జియో తీపికబురు, ఈ సారి కష్టమర్లకు కాదు

Written By:

ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న కష్టమర్లను ఎంతగానో సంబరపెడుతున్న విషయం తెలిసిందే. ఫ్రీ డేటా కాల్స్ అంటూ దిగ్గజాలకు సైతం చుక్కలు చూపించి టెలికం రంగంలో ముందుకు దూసుకుపోతోంది. కష్టమర్లను తన వైపుకు తిప్పుకునేందుకు వారికి వరాల జల్లులను ప్రకటించిన జియో ఇప్పుడు ఉద్యోగులకు తీపి కబురును అందిచనుంది. జియో కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు స్టాక్ ఆప్సన్ ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది.

యాహూ పేరు మారింది , ఇకపై అల్టాబా ఇంక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దశల వారీగా కంపెనీ స్టాక్ ఆప్షన్స్‌ను

ముకేష్ అంబాని తన ఉద్యోగుల కోసం స్టాక్ ఆప్షన్స్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతిభాపాటవాలు కలిగిన వారికి, చందాదారులను యాడ్ చేస్తున్న ఉద్యోగులకు దశల వారీగా కంపెనీ స్టాక్ ఆప్షన్స్‌ను బహుమతులుగా ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి

ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్‌లో

స్టాక్ ఆప్షన్ ప్రొగ్రామ్ ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్‌లో ఉందని, ఈ ఏడాది చివరిలో దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై కంపెనీ మాత్రం స్పందించడం లేదు.

30 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు

ప్రస్తుతం రిలయన్స్ జియోకు 30 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులున్నారు. మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు స్టాక్ ఆప్షన్లను అందించడం ప్రారంభించిన తర్వాత ఇతర ఉద్యోగులకు అందిస్తుందని ఈ విషయం తెలిసిన మరో అధికారి చెబుతున్నారు.

ఉద్యోగి జీతం బట్టి 10 శాతం నుంచి 200 శాతం రేంజ్‌లో

ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం టెలికాం సెక్టార్లో సర్వసాధారణం. ఉద్యోగి జీతం బట్టి 10 శాతం నుంచి 200 శాతం రేంజ్‌లో ఏడాదికి ఒక్కసారి ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ)‌ను దిగ్గజ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు ఉద్యోగులకు అందిస్తున్నాయి.

సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు 10-15 శాతం ఈఎస్ఓపీలు

రిలయన్స్ జియో ఈ ప్రొగ్రామ్‌ను ప్రారంభించినప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు 10-15 శాతం ఈఎస్ఓపీలు పొందుతారని తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లోనే కంపెనీ 4 జీ సర్వీసులను లాంచ్ చేసింది. అప్పటినుంచి వినియోగదారులకు ఉచిత సేవలను జియో కస్టమర్లకు అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
After customers, Reliance Jio now plans to reward its employees with stock options read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot