సూర్యుడిపై భారీ సుడిగుండం..యూరోపాపై వేట

Written By:

భగభగమండే నిప్పుకణికలా ఉండే సూర్యుడిపై సుడిగుండమా అని అశ్చర్యపోతున్నారా..అవును ఇది నిజం సూర్యుడిపై ఓ భారీ సుడిగుండం ఉందని నాసాచెబుతోంది. అది అత్యంత శక్తి వంతమైన సుడిగుండమట. ఆ సుడి గుండాన్ని అయస్కాంత క్షేత్రాలు వెనక్కి ముందుకు లాగుతున్న దృశ్యాల్ని నాసా తన వీడియోలో బంధించింది. దానికి సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఇక ఇప్పటికే చందమామ,అంగారక, ఫ్లూటో ఇలా వరుసపెట్టి ఒక్కో గ్రహాన్ని దాని రహస్యాలను శోధిస్తున్న నాసా ఇప్పుడు యూరోపావేట మొదలెట్టింది. వీటిన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:భూమిని పోలిన మరో భూమి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమి కంటే 10 రెట్లు పెద్దదైన సుడిగుండం

భూమి కంటే 10 రెట్లు పెద్దదైన సుడిగుండం

సూర్యుడి ఉపరితలంపై ఏర్పడిన భారీ ప్లాస్మా సుడిగుండాన్ని నాసా చిత్రీకరించింది. భూమి కంటే 10 రెట్లు పెద్దదైన ఈ సుడిగుండం ఏకంగా 40 గంటలపాటు గుండ్రంగా తిరిగింది. 2015 సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు సౌర సుడిగుండం తిరిగినట్లు నాసా తెలిపింది.

అత్యంత శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు

అత్యంత శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు

సూర్యుడి ఉపరితలంపై అత్యంత శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు సుడిగుండాన్ని ముందుకీ వెనక్కీ లాగుతున్న దృశ్యాల్ని నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ విడుదల చేసింది.

40 గంటల వీడియోను 14 సెకండ్లకు కుదించి యూట్యూబ్ లో అప్ లోడ్

40 గంటల వీడియోను 14 సెకండ్లకు కుదించి యూట్యూబ్ లో అప్ లోడ్

ఈ సుడిగుండంలో తిరిగిన అయాన్ ఐరన్ కణాల్లో 50లక్షల డిగ్రీల ఫారన్ హీట్ వేడి ఉందన్న నాసా, ఆ దృశ్యాల్ని నీలి రంగులో మాత్రమే చూడటానికి వీలవుతుందని తెలిపింది. 40 గంటల వీడియోను 14 సెకండ్లకు కుదించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.

యూరోపాపై నాసా దృష్టి

యూరోపాపై నాసా దృష్టి

చందమామ, అంగారక గ్రహం, ప్లూటో ఇలా వరుసపెట్టి ఒక్కో గ్రహ రహస్యాల్నీ తెలుసుకుంటున్న నాసా, తాజాగా గురుగ్రహ ఉపగ్రహమైన యూరోపాపై దృష్టిసారించింది. అక్కడ గ్రహాంతర వాసులు జీవిస్తూ ఉండొచ్చని భావిస్తోంది. ఇప్పటివరకు అంతుచిక్కని యూరోపా రహస్యాల్ని తెలుసుకునేందుకు భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

ఉపగ్రహంపై దట్టమైన, గడ్డకట్టిన మంచు

ఉపగ్రహంపై దట్టమైన, గడ్డకట్టిన మంచు

మన సౌర కుటంబంలో మిగతా గ్రహాలూ, ఉపగ్రహాలన్నీ ఒక ఎత్తైతే, యూరోపా మరో ఎత్తు. చందమామ పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహంపై దట్టమైన, గడ్డకట్టిన మంచు ఉంది. అది 80కి కిలోమీటర్ల లోతువరకు ఉంది. ఆ మంచులోపల భారీ సముద్రం 20 కిలోమీటర్ల లోతువరకు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రహాంతర వాసులు అక్కడ ఉన్నారా?

గ్రహాంతర వాసులు అక్కడ ఉన్నారా?

గ్రహానికి సంబంధించి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, ఫొటోలను బట్టి ఈ అంచనాకొచ్చారు. మనలా జీవించే గ్రహాంతర వాసులు అక్కడ ఉన్నారా? వేరే జీవులేవైనా ఆ సముద్రంలో ఉన్నాయా? మనం అక్కడికి వెళ్తే జీవించగలమా? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంది నాసా.

యూరోపా దగ్గరకు నాసా ఓ శాటిలైట్ ను పంపబోతోంది

యూరోపా దగ్గరకు నాసా ఓ శాటిలైట్ ను పంపబోతోంది

2020లో యూరోపా దగ్గరకు నాసా ఓ శాటిలైట్ ను పంపబోతోంది. అది 45సార్లు యూరోపా చుట్టూ తిరిగి, ఉపగ్రహాన్ని అత్యంత దగ్గరగా ఫొటోలు తీయనుంది.ఆ ఉపగ్రహంపైకి ఓ చిన్న రోవర్ ను కూడా పంపాలనే ఆలోచనలో ఉంది నాసా.

13వేల కోట్ల రూపాయలు

13వేల కోట్ల రూపాయలు

ఈ ప్రాజెక్టు కోసం అమెరికా ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించిందో తెలుసా? అక్షరాలా 13వేల కోట్ల రూపాయలు. అంటే ఆ డబ్బుతో మన ఇస్రో శాస్త్రవేత్తలు, మార్స్ దగ్గరకు పంపిన మామ్ లాంటి శాటిలైట్లను 35 తయారుచేయగలరు.

ఏలియన్స్ ఉండే ఉంటారని ఊహాగానాలు

ఏలియన్స్ ఉండే ఉంటారని ఊహాగానాలు

మరి యూరోపా కోసం నాసా ఇంతలా ఖర్చుపెడుతోందంటే, కచ్చితంగా అక్కడ ఏలియన్స్ ఉండే ఉంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మరో ఐదు ఉపగ్రహాల్లో కూడా సముద్రం ఉన్నట్లు అంచనా.

మరో ఐదు ఉపగ్రహాల్లో కూడా సముద్రం ఉన్నట్లు అంచనా.

యూరోపాతోపాటు మరో ఐదు ఉపగ్రహాల్లో కూడా సముద్రం ఉన్నట్లు అంచనా. ఐతే యూరోపా, అలాంటి మరో ఉపగ్రహం ఎన్సెలాడస్ పై మాత్రమే జీవులు పుట్టేందుకు అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రహాంతర వాసులు కూడా కనిపించే అవకాశం

గ్రహాంతర వాసులు కూడా కనిపించే అవకాశం

ఎందుకంటే ఈ రెండు ఉపగ్రహాల్లో సముద్రంతోపాటు రాతిపొరలు కూడా ఉన్నాయి. ఫలితంగా రసాయనిక చర్యలు జరిగి, జీవావిర్భావానికి అవకాశాలేర్పడతాయట. యూరోపాపై ఇలాంటివి చర్యలు జరిగివుంటే... గ్రహాంతర వాసులు కూడా కనిపించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A small, but complex mass of solar material gyrated and spun about over the course of 40 hours above the surface of the sun on Sept. 1-3, 2015.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot