2జీబి ర్యామ్‌తో లెనోవో కే3 నోట్

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో, తన కే3 నోట్ ఫాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జూన్ 25న నిర్వహించే ఓ ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా ఈ పెద్దతెర డివైస్‌ను మార్కెట్లో ఆవిష్కరించేందుకు లెనోవో సన్నాహాలు చేస్తోంది. ‘కే3 నోట్' ఫాబ్లెట్‌ను లెనోవో తన సొంత మార్కెట్ అయిన చైనాలో గడిచిన మార్చిలో విడుదల చేసింది. భారత్‌లో లెనోవో కే3 నోట్ ధర రూ.10,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది.
(చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా దిగిపోతుందా..?)

లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి
5.5 అంగుళాల 1080 పిక్సల్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
మీడియాటెక్ ఎంటీ6752 సాక్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ ఏ53 సీపీయూ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
(చదవండి: మీ పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేస్తున్నారు..?)


Click it and Unblock the Notifications