Home
News

JioFiber కొత్త సర్వీస్!! మొబైల్‌లోనే ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ పొందవచ్చు

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రిలయన్స్ జియోఫైబర్ ప్రారంభం అయినప్పటి నుంచి యూజర్ యొక్క బేస్ ను వేగంగా పెంచుకుంటోంది. 2020 అక్టోబర్‌లో జియోఫైబర్ 1.8 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నది. రిలయన్స్ జియో యొక్క చందాదారుల వృద్ధి ఉహించనప్పటికీ భారతదేశంలో ఉత్తమమైన ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లలో జియోఫైబర్ ఒకటి అని మాత్రం చెప్పలేము. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్‌ అందించే పోటీని తట్టుకోవడానికి జియోఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఉచిత ల్యాండ్‌లైన్ సేవలను కొత్తగా ప్రారంబిస్తున్నది.

JioFixedVoice

JioFixedVoice

జియోఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేయవచ్చు లేదా స్వీకరించవచ్చు. ఈ కొత్త సర్వీసును ‘JioFixedVoice' అనే పేరుతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) విడుదల చేసింది. దీనిని స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాండ్‌లైన్ టెలిఫోన్ రెండింటిలోనూ కాన్ఫిగర్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇస్తున్నది. జియోఫైబర్ ‘మొబైల్‌లో పార్లల్ కాల్స్' అనే ఫీచర్‌ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్

జియోఫైబర్ "మొబైల్‌లో పార్లల్ కాల్స్" ఫీచర్

జియోఫైబర్ నుండి వచ్చిన ఈ తాజా ఫీచర్ వినియోగదారులకు ల్యాండ్‌లైన్ కాల్ వచ్చినప్పుడల్లా వారి స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ పొందడానికి అనుమతిస్తుంది. మొబైల్ ఫీచర్‌లోని పార్లల్ కాల్‌లతో ల్యాండ్‌లైన్ కాల్‌ను వినియోగదారులు ఎక్కడవున్నా కూడా మిస్ అవ్వకుండా సులభంగా పొందే అవకాశాన్ని జియోఫైబర్ అందిస్తుంది. ఈ సర్వీస్ తో వినియోగదారుల యొక్క జియో మొబైల్ నంబర్ మరియు జియోఫైబర్ వాయిస్ నంబర్‌ను ఒకే ఫోన్ లో బంధించడానికి అనుమతిస్తుంది. తద్వారా ల్యాండ్‌లైన్‌కు ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు యూజర్ యొక్క జియో మొబైల్ నంబర్ కూడా రింగ్ అవుతుంది.

మొబైల్‌లో జియోఫైబర్ పార్లల్ కాల్స్ ఫీచర్ ప్రారంభించడం ఎలా

మొబైల్‌లో జియోఫైబర్ పార్లల్ కాల్స్ ఫీచర్ ప్రారంభించడం ఎలా

జియోఫైబర్ యొక్క మొబైల్‌లో పార్లల్ కాల్స్ ఫీచర్ ను ప్రారంభించడానికి ఇప్పటికే ఉన్న జియోఫైబర్ వినియోగదారులు వెబ్‌సైట్ లేదా MyJio మొబైల్ యాప్ లో వారి అకౌంటులోకి లాగిన్ అయిన తర్వాత వారి జియో మొబైల్ నంబర్‌ను నమోదు చేయడానికి స్క్రీన్‌లో కనిపించే ‘మొబైల్‌లో పార్లల్ కాల్స్' విభాగానికి వెళ్ళవలసి ఉంటుంది. వినియోగదారులు తదుపరి దశలో వారి జియో మొబైల్ నంబర్‌ను ధృవీకరించవలసి ఉంటుంది. ఆ తర్వాత జియో మొబైల్ నంబర్ మరియు JioFiberVoice నంబర్ అనుసంధానించబడి ఉంటుంది.

JioFiberVoice Number - Jio Number

JioFiberVoice Number - Jio Number

జియో మొబైల్ నంబర్ మరియు JioFiberVoice నంబర్ అనుసంధానించబడిన తరువాత ల్యాండ్‌లైన్‌లోని యూజర్ యొక్క JioFixedVoice నంబర్‌కు ల్యాండ్‌లైన్ కాల్ వచ్చినప్పుడు కస్టమర్ యొక్క జియో మొబైల్ నంబర్ కూడా రింగ్ అవుతుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి ఉండే ఏకైక షరతు జియో మొబైల్ నంబర్ మరియు JioFiberVoice నెంబర్ ఒకే సర్కిల్‌కు చెందినవి అయిఉండడం. ఫిక్సడ్-లైన్ వాయిస్ కాలింగ్ సేవలను విజయవంతంగా యాక్టీవ్ చేసిన తర్వాత వినియోగదారులకు JioFiberVoice నంబర్ అందించబడుతుంది.

JioCall App

JioCall App

స్మార్ట్‌ఫోన్‌లలోని జియోకాల్ యాప్ ను ఉపయోగించి జియోఫైబర్ వాయిస్ నంబర్‌తో వాయిస్ కాల్స్ చేయడానికి వినియోగదారులను జియోఫైబర్ అనుమతిస్తుంది. ఈ విషయం ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి అని భావిస్తున్నాము. JioFiberVoice నంబర్‌ను యాక్టీవ్ చేసిన తరువాత వినియోగదారులు లాగిన్ అవ్వడానికి మరియు వాయిస్ కాల్స్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి జియోకాల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆరు వేరువేరు స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారుల యొక్క ఫిక్సడ్-లైన్ నంబర్‌ను సెటప్ చేయడానికి జియోఫైబర్ అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
JioFiber Provide "Parallel Calls on Mobile" New Service: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X