Home
News

ACT Fibernet దీర్ఘకాలిక ప్లాన్‌లతో 6నెలల వరకు ఉచిత సబ్స్క్రిప్షన్....

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ACT ఫైబర్నెట్ ఇప్పుడు తన వినియోగదారులకు అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నది. అలాగే కొన్ని దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లతో అదనపు చెల్లుబాటును కూడా అందిస్తున్నది. ACT ఫైబర్నెట్ హైదరాబాద్లో కొన్ని దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఆరు నెలల వరకు సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, జియోఫైబర్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్‌ల నుంచి పోటీని ఎదుర్కోవడానికి ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అనుకోని మార్పులను తీసుకువస్తున్నది. ఈ కొత్త మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హైదరాబాద్‌లో ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్

హైదరాబాద్‌లో ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్

హైదరాబాద్‌లో ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ తన వినియోగదారులకు ఆఫర్‌లతో మొత్తం ఆరు ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఎ-మాక్స్ 500, ఎ-మాక్స్ 700, ఎ-మాక్స్ 1075, ఎ-మాక్స్ 1325, ACT ఇన్క్రెడిబుల్ 1999 మరియు ACT గిగా 5999 పేరుతో మొత్తం ఆరు ప్లాన్‌లను 24 నెలలు, 12 నెలలు, 6 నెలలు మరియు ఒక నెల వంటి నాలుగు చందా మోడళ్లలో అందిస్తున్నారు. అక్టోబర్ 2020 చివరి నాటికి ACT ఫైబర్నెట్ మొత్తంగా 1.74 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉంది. వినియోగదారులను అత్యధిక సంఖ్యలో కలిగిన జాబితాలో మూడవ స్థానంలో ఉంది.

ACT ఫైబర్నెట్ దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ఉచిత సబ్స్క్రిప్షన్

ACT ఫైబర్నెట్ దీర్ఘకాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ఉచిత సబ్స్క్రిప్షన్

ACT ఫైబర్నెట్ యొక్క కస్టమర్ రూ.500, రూ.700, రూ .1,075, రూ .1,325 మరియు రూ .1,999 ధరల వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను 24 నెలల చెల్లుబాటు కాలానికి ఎంచుకుంటే కనుక కంపెనీ కేవలం 18 నెలల మొత్తానికి మాత్రమే వసూలు చేస్తుంది. అయితే ఇది మొత్తం 24 నెలల సభ్యత్వాన్ని అందిస్తుంది. దీని అర్థం వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఆరు నెలల చందాను ఉచితంగా అందిస్తుంది.

 ACT ఫైబర్నెట్

హైదరాబాద్‌లోని ACT ఫైబర్నెట్ యొక్క వినియోగదారులు పైన తెలిపిన ప్లాన్‌లను 12 నెలల సభ్యత్వంతో ఎంచుకుంటే కనుక వారికి ఉచితంగా రెండు నెలల సభ్యత్వాన్ని పొందవచ్చు. ACT గిగా ప్లాన్ ను ఎంచుకునే వినియోగదారులు పది నెలలు చందా ఛార్జీలు చెల్లించాలి. ఉదాహరణకు ఒక కస్టమర్ A-Max 500 ప్లాన్‌ను ఎంచుకుంటే కంపెనీ 12 నెలల వరకు ముందస్తు మొత్తంగా 5,000 రూపాయలు వసూలు చేస్తుంది. ACT గిగా ప్లాన్ విషయంలో 12 నెలలు కంపెనీ 71,988 రూపాయలు (12 నెలల ఛార్జీలు) వసూలు చేస్తుంది. అయితే ఇది రెండు నెలల సేవలను అదనంగా కూడా అందిస్తుంది. అంటే ఇది మొత్తం 14 నెలల చందాతో లభిస్తుంది.

ACT ఫైబర్నెట్

ACT ఫైబర్నెట్ యొక్క వినియోగదారులు పైన తెలిపిన ప్లాన్‌లను ఆరు నెలల చందాతో దీర్ఘకాలిక ప్లాన్‌తో ఎంచుకుంటే కనుక ACT గిగా ప్లాన్ మినహా ఐదు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు అదనంగా 15 రోజుల చెల్లుబాటు కాలంతో తమ సేవలను ఉచితంగా అందిస్తోంది. అయితే నెలవారీ ప్లాన్‌లతో ఎటువంటి అదనపు సేవలు అందించబడవు.

Best Mobiles in India

English summary
ACT Fibernet Broadband Long-Term Plans Now Offers Up to 6 Months Additional Free Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X