30 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం

Written By:

ఓ మహత్తర అద్భుతానికి ఆకాశం వేదిక కానుంది. చరిత్రలో 30 ఏళ్ల తరువాత ఓ మహత్తర దృశ్యం మన కంటికి కనువిందు చేయనుంది. చంద్రుడిని భూమికి అతి దగ్గరగా చూసే భాగ్యం కలగనుంది. నిండైన చందమామను మనం చూడబోతున్నాం. ఈ అధ్బుతం సెప్టెంబర్ 27 న జరగబోతోంది. మరి ఎక్కడెక్కడ చందమామను పూర్తిగా చూడొచ్చు. ఏయే దేశాల్లో చందమామ నిండుగా కనిపించనున్నాడు. ఏ సమయంలో అది జరగబోతోంది ఇటువంటి అంశాలను ఓ సారి చూద్దాం.

Read more : సూర్యుడిపై భారీ సుడిగుండం..యూరోపాపై వేట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చంద్రుడు భూమికి అతి సమీపంలోకి

ఈ నెలలో ఆకాశంలో ఓ అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు 30 ఏండ్ల తరువాత చంద్రుడు భూమికి అతి సమీపంలోకి రానుండగా, అదే రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సంభవించనున్నది.

27న సంపూర్ణ చంద్రగ్రహణం

ఈ నెల 27న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్నదని, గంటకు పైగా భూమి చంద్రుడిని కప్పివేస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మంగళవారం తెలిపింది.

గంట 12 నిమిషాలపాటు..

గంట 12 నిమిషాలపాటు కొనసాగే సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో పూర్తిగా కనిపిస్తుంది.

పాక్షికంగా ..

భారత్‌తోపాటు పశ్చిమాసియా, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుందని పేర్కొంది.

రాత్రి సమయంలో చంద్రగ్రహణం

చంద్రగ్రహణం రాత్రి సమయంలో సంభవించనున్నందున ఎటువంటి ముసుగులు లేకుండా దానిని చూడవచ్చని తెలిపింది.

పెరిజీ.. అపోజీ

చంద్రుడి కక్ష్య పరిపూర్ణ వృత్తం కానందున అది కొన్నిసార్లు భూమికి సమీపంగా వస్తుందని.. దీనిని పెరిజీ అని, దూరంగా వెళ్లడాన్ని అపోజీ అంటారని నాసా డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్ నోవా పెట్రో అన్నారు.

ఈ ఏడాదికే ఇది అతిపెద్ద పౌర్ణమి

ఈ నెల 27న మనం పెరిజీని చూడబోతున్నామన్నారు. ఈ ఏడాదికే ఇది అతిపెద్ద పౌర్ణమి అని పేర్కొన్నారు.

చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం అధిక కాంతివంతంగా..

అపోజీకన్నా పెరిజీలో ఉన్నప్పుడు చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం అధిక కాంతివంతంగా ఉంటాడని, అందుకే దీనిని సూపర్‌మూన్ అంటారని వివరించారు.

చంద్రగ్రహణం, సూపర్‌మూన్ ఒకే రోజున...

చంద్రగ్రహణం, సూపర్‌మూన్ ఒకే రోజున సంభవించడం కేవలం ఓ గ్రహ గతిసూత్రం మాత్రమేనని నోవా పేర్కొన్నారు.

దశాబ్దాలకోసారి మాత్రమే..

ఇటువంటి అరుదైన ఘటన కొన్ని దశాబ్దాలకోసారి మాత్రమే సంభవిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు.

1982 తరువాత మళ్లీ 2003లోనే

ఇంతకుముందు ఇటువంటి ఉమ్మడి ఘటన 1982లో సంభవించిందని, మళ్లీ 2033వరకు సంభవించే అవకాశం లేదని పెట్రో తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియోని చూసేయండి

దీనికి సంబంధించిన వీడియోని చూసేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write After 33 years a supermoon eclipse is coming, and NASA is giddy
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot