్ డూమ్స్ డే పరికరం

1990 దశకంలో సోవియట్ యూనియన్ లో ఉన్న అత్యంత పవర్ పుల్ లీడర్ల ప్లాన్ ఇది. స్వయం చాలకంగా ఘోరమైన విధ్వంసాన్ని సృష్టించడం ఈ ప్లాన్ లో భాగం. అణుదాడులు కాంతి. రేడియో ధార్మికత ఇంకా అధిక పీడనం ఇలా వీటన్నింటిపై ప్రభావం చూపే విధంగా ఆయుధాలను తయారుచేయాలనుకున్నారు. ఇది రష్యన్ బాలిస్టిక్ మిషన్ నుంచి ప్రయోగించాలని కూడా భావించారు. అయితే ఇది ఏమయిందో అది ఆగిపోయింది. ఇదే బయటకు వచ్చి ఉంటే పూర్తిగా అణు నియంత్రణ వ్యవస్థ ఇప్పుడు సోవియట్ చేతిలో ఉండేది.

ది ఆన్ లాండబుల్ ప్లాన్

ఇది ఎప్పుడూ గాలిలోనే తిరుగుతూ ఉంటుంది. ఏవైనా ఆయుధాలను మోసుకెళ్లాల్సిన సమయంలో మాత్రమే కిందకి ల్యాండ్ అవుతుంది. యుఎస్ గవర్నమెంట్ నుంచి పుట్టుకువచ్చిన ఆలోచన ఇది. దీని పని ఆకాశంలో తిరుగుతూ అన్ని దేశాల షిప్ లను సర్వనాశనం చేయడమే..పైలెట్లు కూడా ల్యాండ్ చేయలేరు దీన్ని.

ఇంట్రూడెర్ ఫ్రమ్ ది ప్యూచర్

ఇదొక విధ్వంసకర విమానం.బాంబులను తీసుకెళ్లడం ఆకాశం నుంచి వదలడమే దీని పని. ఈ ప్రాజెక్ట్ పేరే బి-70. ఖర్చు తడిసి మోపెడవుతుందని దీన్ని 191లో ఆపేశారు. భవిష్యత్తు కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అధిక ఎత్తులో ఉపరితలం నుంచి గగనతల క్షిపణులను మెరుగుదల అలాగే ప్రోగ్రామ్ యొక్క అధిక అభివృద్ధి వ్యయాలు, ఖండాతర బాలిస్టిక్ క్షిపణి (ICBM లు) పరిచయం వీటివల్ల ఇది ఆగిపోయింది.

ది ధండర్ స్క్రెచ్

టర్బన్ ఇంజిన్ వారు తయారుచేయాలనుకున్న విమానం ఇది. దీని సౌండ్ దెబ్బ తట్టుకోలేక దీన్ని ఆపేశారు. దీని శబ్దం దాదాపు 25 మైళ్ల వరకు వినిపించేది. ఆ శబ్దం కూడా చెవులకు అంత వినసొంపుగా ఉండేది కాదు..దాంతో ఈ ప్రాజెక్టు రద్దయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HereWrite 7 Secret Weapons That Were Never Completed
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot