మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

Posted By:

ల్యాప్‌టాప్ పై ముఖ్యమైన పనిని నిర్వహిస్తున్నపుడు బ్యాటరీ పవర్ కొరత కారణంగా ఆ ల్యాప్‌టాప్ స్పందించటం మానేస్తే ఆ చికాకు అంతా ఇంతా కాదు. ల్యాప్‌టాప్‌తో బయటకు వెళుతున్న సమయంలో సదరు డివైజ్ బ్యాటరీ ఛార్జింగ్‌ స్థాయిని చెక్ చేసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

(చదవండి: 10 సోషల్ మీడియా వండర్స్)

పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన ల్యాప్‌టాప్‌లకు బ్యాటరీ అనేది ఎంతో కీలకంగా మారింది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ల్యాపీ స్పందించటం మానేస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచుకునేందుకు 10 అత్యుత్తమ మార్గాలను మీకు సూచిస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

యూఎస్బీ ఆధారిత ఎక్సటర్నల్ డివైస్‌లను డిసేబుల్ చేయటం ల్యాప్‌టాప్‌కు జతచేసిన అన్ని యూఎస్బీ ఆధారిత ఎక్సటర్నల్ డివైస్‌లను తొలగించటం ద్వారా ల్యాపీ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

ల్యాప్‌టాప్ ఎల్‌సీడీ స్ర్కీన్‌ బ్రైట్నెస్‌‍ను గరిష్టంగా తగ్గించుకోవటంతో పాటు కీబోర్ట్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

స్పీకర్లను మ్యూట్‌లో పెట్టుకోవటం, మల్టీ మీడియా సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండటం ద్వారా ల్యాపీ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.స్ర్కీన్ సేవర్‌లను స్విచ్ ఆఫ్ చేయటం ద్వారా ల్యాపీ బ్యాటరీని ఎంతో కొంత మేర ఆదా చేసుకోవచ్చు.

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

ల్యాప్‌టాప్ బ్యాటరీని చార్జ్ చేసే క్రమంలో ఓరిజినల్ అడాప్టర్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది.

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

సీడీ, డీవీడీ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచటం ద్వారా ల్యాపీ బ్యాటీరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు.

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ మరింతగా మెరుగుపడాలంటే..?

అవసరం లేని యాప్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ శక్తిని కొంత మేర ఆదా చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Tips for Longer Laptop Battery Life. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot