యాహూ పేరు మారింది , ఇకపై అల్టాబా ఇంక్

Written By:

ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ యాహూ ఇంక్ తన పేరును మార్చుకోబోతోంది. అల్టాబా ఇంక్ అనే కొత్త పేరుతో బయటి ప్రపంచానికి పరిచయం కానుంది. దీంతో పాటు యాహూలో పలు మార్పులు జరగనున్నాయి. వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్‌తో కుదుర్చుకున్న డీల్ ముగిసిన అనంతరం కంపెనీ బోర్డు నుంచి యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించింది. కొత్త పేరుతో రానున్న కంపెనీకి బాస్ గా ఎరిక్ బ్రాండ్ట్ వ్యవహరించనున్నారు.

గతేడాది హాటెస్ట్ కీ వర్డ్ ఇదే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ .32,491.41 కోట్లకు

4.83 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ .32,491.41 కోట్లకు యాహు ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింన విషయం తెలిసిందే. ఇందులో డిజిటల్ అడ్వర్ టైజింగ్, మీడియా ఆస్తులు, ఈమెయిల్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.

డీల్ ముగిసిన అనంతరం

ఈ డీల్ సమయంలోనే యాహూ సీఈవో మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాను మాత్రం కంపెనీలోనే ఉండదలుచుకున్నట్టు పేర్కొన్నారు. కానీ డీల్ ముగిసిన అనంతరం ఆమె రాజీనామా చేయనున్నట్టు యాహూ సంస్థనే సోమవారం తెలిపింది.

అతిభారీ మొత్తంలో డేటా చోరి

వెరిజోన్ , యాహూతో ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగినట్టు వెల్లడైంది. మొదటిసారి 500 మిలియన్ కస్టమర్ అకౌంట్లు, రెండోసారి 100 కోట్లకు పైగా అకౌంట్లు చోరికి గురైనట్టు తెలిసింది.

యాహూ విచారణ చేపట్టిందని

దీంతో వెరిజోన్ యాహూతో కుదుర్చుకున్న డీల్‌లో మార్పులు చేయనున్నట్టు లేదా ఆ లావాదేవీలను ఆపివేయనుందని వార్తలు వచ్చాయి. అయితే యాహూతో తాము బలమైన వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంచుకోవడానికే చూస్తున్నామని, డేటా ఉల్లంఘనల గురించి ప్రస్తుతం యాహూ విచారణ చేపట్టిందని వెరిజోన్ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు.

కొత్త కంపెనీ బోర్డు చైర్మన్‌గా ఎరిక్ బ్రాండ్ట్

ఈ డీల్ పూర్తయిన అనంతరం ఐదుగురు యాహూ డైరెక్టర్లు రాజీనామా చేయనున్నట్టు కూడా యాహూ రెగ్యులేటరీ ఫైలింగ్ ‌లో పేర్కొంది. మిగతా డైరెక్టర్లు అల్టాబాను పాలించనున్నారని, కొత్త కంపెనీ బోర్డు చైర్మన్‌గా ఎరిక్ బ్రాండ్ట్ ని నియమించామని యాహు వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Yahoo to Be Named Altaba, Marissa Mayer to Leave Board After Verizon Deal read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot