Adsను బ్లాక్ చేసే యాడ్‌బ్లాక్ ప్లస్ బ్రౌజర్
ప్రముఖ ఆండ్రాయిడ్ అప్లికేషన్ యాడ్‌బ్లాక్ ప్లస్ (Adblock Plus) సరికొత్త బ్రౌజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ డివైస్‌లను ఈ సరికొత్త బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్రౌజర్ యాప్ itunes Store ఇంకా Google Play స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
Read More : లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్
ఇతర మొబైల్ బ్రౌజర్‌ల తరహాలోనే స్పందించే Adblock Plus బ్రౌజర్ అదనంగా advertisementలను బ్లాక్ చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్రౌజర్ మాల్వేర్ డొమైన్స్‌తో పాటు ట్రాకర్స్‌ను కూడా నిషేధిస్తుంది. ఇలా adsను బ్లాక్ చేయటం వల్ల 20 శాతం బ్యాటరీ ఆదా అవుతోందని కంపెనీ చెబుతోంది.
Read More : ఓపెన్ సేల్ పై వన్‌ప్లస్ 2, త్వరలో
అత్యధిక మంది నెటిజనులు వినియోగిస్తోన్న వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. ఇందుకు కారణం గూగుల్ క్రోమ్ వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌ను అందించటమే. క్రోమ్ బ్రౌజర్ వేగం వాడుతున్న కొద్ది మందగిస్తుందంటూ పలువురు యూజర్లు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లను ఫాలో అవుతూ చిన్ని చిన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా క్రోమ్ బ్రౌజింగ్ వేగాన్ని రెట్టింపు స్థాయిలో ఆస్వాదించవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే
క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేసి ఆపై తొలగించటం ద్వారా క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేసి ఆపై తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే
క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసిన ప్రతిసారీ కొన్ని ప్లగిన్‌లు డిఫాల్ట్‌గా వస్తుంటాయి. కాబట్టి వాటిలో అవసరంలేని ప్లగిన్‌లను గుర్తించి వాటిని డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే
బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం ద్వారా బ్రౌజింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే
గూగుల్ క్రోమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే
క్రోమ్ బ్రౌజర్‌లో అవసరం లేని ట్యాబ్‌లను క్లోజ్ చేయటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే
క్రోమ్ బ్రౌజింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.


Click it and Unblock the Notifications