నేతాజీ చివరి రోజుల మిస్టరీపై వెబ్‌సైట్

Written By:

సుభాష్ చంద్రబోస్..పరిచయం అక్కరలేని పేరు..అంతేకాదు నిలువెత్తు ధైర్యానికి నిదర్శనం. ఆయన పేరు వింటే చాలు ఆంగ్లేయుల వెన్నెముకలో చలి పుట్టేది. ఆ పేరు ఒక్కసారి తలుచుకుంటే చాలు నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది. భారతీయుల హృదయాల్లో ఎన్ని తరాలైన సజీవంగా ఉన్న మహనీయుల పేర్లు బయటకు తీస్తే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది నేతాజీ మాత్రమే. అంతటి ఖ్యాతిని గడించిన నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీలానే ఉంది. అయితే ఇప్పుడు ఆయన పేరుతో ఓ వెబ్‌సైట్ బయటకు వచ్చింది.

Read more: విషాదాలతో హోరెత్తిన ట్విట్టర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చివరి రోజుల్లోని ఆసక్తికర విషయాలపై

నేతాజీ సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లోని ఆసక్తికర విషయాలపై నిజాలను తెలుసుకునేందుకు యుకెలో ఓ వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఆ వెబ్ సైట్ పేరు www.bosefiles.info.

ఈ వెబ్ సైట్ లో నిజాల్ని తెలిపే కధనాలు

ఫ్రీడం ఫైటర్ అలాగే సుప్రీం కమాండర్ ఆప్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఈ వెబ్ సైట్ ను అంకితమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక కుట్రల సిద్ధాంతాలకు అసత్య ఆరోపణలకు వేదికగా మారిన బోస్ చరిత్రపై ఈ వెబ్ సైట్ లో నిజాల్ని తెలిపే కధనాలు ఉన్నాయి.

ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అలాగే బోస్ మేనల్లుడు

దీన్ని యుకె వేదికగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అలాగే బోస్ మేనల్లుడు అయిన ఆశిష్ రాయ్ ప్రారంభించారు. దీన్ని ఇండియా ప్రజలకు అంకితం చేస్తున్నామని ఆయన తెలిపారు.

సుభాష్ చంద్రబోస్ పై జరుగుతున్న ఇన్విస్టిగేషన్..

గత 25 సంవత్సరాలుగా సుభాష్ చంద్రబోస్ పై జరుగుతున్న ఇన్విస్టిగేషన్.. దానిపై నిజనిజాలు నిగ్గు తేల్చడమే ఈ వెబ్ సైట్ ప్రధాన ఉద్దేశమని ఆయన చెబుతున్నారు.

నేతాజీ జీవితం గురించి తెలుసుకోవడానికి

ఇండియాలోని ప్రజలు నేతాజీ జీవితం గురించి తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ బాగా ఉపకరిస్తుందని వారు తెలుపుతున్నారు. అయితే నేతాజీ 1996లో చనిపోయారని అది మిస్టరీయేనని వెబ్ సైట్ అబౌట్ సెక్షన్ లో పొందుపరిచారు.

1945లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో

1945లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే అది నిజం కాదని ఆయన అప్పుడు చనిపోలేదని బతికే ఉన్నారని నేతాజీ కూతురుతో పాటు ఆమె కుమారుడు డాక్టర్ ఫాప్ చెబుతున్నారు. ఈ వాదనలు నమ్మదగినవిగానూ ఉన్నాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన దస్త్రాలు బహిర్గతమైనప్పటికీ

అయితే ఈ విషయం ఇలా ఉంటే ఇప్పటికీ ఇండియాలో చాలా మంది ఆయన యునైటెడ్ సోవియట్ నుంచి పారిపోయారనే కథనాలు వినిపిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన దస్త్రాలు బహిర్గతమైనప్పటికీ ఆయన అదృశ్యం, మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

బోస్ మేనల్లుడు ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు

అక్టోబర్ లో మోడీ రష్యా పర్యటనలో అనేక నిజాలు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. మోడీ పుతిన్ ల మధ్య ఈ విషయంపై చర్చ కూడా జరిదిందని సమాచారం. బోస్ మేనల్లుడు ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని, ఈ విషయం రష్యాకు కూడా తెలుసని స్పష్టం చేశారు.

1945కు సంబంధించి బోస్ వివరాలు కోరుతూ

తాను విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయం స్పష్టంగా ఉందని రాయ్‌ పేర్కొన్నారు. 1945కు సంబంధించి బోస్ వివరాలు కోరుతూ 1991, 1995 మధ్య భారత్, రష్యాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నకళ్లను ఆయన వెల్లడించారు.

అప్పటి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని

1945 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో రష్యా భూ భాగంలోకి నేతాజీ ప్రవేశించారా? అని అప్పటి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని రాయ్ చెప్పారు. ‘1991 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం రష్యా ఫెడరేషన్‌కు లేఖ రాసింది. బోస్ మీ దేశానికి రావడం లేదా అక్కడ ఉండడం జరిగిందా? అని భారత్ అడిగింది' అని ఆయన పేర్కొన్నారు.

బోస్ మా దేశం వచ్చినట్టుగానీ ఇక్కడ ఉన్నట్టుగానీ సమాచారం లేదు

భారత్ లేఖపై 1992 జనవరిలో రష్యా బదులిస్తూ ‘బోస్ మా దేశం వచ్చినట్టుగానీ ఇక్కడ ఉన్నట్టుగానీ సమాచారం లేదు' అని స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు. మరో మూడేళ్ల తర్వాత మరోసారి కూడా భారత ప్రభుత్వం రష్యాకు లేఖ రాసింది.

రష్యా తన పాత సమాధానాన్నే

1945, ఆ తర్వాత ఎప్పుడైనా నేతాజీ సోవియట్ యూనియన్‌కు వచ్చారా, అక్కడ కొంతకాలం ఉన్నారా అన్నది పురాతత్వ, చారిత్రక విభాగాలను సమన్వయం చేసుకొని కచ్చితంగా నిర్ధారించాలని భారత్‌ కోరింది. అయినా రష్యా తన పాత సమాధానాన్నే పునరావృతం చేసింది.

నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయినట్టు కచ్చితమైన ఆధారాలు

అయితే రెండు దేశాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పరిశీలిస్తే నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయినట్టు కచ్చితమైన ఆధారాలు లేవని దీనిపై ప్రభుత్వం కూడా ఓ నిర్ధారణకు రాలేకపోయిందన్న సంగతి అర్థమవుతోందని అన్నారు.

ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ ఈ వాదనను

కాగా, 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు చెప్తున్నారు. ఆ తేదీన విమాన ప్రమాదం జరిగితే.. అందుకు ఆధారాలు చూపించాలని వారు కోరుతున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ ఈ వాదనను విశ్వసించడం లేదు.

ఈ వెబ్ సైట్ రాకతో నేతాజీ మరణం మిస్టరీపై

ఈ వెబ్ సైట్ రాకతో నేతాజీ మరణం మిస్టరీపై అలాగే ఆయన జీవితంపై మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Website on Netaji's last days launched in UK
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot