Aarogya Setu App: రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్‌లు!!!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మరియు వాటి ప్రభుత్వాలు కరోనా వైరస్ COVID-19 లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను ట్రాక్ చేయడానికి కొన్ని రకాల యాప్ లను రూపొందించాయి. అటువంటి వాటిలో ఒకటి ఆరోగ్య సేతు యాప్. దీనిని భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

ఇది COVID-19 సోకిన ఇతర వ్యక్తులను సులభంగా గుర్తించడానికి ప్రజలకు సహాయపడుతుంది. ఈ యాప్ ను విడుదల చేసిన తరువాత ఇది అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది కొద్ది కాలంలోనే భారతీయులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్మార్ట్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ యాప్ వాడకం ఖచ్చితం చేసింది.

కొన్ని ప్రదేశాలలో ఈ యాప్ ను తప్పనిసరి చేయబడింది కాబట్టి మీరు దీన్ని మీ స్మార్ట్ ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. భారత ప్రభుత్వం దీనిని విడుదల చేసి కేవలం 41 రోజులు మాత్రమే అయింది. కానీ ఇండియాలో ఇప్పటికే ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల్లో ఈ యాప్ యొక్క డౌన్‌లోడ్ల సంఖ్య 100 మిలియన్లకు పైగా దాటింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆరోగ్య సేతు యాప్ దేనికి సహాయపడుతుంది?
ఆరోగ్య సేతు యాప్ స్పష్టమైన పనితీరును కలిగి ఉండడం వలన ఇది మిమ్మల్ని అప్రమత్తంగా మరియు సురక్షితంగా ఉంచుతుంది. ఈ యాప్ ను ఉపయోగించే ప్రతిఒక్కరికీ కలర్ కోడ్‌ను నిర్దేశిస్తుంది. మీకు దగ్గరలో COVID-19 లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తి వస్తే కనుక ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. COVID-19 లక్షణాలను గుర్తించడానికి మరియు వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించడానికి స్వీయ విశ్లేషణ చేయడానికి కూడా యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది.

ఆరోగ్య సేతు యాప్ ను భారత ప్రభుత్వం ప్రారంభించిన మూడు రోజులలోనే ఈ యాప్ 5 మిలియన్ల డౌన్‌లోడ్‌లను దాటింది. ఈ వారం ప్రారంభంలో ఈ యాప్ 98 మిలియన్ల డౌన్‌లోడ్‌లను తాకింది. ఇది 100 మిలియన్ల మార్కును చేరుకోవడానికి మరి కొంత సమయం మాత్రమే పడుతుంది.

ఆరోగ్య సేతు యాప్ విజయవంతం కావడానికి కారణాలు
ఆరోగ్యా సేతు యాప్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్ లలో ఒకటిగా మారింది. ఈ యాప్ విజయవంతం కావడానికి కారణం దాని ప్రయోజనం మరియు సాధారణ రూపకల్పన మాత్రమే కాదు దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత మద్దతు లభించినందు వలన దీనిని అధిక మంది తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.

PM మోడీ
PM మోడీ తన బహిరంగ సమావేశాలలో కూడా ఈ యాప్‌ను ఉద్దేశించి చాలా సార్లు ప్రసంగించారు. దీని కారణంగా కూడా చాలా మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలిగారు. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ తమ యొక్క ఫోన్లలో ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ప్రస్తుత సమయంలో మీరు రైళ్లు లేదా విమానాలలో ప్రయాణిస్తుంటే కనుక మీరు ఖచ్చితంగా మీ ఫోన్లో ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యాప్ విజయవంతం
ఈ యాప్ విజయవంతం అయినప్పటికీ కొంతమంది దీనికి సంబంధించిన భద్రతా బెదిరింపుల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మీ అన్ని కదలికలను ట్రాక్ చేయగలదు మరియు సైబర్ నేరస్థులు యాప్ డేటాతో మిమ్మలిని చిక్కులలో పడవేసే అవకాశం కూడా ఉంది అని భయపడుతున్నారు. కానీ ఇటువంటి విషయంలో భయపడవలసిన అవసరం లేదు అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.


Click it and Unblock the Notifications








