గూగుల్ వాచ్.. బోలెడన్ని సౌకర్యాలు

Posted By:

తాజాగా వెల్లడైన ఓ మార్కెట్ రిసెర్చ్ సర్వే బిత్తరపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. భారీ అంచనాలతో మార్కెట్లో విడుదలైన యాపిల్ వాచ్ మొదటి రోజు విక్రయాలు ఏడాది పాటు విక్రయించిన ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌‍వాచ్‌లతో సమానమట. యాపిల్ వాచ్ దెబ్బకు గూగుల్ స్మార్ట్‌వాచ్ సాఫ్ట్‌వేర్ తుడిచిపెట్టుకుపోయినప్పటికి 9 కారణాలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌నే ఉత్తమ ఎంపికగా చూపిస్తున్నాయి. అవేంటంటే..?

ఇంకా చదవండి (చరిత్రను చూసొద్దాం రండి!! )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ వాచ్‌లు వివిధ వెరైటీలలో లభ్యమవుతున్నాయి. ఇందుకు కారణం అనేక కంపెనీలు వీటిని ఆఫర్ చేయటమే. మోటరోలా, ఎల్‌జీ, హువావీ, సామ్‌సంగ్, సోనీ వంటి కంపెనీలు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోఇప్పటికే అందిస్తున్నాయి.

 

యాపిల్ వాచ్ స్క్వేర్ డిజైన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌లు వివిధ సర్క్యులర్ డిజైన్‌లలో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతున్న మోటో 360, ఎల్‌జీ జీ వాచ్  ఆర్‌లుసాంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి.

 

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌ల కోసం బయట మార్కెట్లలో వందల మోడళ్లలో 22ఎమ్ఎమ్ సైజ్ స్టాండర్డ్ బ్యాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ వాచ్‌లకు ఈ సౌలభ్యత లేదు. కేవలం కంపెనీ అందుబాటులో ఉంచిన బ్యాండ్‌లతోనే సరిపెట్టుకోవల్సి ఉంది.

 

గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ పై స్పందించే స్మార్ట్‌వాచ్‌లు అవసరానికి అనుగుణంగా ఖచ్చితమైన సమచారాన్ని డిస్‌ప్లే చేస్తాయి.

పనితీరు విషయంలో సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్‌తో పోలిస్తే గూగుల్ నౌ ఉత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక వర్షన్ ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్ ధర 159 డాలర్లు కాగా, ప్రాథమిక వర్షన్ యాపిల్ వాచ్ ధర 350 డాలర్లు.

యాపిల్ వాచ్‌ను మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే, ఆ వాచ్ మీకండటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే యాపిల్ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. బుక్ చేసుకుంటు రెండు మూడు రోజుల్లో మీకు చేరే అవకాశం ఉంది.

 

యాపిల్ వాచ్ బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం 18 గంటలు ఉండగా, ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్ ఫామ్ పై స్పందించే మోటో 360 వాచ్ 24 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 ways Google's smartwatches are better than the Apple Watch. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot